ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రకాశంలో పత్తాలేని 150 కరోనా పాజిటివ్ రోగులు, తప్పుడు అడ్రస్ ఇచ్చి పరార్.. వైద్యుల ఆందోళన

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా వైరస్ రోగులు పెరుగుతోన్న కొద్దీ కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో కొందరు పరీక్షలు చేయించుకున్నారు. అయితే 150 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. కానీ వారు తప్పుడు అడ్రస్ ఇవ్వడంతో ఆందోళన నెలకొంది. వైద్య సిబ్బంది పరుగు తీసి.. తీరా ఇచ్చిన అడ్రస్ ఇంటికి వెళ్తే తప్పుడు అని తెలిసిందే. ఫోన్ చేద్దామంటే స్విచాఫ్ వస్తోంది. ఏం చేయాలో తోచక.. వారు సీసీఎస్ పోలీసులకు విషయం తెలిపారు. దీంతో వారు కరోనా పాజిటివ్ వచ్చిన వారిని పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.

ఏపీలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఈ సమయంలో ఒక్కరు కాదు ఇద్దరు కాదు 150 మంది రోగులు కనిపించడం లేదంటే మాములు విషయం కాదు. వారు ఎక్కడికీ వెళ్లారు .. వారి ద్వారా మరెందరీకి వైరస్ అంటుతుందోననే ఆందోళన నెలకొంది. పోలీసు బృందాలు మాత్రం రంగంలోకి దిగాయి. అయితే వారు ఇచ్చిన అడ్రస్. ఆధార్ కార్డులోని చిరునామా అని వైద్యాధికారులు తెలిపారు. అలా 300 మంది వరకు తమకు చిరునామా ఇచ్చారని పేర్కొన్నారు. మిగతా 150 మందికి నెగిటివ్ వచ్చింది కానీ.. 150 మందికి మాత్రం పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు.

150 coronavirus positive patients are escaped in ap

Recommended Video

Leopard In Hyderabad CCTV Footage, May Have Escaped To Chilkur Forest

తప్పుడు చిరునామా ఇచ్చిన వారి వివరాలను వైద్యాధికారులు పోలీసులకు అందజేశారు. దాని ఆధారంగా పోలీసులు విచారిస్తున్నారు. సీసీఎస్ పోలీసులు.. వారెవరో కనుక్కునే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు. మరోవైపు ఏఫీలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య లక్షా 96 వేల 789కు చేరింది. నిన్న 63 వేల686 శాంపిల్స్ పరీక్షించగా 10 వేల 328 కేసులు వచ్చాయి. గత 24 గంటల్లో 72 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,753కి చేరింది. 8 వేల 516 మంది కోలుకున్నారని.. దీంతో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య లక్ష 12 వేల 870 చేరిందని వైద్యారోగ్య అధికారులు తెలిపారు. 82 వేల 166 మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని వివరించారు.

English summary
150 coronavirus positive patients are escaped in andhra pradesh prakasam district. health officials complaint to police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X