• search
  • Live TV
ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సీఎం జగన్ దృష్టిక వచ్చిన ఆ ముగ్గురి సొంత ఎమ్మెల్యేల బాగోతం..! త్వరలో చర్యలు..!!

|

ఒంగోలు/హైదరాబాద్ : వైసిపి ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు కాకముందే కొంత మంది ఎమ్మెల్యేలు చేతివాటం ప్రదర్శించుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. 'అవినీతి రహిత పాలనే లక్ష్యం. మంత్రులు అయినా సరే దారి తప్పితే వారిపై తప్పకుండా వేటు వేస్తాను' ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పిన మాట. ఈ మాటను వాస్తవ రూపం దాల్చేలా ఆయన అడుగులు వేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు ఎవరు అవినీతికి పాల్పడినా ముఖ్యమంత్రి స్థాయికి ఎప్పటికప్పుడు తెలిసేలా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇంటెలిజెన్స్, ఐబీతో పాటు... వైసీపీలోని కొందరు నమ్మకస్తులైన నేతలు ఈ నివేదకలు సిద్ధం చేసి సీఎంవోకి అందేలా చూస్తున్నారు.

వైసిపి ఎమ్మెల్యేల అవినీతి..! సీఎంవోకు చేరిన ఫిర్యాదు.!!

వైసిపి ఎమ్మెల్యేల అవినీతి..! సీఎంవోకు చేరిన ఫిర్యాదు.!!

వాటి ఆధారంగా ప్రకాశం జిల్లా వైసీపీ నేతల కాళ్లకు బంధనాలు వేస్తున్నారు. ఇప్పటికే ఈ నివేదికల ఆధారంగా అధికార యంత్రాంగం, ఎమ్మెల్యేలపై దృష్టి సారించారు. అధికారులు తప్పుచేస్తే వారిపై ఉన్నతస్థాయి అధికారులు చర్యలు తీసుకుంటారు. పార్టీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడితే డైరెక్టుగా.. సీఎం జగన్‌ నేరుగా మాట్లాడేలా ప్రణాళిక రూపొందించారు. ప్రజాప్రతినిధులు దారి తప్పితే నేరుగా పార్టీ పెద్దలు, సీఎం మాట్లాడతారని సమాచారం. జిల్లా నుంచి ఇప్పటికి వెళ్లిన నివేదిక ఆధారంగా... అధికారంలోకి వచ్చి నెల రోజులు కాకుండానే ముగ్గురు ఎమ్మెల్యేలు గీత దాటినట్లు సీఎం జగన్ దృష్టికి వెళ్లింది. ప్రధానంగా ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలోని ఇద్దరు ఎమ్మెల్యేలపై ఆరోపణలు సీఎం టేబుల్ పైకి చేరాయి.

ఏపీ సీఎం జగన్ కు సవాల్ .. బాలికపై సామూహిక అత్యాచార ఘటనలో వైఎస్సార్ తరహా నిర్ణయం తీసుకుంటారా?

బదిలీల్లో తలదూర్చిన ఎమ్మెల్యే..! గమనిస్తున్న ఏపి సీఎం..!!

బదిలీల్లో తలదూర్చిన ఎమ్మెల్యే..! గమనిస్తున్న ఏపి సీఎం..!!

ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో బదిలీల్లో తలదూర్చి అనధికారంగా వసూళ్లు చేస్తున్నారని, మరో నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రభుత్వ భూములు, అధికారుల విషయంలో వసూళ్లకు పాల్పడుతున్నారని సమాచారం. మరోవైపు.. తూర్పున ఉన్న ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా చేతివాటం చూపిస్తున్నట్లు నివేదిక వెళ్లింది. వీటి ఆధారంగా ఆ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో నాయకుల నుంచి కూడా.. తనకు అందిన సమాచారం నిజమా? కాదా? అని కూడా సీఎం సమాచారం తెప్పించారు. వీటి ఆధారంగా ముగ్గురు ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా మాట్లాడాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

అవినీతికి ఆస్కారం ఇవ్వొద్దన్న సీఎం..! కొంతమంది ఎమ్మెల్యేల లెక్కలేనితనం..!!

అవినీతికి ఆస్కారం ఇవ్వొద్దన్న సీఎం..! కొంతమంది ఎమ్మెల్యేల లెక్కలేనితనం..!!

ప్రస్తుతం అధికారుల బదిలీలు జరుగుతున్న నేపథ్యంలో వాటిపై దృష్టి సారించిన సీఎం అవి పూర్తైన తర్వాత పార్టీ నాయకులతో సమావేశమయ్యే అవకాశం ఉందని వైసీపీ వర్గాల అంతర్గత సమాచారం. జిల్లాలోని పలు విభాగాల అధికారుల తీరుపైనా ప్రభుత్వం నివేదికలు సీఎంవోకి చేరాయి. గత ప్రభుత్వ హయాంలో పలు కీలక విభాగాల్లోని అధికారులు అవినీతి చిట్టా ఆధారంగా వారిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనిలో భాగంగానే వికలాంగ సంక్షేమ శాఖలో జరిగిన 50 లక్షల రూపాయల అవకతవకలకు సంబంధించి ఏడీ సింగయ్యపై ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. ఈ విషయంలో నేరుగా అమరావతి నుంచి ఉన్నతస్థాయి అధికారులు సైతం జిల్లా అధికారుల నుంచి నివేదిక కోరారు.

అవినీతికి పాల్పడితే వేటు తప్పదు..! ఆ ముగ్గిరి అంశంలో సీఎం ఏం చేస్తారో..?

అవినీతికి పాల్పడితే వేటు తప్పదు..! ఆ ముగ్గిరి అంశంలో సీఎం ఏం చేస్తారో..?

దీంతోపాటు విద్యాశాఖలో 70 అవుట్‌ సోర్సింగ్‌ పోస్టుల కోసం గత ప్రభుత్వంలో కొందరు అధికారులు లక్ష రూపాయల్లో వసూళ్లు చేశారనే ఆరోపణలున్నాయి. తాజాగా ప్రభుత్వం అవుట్‌ సోర్సింగ్‌ నియమకాలను రద్దు చేయడంతో.. అధికారులకు లంచం ఇచ్చిన అభ్యర్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది వివాదాస్పదంగా మారింది. ఎన్నడూ లేని విధంగా నేరుగా సీఎం జగన్... అధికారులు, ప్రజాప్రతినిధుల అవినీతిపై కన్ను వేయడంతో పార్టీ నాయకుల్లోనూ ఒకింత కంగారు మొదలైంది. ఏ పని చేస్తే.. ఎవరి మెడకు చుట్టుకుంటుందో అని వారు వీలయినంత వరకూ వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. చూడాలి సీఎం నూతన విధానం.. అధికారులు, నేతల్లో ఏ విధంగా మార్పు తెస్తుందో ఏపీ సీఎం తో పాటు కాలమే నిర్ణయించాలి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Based on the report from the district so far ... CM Jagan has gone to the attention of the three MLAs crossing the line in a matter of months of ruling. Allegations against two MLAs, mainly in the western part of Prakasam district, have surfaced on the CM table.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more