ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Prakasam: ప్రకాశం పోలీసుల అభయం: రాత్రివేళ మహిళలకు పోలీసు వాహనాల్లో ఫ్రీ పికప్ అండ్ డ్రాప్:

|
Google Oneindia TeluguNews

ఒంగోలు: హైదరాబాద్ కు చెందిన వెటర్నరి డాక్టర్ దిశా హత్యోదంతం అనంతరం.. దేశవ్యాప్తంగా మహిళల భద్రతపై ఆయా ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాయి. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ కూడా చేరింది. ఇప్పటికే బీ సేఫ్ యాప్ ను ఆవిష్కరించిన ఏపీ పోలీసులు.. తాజాగా ఓ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. దీని పేరు అభయ్. రాత్రివేళ మహిళలకు రక్షణ కల్పించడానికి ఉద్దేశించిన పథకం ఇది.

ఫ్రీ పికప్ అండ్ డ్రాప్..

ఫ్రీ పికప్ అండ్ డ్రాప్..

అభయ్ పథకం కింద- రాత్రివేళ తమ ఇంటికి గానీ, ఇతర గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఎలాంటి రవాణా సదుపాయం లేకుండా ఇబ్బందులను ఎదుర్కొంటున్న మహిళలను దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రకాశం జిల్లాలో ప్రవేశ పెట్టారు. ఈ పథకం కింద అలాంటి మహిళలకు ఉచితంగా రవాణా వసతిని కల్పిస్తారు. పోలీసుల వాహనాల్లో ఇంటి వద్ద సురక్షితంగా చేర్చడానికి దీన్ని అమలులోకి తీసుకొచ్చారు.

ఎనిమిది వాహనాలు.. 70 స్కూటర్లు..

ఎనిమిది వాహనాలు.. 70 స్కూటర్లు..

ఈ పథకం కింద ఎనిమిది వాహనాలు, 70 స్కూటర్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు. దీనికోసం మహిళా కానిస్టేబుళ్లను విధుల్లో నియమించినట్లు చెప్పారు. మహిళా కానిస్టేబుళ్లకు వాకీ టాకీ, బాడీ కెమెరాలను అందజేశామని అన్నారు. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు వారు విధుల్లో ఉంటారని చెప్పారు. ఎలాంటి ఆపద వచ్చినా క్షణాల్లో స్పందించేలా ఏర్పాట్లు చేశామని అన్నారు

డయల్ 100కు ఫోన్ లేదా, ఎస్ఓఎస్ సందేశం..

డయల్ 100కు ఫోన్ లేదా, ఎస్ఓఎస్ సందేశం..

గమ్యస్థానాలకు గానీ, ఇంటికి గానీ చేరుకోవడానికి ఎలాంటి రవాణా సౌకర్యం అందుబాటులో లేని సమయంలో మహిళలకు డయల్ 100కు ఫోన్ చేయడం లేదా, ఎస్ఓఎస్ సందేశాన్ని పంపించిన వెంటనే పోలీసులు అప్రమత్తం అవుతారని అన్నారు. ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు ఫోన్ చేసి, వివరాలను సేకరిస్తామని, 10 నిమిషాల్లో ఆమె వద్దకు చేరుకునేలా ఏర్పాట్లను చేశామని చెప్పారు. సదరు మహిళను తమ వాహనాల్లో ఇంటి వద్దకు చేర్చుతామని అన్నారు.

 త్వరలో అన్ని ప్రధాన నగరాల్లో..

త్వరలో అన్ని ప్రధాన నగరాల్లో..

అభయ్ పథకాన్ని త్వరలోనే రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాల్లో అమల్లోకి తీసుకుని రావడానికి పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాలు సహా, ఏజెన్సీ గ్రామాల్లోనూ అమలు చేయాలని పోలీసు శాఖ భావిస్తోంది. మహిళలపై నేరాలు అధికంగా జరిగే ప్రాంతాల్లో విస్తృతంగా అభయ్ పథకం కింద ఫ్రీ పికప్ అండ్ డ్రాప్ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు, దీనిపై విస్తృతంగా ప్రచారాన్ని చేపట్టడానికి సన్నాహాలు చేస్తోంది.

లూధియానాలో ఇదివరకే..

లూధియానాలో ఇదివరకే..


ఈ తరహా పథకాన్ని పంజాబ్ లోని లూధియానా పోలీసులు ఇదివరకే అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. రాత్రివేళల్లో విధులను ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో మహిళా ఉద్యోగులకు క్యాబ్ లు అందుబాటులోకి రాకపోతే..పోలీసు జీపుల్లో ఉచిత రవాణా వసతిని కల్పిస్తున్నారు. మహిళా ఉద్యోగులకు మాత్రమే కాకుండా.. విద్యార్థినులు, ఒంటరి మహిళలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా ఓ హెల్ప్ లైన్ సెంటర్ ను కూడా లూధియానా పోలీసులు ఏర్పాటు చేశారు.

English summary
The Andhra Pradesh police may soon start dropping stranded women home at odd hours in major cities of the state in order to safeguard them against crime. A pilot of the programme named ‘Abhay’ kicked off in the Prakasham district on Wednesday night with eight four wheelers and 70 two-wheelers on standby to pick up women held up at night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X