ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కల్లోలం.. అర లక్ష దాటిన పాజిటివ్ కేసులు...తీవ్ర భయాందోళన

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. నిన్న కూడా దాదాపు 10 వేల వరకు కేసులు రాగా.. మొత్తం కేసుల సంఖ్య 3.71 లక్షలు దాటింది. అయితే తూర్పు గోదావరి జిల్లాలో పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. గత 24 గంటల్లో 1353 కేసులు రాగా.. మొత్తం కేసుల సంఖ్య 52 వేల 39కి చేరింది. వీరిలో 33 వేల 946 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 17 వేల 750 మంది మాత్రం చికిత్స తీసుకుంటున్నారు. జిల్లాలో వైరస్ సోకి చనిపోయిన వారి సంఖ్య 343కి చేరింది. తర్వాత కర్నూలు జిల్లాలో కూడా 40 వేల 100 పాజిటివ్ కేసులు వచ్చాయి. అనంతపురంలో 36 వేల కేసులు, చిత్తూరు, గుంటూరు, విశాఖపట్టణం, పశ్చిమ గోదావరిలో 31 వేల చొప్పున కేసులు ఉన్నాయి. ఇటు ప్రకాశం జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. జిల్లాలో పాజిటివ్ కేసులు 20 వేల వరకు చేరుకుంటున్నాయి.

గుడ్ న్యూస్: సెప్టెంబర్ చివరినాటికి హైదరాబాద్‌లో కరోనా తగ్గుముఖం, బిల్లు ఎక్కువేస్తే చర్యలుగుడ్ న్యూస్: సెప్టెంబర్ చివరినాటికి హైదరాబాద్‌లో కరోనా తగ్గుముఖం, బిల్లు ఎక్కువేస్తే చర్యలు

ప్రకాశంలో కూడా.

ప్రకాశంలో కూడా.

ప్రకాశం జిల్లాలో కరోనా విలయ తాండవం చేస్తోంది. మరో 924 కేసులు రావడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19 వేల వరకు చేరింది. నిన్నటివరకు కరెక్టుగా 18,836 మందికి పాజిటివ్ వచ్చింది. అత్యధికంగా ఒంగోలులో 289 కేసులు రికార్డయ్యాయి. గత 24 గంటల్లో కరోనా వైరస్ సోకిన ఐదుగురు మృతి చెందారు. దీంతో జిల్లాలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 248కి చేరింది. మంగళవారం కరోనా నుంచి కోలుకుని 76 మంది డిశ్చార్జ్ అవగా.. 89 మందిని హోం ఐసోలేషన్‌కు తరలించారు. జిల్లాలో ప్రస్తుతం 7324 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యాధికారులు తెలిపారు.

ఏపీలో తగ్గని పాజిటివ్ కేసులు

ఏపీలో తగ్గని పాజిటివ్ కేసులు


ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. నిన్న కొత్తగా 9,927 కరోనా కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4 లక్షలకు చేరువలో ఉంది. సరిగ్గా అంటే 3 లక్షల 68 వేల 744 కేసులు ఉన్నాయి. వీటిలో 89,932 యాక్టివ్ కేసులని వైద్యాధికారులు చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1353 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి.

Recommended Video

Coronavirus in AP: మోస్ట్ ఎఫెక్టెడ్ జిల్లాగా తూర్పుగోదావరి, 4 జిల్లాల్లో ప్రమాదకర పరిస్థితులు!!
జిల్లాలవారీగా కేసులు...

జిల్లాలవారీగా కేసులు...

ఆ తర్వాత స్థానాల్లో చిత్తూరు, నెల్లూరు నిలిచాయి. చిత్తూరులో 967, నెల్లూరులో 949, గుంటూరులో 917, పశ్చిమ గోదావరి 853, విశాఖపట్నం 846, కర్నూలు 781, ప్రకాశం 705, విజయనగరం 667, శ్రీకాకుళం 552, కడప 521, అనంతపురం 494, కృష్ణాలో 322 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ సోకి కొత్తగా 92 మంది చనిపోయారని హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3460కి చేరింది.

English summary
52 thousand corona cases registered in east godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X