మొదటి భార్యను గొడ్డలితో... రెండవ భార్యను రోకలితో.... కొడుకును నేలకు కొట్టి చంపిన...కర్కశకుడు
భార్య హత్యకేసులో జైలు జీవీతం అనుభవించి వచ్చిన వ్యక్తిలో మార్పు వచ్చిందనుకుని మరో అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. అయితే జైలు జీవీతం అనుభవించినా సత్ప్రవర్తన మాత్రం రాలేదు. దీంతో రెండవసారి చేసుకున్న భార్యను సైతం రోకలిబండతో దాడి చేశాడు. దాంతో అగకుండా ఏం జరుగుతుందో తెలియని ఏడాది వయస్సున్న కొడుకును సైతం నేలకు బలంగా కొట్టి చంపాడు. తండ్రి ఉన్మాదంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా.. రోకలితో బాదడంతో తీవ్రగాయాలపాలనై మహిళ పరిస్థితి విషమంగా తయారైంది.

భార్యపై అనుమానం...
ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఓ ఉన్మాది దారుణంగా వ్యవహరించాడు. అప్పటికే జీవీతంలో ఓ తప్పును చేసి జైలుపాలైన వ్యక్తి తిరిగి అదే నేరమయ జీవీతంలోకి వెళ్లిపోయాడు. ఈ దీంతో భార్య, బిడ్డలపై దాడి చేసి చంపి వేశాడు. గిద్దలూరులోని బీసీ కాలనీకి చెందిన చిన్నపుల్లయ్య కడప జిల్లాకు చెందిన రమాదేవీని రెండెళ్ల కిందట రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరి దంపతులకు ఏడాది వయస్సున్న కొడుకు ఉన్నాడు. కాగా పుల్లయ్య రోజువారి కూలిపనులు చేస్తుంటాడు. అయితే పెళ్లైన తర్వాత సంవత్సరం పాటు బాగానే సాగిన సంసారం కొడుకు పుట్టిన తర్వాత భార్యపై అనుమానులను పెంచుకున్నాడు. దీంతో తరచుగా ఆమేతో ఘర్షణకు దిగేవాడు.

భార్యను రోకలితో కొట్టి...కొడుకును నేలకు కొట్టిన
ఈ నేపథ్యంలోనే శనివారం సాయంత్రం భార్యతో గొడవపడిన పుల్లయ్య విచక్షణ కొల్పోయి ఆమెపై రోకలిబండతో దాడిచేశాడు. బలంగా కొట్టడడంతో రమాదేవి అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. అయినా తన కోపాన్ని చల్లార్చుకుని పుల్లయ్య సంవత్సరం వయస్సును కోడుకును తీసుకుని నేలకేసి కర్కశంగా విసిరికొట్టాడు. దీంతో విలవిలలాడిన చిన్నారీ అక్కడిక్కడే మృతిచెందాడు. ఇక రోకలితో కొట్టిన భార్య రమాదేవిని స్థానిక ప్రభుత్వ అసుత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆమే పరిస్థితి కూడ విషమంగా ఉంది.

మొదటి భార్యను హత్య చేసిన పుల్లయ్య
దారుణానికి పాల్పడిన పుల్లయ్య అక్కడి నుండి జారుకున్నాడు. స్వంత భార్యతో పాటు కొడును చంపిననే కనీస అలోచన లేకుండా వ్యవహరించాడు. దీంతో స్థానికులు ఆమెను అసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే పుల్లయ్యకు గతంలో కూడ నేర చరిత్ర ఉంది. పెళ్లి చేసుకున్న మొదటి భార్యపై కూడ ఇదే విధంగా దాడి చేసి చంపాడు.
2009లో అర్థవీడు మండలం, మొహిద్దీన్పురానికి చెందిన లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు, ఒక కుమార్తె సంతానం. 2011లో పుట్టింటికి వెళ్లి రెండో సంతానానికి జన్మనిచ్చిన లక్ష్మీదేవి బాలింతగా ఉండగానే ఆమెపై అనుమానం పెంచుకుని.. కిరాతకంగా గొడ్డలితో నరికి హత్యచేశాడు. ఈ కేసులో అప్పట్లో ఏడేళ్ల జైలు శిక్ష పడింది. తనలో మార్పు వచ్చిందంటూ రమాదేవిని నమ్మంచి రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే మారాడని నమ్మిన ఆమెకు రెండళ్లలోనే నరకం చూపించి హత్యచేసేందుకు యత్నించాడు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!