• search
  • Live TV
నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

చేతులు లేకున్నా సడలని విశ్వాసం .. కాళ్ళతోనే రాస్తూ , క్రీడల్లో రాణిస్తూ ఓ యువకుడి ప్రస్థానం

|

శారీరక బలం కన్నా సంకల్ప బలం గొప్పది అని నిరూపించాడు నిజామాబాద్ జిల్లాకు చెందిన 15 ఏళ్ళ కుర్రాడు . విధిరాతను ఎదురొడ్డి పోరాటం చేస్తున్నాడు . వైకల్యాన్ని జయించి ముందుకు సాగుతున్నాడు . ఐదేళ్ల వయస్సులో ఓ ప్రమాదంలో చేతులు కొల్పోయిన ఆ విద్యార్థి కాళ్లతో రాస్తూ అందరిని అబ్బుర పరుస్తున్నాడు. అందరిలా చదువులో రాణిస్తూనే క్రీడలలోనూ సత్తా చాటుతున్నాడు . సివిల్ ఇంజనీర్ అవ్వాలన్న తన లక్ష్యం కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నాడు .

చేతులు లేకున్నా కాళ్ళతో రాస్తూ చదువుతున్న కుర్రాడు

చేతులు లేకున్నా కాళ్ళతో రాస్తూ చదువుతున్న కుర్రాడు

నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం బాడ్సి గ్రామంలోని షయాన్ అనే విద్యార్ధి చిన్నతనంలోనేప్రమాడంలో రెండు చేతులు కోల్పోయాడు. అయినా అధైర్యపడకుండా కాళ్లతో తన తన తలరాతను తానే తిరగి రాస్తున్నాడు. అన్ని అంగాలు పని చేస్తున్న వాళ్ళ కంటే ధీటుగా దివ్యాంగుడు అయినప్పటికీ చదువు, ఆటల్లోనూ ది బెస్ట్ గా నిరూపించుకుంటున్నాడు షయాన్. కాళ్లతో.. చకచకా రాసెయ్యటమే కాదు చేతులు లేకున్నా ఆటల్లో రాణిస్తున్నాడు .

 కరెంట్ షాక్ తో రెండు చేతులు పోయిన షయాన్

కరెంట్ షాక్ తో రెండు చేతులు పోయిన షయాన్

ఐదేళ్ల వరకు అందరిలా చలాకీగా ఉన్నా.. షయాన్ అనుకోకుండా కరెంట్ షాక్ తగిలి తన రెండు చేతులు కొల్పోయాడు. మోచేతి వరకు చేతులు లేకున్నా షయాన్ ఎప్పుడు కుంగిపోలేదు. చేతులు లేకున్నా తన తల్లి సాయంతో కాళ్లతో రాయడం నేర్చుకున్నాడు. అలా రాస్తూ.. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు షయాన్. తరగతి గదిలో మిగతా స్డూడెంట్స్ లా.. చదువుల్లో రాణిస్తూ ముందుకు వెళ్తున్నాడు .

సైకిల్ పై స్కూల్ కు .. అన్నిటిలో ముందు ఉండే షయాన్

సైకిల్ పై స్కూల్ కు .. అన్నిటిలో ముందు ఉండే షయాన్

వైకల్యం ఉన్నా.. తాను అందరితో పోటీ పడుతున్నాడు. మోచేతి వరకు చేతులు లేకున్నా.. క్రమం తప్పకుండా సైకిల్ పై స్కూల్ కు వచ్చి తోటి పిల్లల్లా తాను కూడా అన్నిట్లో ముందుటున్నాడు షయాన్. పదో తరగతి చదువుతున్నషయాన్.. విద్యాశాఖ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని పరీక్షలకు సిద్దమవుతున్నాడు. ఎవరైనా దాతలు ముందుకొచ్చి.. తనకు కృత్తిమ చేతులు అందించాలని కోరుతున్నాడు. సివిల్ ఇంజనీర్ కావడం తన లక్ష్యమని షయాన్ చెబుతున్నాడు. బాడ్సిలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న షయాన్ కు.. విద్యార్ధులు, ఉపాధ్యాయుల నుంచి ప్రోత్సాహం, సహకారం ఉంది.

షయాన్ ఆత్మవిశ్వాసానికి టీచర్లు ఫిదా

షయాన్ ఆత్మవిశ్వాసానికి టీచర్లు ఫిదా

ఇటు షయాన్ సైతం చదువులో చూపించే ఆసక్తికి.. టీచర్స్ ఫిదా అవుతున్నారు. చదువుతో పాటు ఆటల్లోనూ రాణిస్తున్నాడని టీచర్లు గర్వంగా చెబుతారు. కరెంట్ షాక్ తో రెండు చేతులు కొల్పోయినా కూడా కాళ్లతో రాస్తూ ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్తున్నాడని తోటి స్నేహితులు షయాన్ ను స్పూర్తిగా తీసుకుంటున్నారు. షయాన్ కు మోచేతి వరకు చేతులు లేకున్నా వాలీబాల్, క్రికెట్, షటీల్ బ్యాడ్మింటన్, క్యారమ్స్ ఆడతాడు .

మంచి వాలీబాల్ ప్లేయర్ .. స్ఫూర్తి దాయకం ఈ విద్యార్ధి పోరాటం

మంచి వాలీబాల్ ప్లేయర్ .. స్ఫూర్తి దాయకం ఈ విద్యార్ధి పోరాటం

స్కూల్ లో జరిగే క్రీడా పోటీల్లో ఖచ్చితంగా పాల్గొంటాడు షయాన్. బెస్ట్ సూడెంట్ గానే కాదు.. మంచి వాలీబాల్ ప్లేయర్ గా షయాన్ కు స్కూల్ లో మంచి పేరు ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. చదువుకోవాలనే ఆరాటంతోనే.. వైకల్యం జయించి ఎందరో స్టూడెంట్స్ కు స్పూర్తిగా ఉన్నాడని చెబుతున్నారు. సాధించాలని పట్టుదల , చెయ్యగలనన్న ఆత్మవిశ్వాసం , నేర్చుకోవాలన్న తపన ఉంటె వైకల్యం అడ్డుకాదని నిరూపిస్తున్నాడు బాడ్సీ షయాన్. అన్ని అంగాలు సక్రమంగా ఉన్నా చదువంటే నిర్లక్ష్యం చూపే పిల్లలున్న నేటి రోజుల్లో ఈ దివ్యాంగుడి ఆత్మవిశ్వాసానికి , పోటీపడి చదివే స్వభావానికి హ్యాట్సాఫ్ .

English summary
The 15-year-old boy from Nizamabad district proved that the strength of will is greater than physical strength. He is fighting with fate. He is moving forward in conquering disability. At the age of five, the student who lost his hands in an accident writes with his legs and makes everyone shock. Like everyone, he excels in sports and studies. He is fighting for his goal of becoming a civil engineer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X