ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రైతు భరోసా లబ్దిదారుడిగా మంత్రి సురేష్: అర్హుల జాబితాలో పేరు: పలు జిల్లాల్లో ఇదే విధంగా..!

|
Google Oneindia TeluguNews

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న రైతు భరోసా పధకంలో అనేక లీలలు బయటకు వస్తున్నాయి. లబ్ది దారుల ఎంపిక విషయంలో అనేక నిబంధనలు పెట్టిన ప్రభుత్వం ప్రారంభ తేదీ దగ్గర పడే కొద్ది జాబితా పైన సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పధకం ద్వారా ఏ ఒక్క అర్హుడికి అన్యాయం జరగకూడదని..అదే విధంగా ఏ ఒక్క అనర్హుడికి పధకం అందకూడదని ప్రభుత్వం ఆదేశించింది. అయితే, తాజాగా విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేరు ఇప్పుడు ప్రకాశం జిల్లాలో రైతు భరోసా లబ్దిదారుల జాబితాలో కనిపిస్తోంది. దీని పైన అధికారులు మల్ల గుల్లాలు పడుతున్నారు. ప్రభుత్వం లబ్దదారుల ఎంపిక విషయంలో అనేక నిబంధనలను పెట్టింది. ఆదాయపు పన్ను కట్టే వారు..ప్రభుత్వ ఉద్యోగులు..ప్రజా ప్రతినిధులు..అయిదు ఎకరాల పొలం లోపు ఉన్న వారు మాత్రమే అర్హలని స్పష్టం చేసింది. అయితే, ఇప్పుడు తాజాగా ఏకంగా మంత్రి పేరు దర్శనమివ్వటం పైన అధికారులు ఆత్మరక్షణలో పడుతున్నారు.

రైతు భరోసా జాబితాలో మంత్రి పేరు..
ముఖ్యమంత్రి జగన్ నవరత్నాల్లో కీలకమైన రైతు భరోసా ఇంకా ప్రారంభం కాకముందే విమర్శలకు వేదికవుతోంది. ఈ నెల 15న రైతు భరోసా ప్రారంభం కానుంది. ప్రభుత్వం ఈ పధకానికి కొన్ని అర్హతలు నిర్ణయించి..వారి ఖాతాల్లో ప్రతీ ఏటా రూ. 12,500 ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నెల 15న ముఖ్యమంత్రి జగన్ నెల్లూరులో ఈ స్కీం ప్రారంభించనున్నారు. ఈ స్కీం పరిధిలోకి వచ్చే రైతులకు అయిదు ఎకరాల మించి పొలం ఉండకూడదు. అదే విధంగా ఆదాయం పన్ను కట్టే వారు అర్హులు కారు. ప్రజా ప్రతినిధులుగా ఉంటూ ఎంపీపీ..ఎంపీటీసీ..గ్రామ సర్పంచ్ గా చేసిన వారు అర్హులు కాదని ప్రభుత్వం విడుదల చేసిన నిబంధనల్లో స్పష్టంగా ఉంది. అయితే..కౌలు రైతుల విషయంలోనూ కొన్ని నియమ నిబంధనలను విధించింది. దీని పైన రాజకీయంగా విమర్శలు మొదలయ్యాయి. ప్రభుత్వం అందరికీ పధకం వర్తించేలా చేస్తామని హామీ ఇచ్చి షరతులు పెట్టి కుదిస్తోందని విమర్శలు వస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో ఇప్పుడు లబ్దిదారుడిగా మంత్రి పేరు జాబితాలో దర్శనమిస్తోంది.

Ap Minister Adimulapu Suresh name included in govt Rythu Bharosa scheme beneficiary list

మంత్రి సురేష్ పధకం లబ్దిదారుడా..
ప్రభుత్వం ఖరారు చేసిన రైతు భరోసా లబ్దిదారుల జాబితాలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేరు దర్శనమిచ్చింది. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని గనపవరం కు చెందిన ఆదిమూలపు సురేషేగా పేరు జాబితాలో కనిపిస్తోంది. తండ్రి పేరు శామ్యూల్ జార్జిగా నమోదై ఉంది. అదే విధంగాగ్రామంలోని సర్వే నెంబర్ 187-1 గా చూపిస్తున్నారు. అర్హుల జాబితాలో మంత్రి ఖాతా సంఖ్య 181గా నమోదై ఉన్నది. ఇప్పుడు నిభందనలకు విరుద్దంగా ఏకంగా మంత్రినే లబ్దిదారుడుగా చేర్చిన అధికారులు, ఈ విషయం బయటకు రావటంతో తలలు పట్టుకుంటున్నారు. అయితే, ఇది ఉద్దేశ పూర్వకంగా జరిగిందా..పొరపాటున జరిగిందా అనే కోణంలో విచారణ సాగుతోంది. ఇక..ప్రతిపక్షాలు మాత్రం ఏకంగా మంత్రి పేరు లబ్దిదారుల్లో చేర్చారని..వైసీపీ నేతల కోసమే ఈ పధకం అమలు చేస్తున్నారా అంటూ అప్పుడే విమర్శలు మొదలు పెట్టారు. ప్రభుత్వం దీని మీద వివరణ కోరినట్లు సమాచారం.

Ap Minister Adimulapu Suresh name included in govt Rythu Bharosa scheme beneficiary list
English summary
Ap Minister Adimulapu Suresh name included in govt Rythu Bharosa scheme beneficiery's list in prakasam dist. Now this creating political controvery on this shcheme. Cm Jagan decided to inagurated this shceme on 15th of this month in Nellore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X