ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డాక్టర్ సుధాకర్ కేసులో హైకోర్టు తీర్పు .. ఆమంచి షాకింగ్ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

ఏపీలో డాక్టర్ సుధాకర్ కేసు రాజకీయ దుమారం రేపింది . ఇక డాక్టర్ సుధాకర్ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ షాకింగ్ కామెంట్స్ చేశారు . హైకోర్టు నిర్ణయంపైనే ఆయన వ్యాఖ్యలు చెయ్యటం ప్రస్తుతం చర్చనీయంశంగా మారింది . ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రకాశం జిల్లా చీరాలలో వేడుకలు నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు .

ప్రకాశం జిల్లాలో టీడీపీ ఖాళీ అవుతుందా ? మే 30 కోసమే ఆసక్తికర సమీకరణాలు ?ప్రకాశం జిల్లాలో టీడీపీ ఖాళీ అవుతుందా ? మే 30 కోసమే ఆసక్తికర సమీకరణాలు ?

చిన్న కేసును సీబీఐకి అప్పగిస్తే .. పోలీస్ స్టేషన్ల దగ్గర సీబీఐ ఆఫీస్లు పెట్టాలి

చిన్న కేసును సీబీఐకి అప్పగిస్తే .. పోలీస్ స్టేషన్ల దగ్గర సీబీఐ ఆఫీస్లు పెట్టాలి


డాక్టర్ సుధాకర్ కేసులో సుధాకర్ తరపున వేసిన పిటీషన్ ను సమర్ధిస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వటం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు .డాక్టర్ సుధాకర్ కేసు ఒక పెట్టీ కేసు అని, ఇక దీనిని సీబీఐ కి అప్పగిస్తారా అని ఆమంచి కృష్ణ మోహన్ వ్యాఖ్యానించారు. ఇక డాక్టర్ సుధాకర్ కేసు సీబీఐ కి అప్పగించటంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బ తిన్నాయని , ఇలా ప్రతి చిన్న కేసును సీబీఐకి అప్పగిస్తే ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర కేంద్రం సీబీఐ ఆఫీస్ ఏర్పాటు చెయ్యాల్సి వస్తుందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు .

కరోనా లేకపోతే డాక్టర్ సుధాకర్ విషయంలో కోర్టు తీర్పుపై ఆందోళన చేసేవాడిని

కరోనా లేకపోతే డాక్టర్ సుధాకర్ విషయంలో కోర్టు తీర్పుపై ఆందోళన చేసేవాడిని

ఇక డాక్టర్ సుధాకర్ కేసుపై సీబీఐ విచారణ చేయడంపై యావత్ రాష్ట్రం విస్తుపోయేలా చేసిందని ఆయన వ్యాఖ్యానించారు . కోర్టు తీర్పులను ప్రశ్నించకూడదని కానీ ఇలాంటి తీర్పులతో న్యాయస్థానాలపై నమ్మకం పోతోందని ఆమంచి కృష్ణ మోహన్ తీవ్రంగా విమర్శించారు. ఇక తాను హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా కరోనా లేకపోతే ఆందోళన చేసి ఉండేవాడినని ఆమంచి కృష్ణ మోహన్ చెప్పుకొచ్చారు. ఇది చాలా చిన్న కేసని హైకోర్టు తీర్పు సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

Recommended Video

YSRCP Completes 1Year Governance, CM Jagan To Conduct Review Meetings
 కోర్టు తీర్పుపైనే ధిక్కార స్వరం వినిపించిన వైసీపీ నేత ఆమంచి కృష్ణ మోహన్

కోర్టు తీర్పుపైనే ధిక్కార స్వరం వినిపించిన వైసీపీ నేత ఆమంచి కృష్ణ మోహన్

సహజంగా ఎవరైనా కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఆ తీర్పుకు కట్టుబడే ఉండాలి . ఒకవేళ తీర్పులు అనుకూలంగా లేకున్నా సరే పై కోర్టులకు అప్పీల్ చేసుకుంటారే గానీ ఎవరూ ఈ తరహా వ్యాఖ్యలు చెయ్యరు . కానీ చీరాల వైసీపీ నాయకుడు ఆమంచి కృష్ణ మోహన్ మాత్రం కోర్టు తీర్పుపైనే ధిక్కార స్వరం వినిపించి తీర్పుకు వ్యతిరేకంగా ఆందోళన చేసే వాడిని అని చెప్పటం అందరినీ విస్తు పోయేలా చేసింది .

English summary
Former MLA Amanchi Krishna Mohan made shocking comments on the High Court's verdict on Dr Sudhakar's case. Krishna Mohan has criticized the court verdict in Dr Sudhakar's case that it is a petty case and court handed it over to CBI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X