• search
  • Live TV
ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

విద్యార్థినితో ప్రైవేటు మాస్టారు సహజీవనం..గర్భం దాల్చడంతో మాయం!

|

ఒంగోలు: ప్రకాశం జిల్లాలో ఓ ప్రైవేటు మాస్టారు బరి తెగించాడు. తన వద్ద చదువుకునే ఓ విద్యార్థినికి ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి లోబరచుకున్నాడు. కొద్దిరోజులు సహజీవనం చేశాడు. ఫలితంగా- ఆమె గర్భం దాల్చడంతో అక్కడి నుంచి ఉడాయించాడు. అడ్రస్ లేకుండా పోయాడు. ఈ ఉదంతం వెలుగులోకి రావడంతో బాధిత బాలిక తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. జిల్లా ఎస్పీ దృష్టికి ఈ దారుణాన్ని తీసుకెళ్లారు.

మంగళగిరి ప్రజలు పొర్లించి కొట్టినా బుద్ధి రాలేదా..మాలోకం! సాయిరెడ్డి ఫైర్

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఆదిమూర్తిపల్లెకు చెందిన బాధిత బాలిక తిరుపతిలోని ఓ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది. కడప జిల్లా కలసపాడులోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆమె పదో తరగతి చదువుతున్న సమయంలో అదే జిల్లాకు చెందిన వీరయ్యతో పరిచయం ఏర్పడింది. వీరయ్య అదే పాఠాశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. బాధిత బాలికపై అతను కన్నేశాడు. ప్రేమిస్తున్నాని, పెళ్లి చేసుకుంటానని ఆమె వెంటపడ్డాడు.

A private school teacher in Prakasham district cheated a girl student in the name of love

అతని వలలో చిక్కుకుందా బాలిక. ఇంటర్మీడియట్ విద్య కోసం ఆ బాలిక తిరుపతికి వెళ్లినప్పటికీ వదలలేదు. తరచూ ఫోన్‌లో మాట్లాడేవాడు. గత ఏడాది దసరా సెలవుల సందర్భంగా ఆమె తిరుపతి నుంచి స్వగ్రామానికి వచ్చింది. అదే సమయంలో స్నేహితుని సహకారంతో వీరయ్య ఆమెను ఇంటి నుంచి తీసుకెళ్లాడు. ఆ సమయంలో ఆమె తన వెంట ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, 65 వేల రూపాయల నగదు తీసుకెళ్లింది. ఆమెను సికింద్రాబాద్ కు తీసుకెళ్లాడు వీరయ్య. ఇద్దరూ సహజీవనం చేశారు. తాము భార్యాభర్తలమని ఇరుగు పొరుగు వారిని నమ్మించారు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది.

తమ కుమార్తె కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. బాలిక కోసం కొన్నాళ్లు వెతికినప్పటికీ ఆమె ఆచూకీ దొరకలేదు. అనంతరం ఈ కేసుపై ధ్యాస పెట్టలేదు పోలీసులు. బాధితురాలి తల్లిదండ్రులు మాత్రం తమ పట్టు వదల్లేదు. జిల్లాకు కొత్తగా వచ్చిన ఎస్పీ సిద్దార్థ కౌశల్‌కు ఫిర్యాదు చేశారు. ఫలితంగా- కేసు మళ్లీ పట్టాలెక్కింది.

బాధిత బాలిక సికింద్రాబాద్ లో ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ ఆదేశాల మేరకు గిద్దలూరు పోలీసులు సికింద్రాబాద్ చేరుకుని బాలికను, వీరయ్యను అదుపులోకి తీసుకుని స్వగ్రామానికి తీసుకొచ్చారు. వీరయ్యపై ఫోక్సో చట్టంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... బాలికను ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ఆ బాలికను పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదని వీరయ్య పోలీసుల కౌన్సెలింగ్ లో సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.

English summary
Private School teacher in Prakasham Distict Cheated a Minor girl Student. Veeraiah, resident of Kalasapadu town in Kadapa District was trapped a girl student, who studied 10th class in the same college, in the name of Love. He took the girl to Secunderabad nine months before and living together. In this connection, the girl became a pregnant. Parents lodged a complaint agains Veeraiah. Giddalur Police registered a complain on Veeraiah and took into the custody.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X