• search
  • Live TV
ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఏపీ నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ .. ప్రకాశం జిల్లాలో పోస్టర్ కలకలం , టీడీపీలో దుమారం

|

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ,ప్రకాశం జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చేసిన పని తెలుగుదేశం పార్టీ నేతలలో ఆసక్తికరమైన చర్చకు కారణమవుతోంది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక ఫ్లెక్సీ తెలుగుదేశం పార్టీలో కలకలం సృష్టిస్తోంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో ఏపీకి నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ 2024 అంటూ పోస్టర్ లో రాయడం మరోమారు రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు చర్చనీయాంశం అయ్యేలా చేసింది.

<strong>రాజకీయాలు తనకు సెట్ కావంటూ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు .. పవన్ పార్టీ పై కూడా మెగా సంచలనం</strong> రాజకీయాలు తనకు సెట్ కావంటూ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు .. పవన్ పార్టీ పై కూడా మెగా సంచలనం

మరోమారు ఏపీ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు

మరోమారు ఏపీ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు


ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సినీ నటుడు, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన అనేక సందర్భాల్లో వెలుగు చూసింది. తెలుగుదేశం పార్టీ అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు మాత్రమే కాకుండా రాజకీయాల్లో ఆయన వస్తే బావుంటుంది అని ఎదురు చూస్తున్న నాయకులు చాలామంది ఉన్నారు. గతంలో అనేక మంది రాజకీయ ప్రముఖులు, సినీ వర్గాల ప్రముఖులు జూనియర్ ఎన్టీఆర్ టిడిపిని కాపాడతాడని, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే టీడీపీని ముందుకు నడిపించగల నాయకుడు అంటూ అనేకమార్లు వ్యాఖ్యలు చేశారు

వన్ ఇండియా స్పెషల్ పేజ్: మీ ఫ్రెండ్స్‌కు ఈ - గ్రీటింగ్స్‌తో న్యూఇయర్ విషెస్ చెప్పండి.. అంతేకాదు ఆఫర్లు కూడా చూడండి

 ప్రకాశం జిల్లాలో ఏపీ నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అని రాసి పోస్టర్

ప్రకాశం జిల్లాలో ఏపీ నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అని రాసి పోస్టర్

జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తనకు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ఆసక్తి లేదు అనే విషయాన్ని అనేక సందర్భాల్లో అర్థమయ్యేలా చేశారు.

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం లో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో రాబోయే కాలానికి కాబోయే సీఎం అంటూ జూనియర్ ఎన్టీఆర్ తో పాటుగా టిడిపి నేతల ఫోటోలు కూడా ముద్రించారు . దీంతో ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఈ పోస్టర్ పై పెద్ద చర్చ జరుగుతోంది. ఈ ఫ్లెక్సీని ఎవరు ఏర్పాటు చేశారనేదానిపై స్థానికులు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం టిడిపి లో బలమైన, సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు తర్వాత ఎవరు అన్న చర్చ జరుగుతున్న సమయంలో మరోమారు జూనియర్ ఎన్టీఆర్ పేరు తెర మీదికి రావడం ఆసక్తికర పరిణామం.

 గతంలోనూ టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ రావాలనే చర్చ

గతంలోనూ టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ రావాలనే చర్చ

ఏపీలో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓటమిని చవిచూసింది. అంతటి దారుణమైన ఓటమిని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఊహించలేకపోయారు. కేవలం ఇరవై మూడు స్థానాలకే టిడిపి పరిమితం కావడం దేశవ్యాప్త చర్చకు కారణమైంది. ఇక అప్పటినుండి నేటి వరకు టీడీపీ ఏపీలో తీవ్ర సంకట పరిస్థితులను ఎదుర్కొంటుంది . ఇక చంద్రబాబు సీఎం జగన్ ను ధీటుగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ టీడీపీకి కొత్త నాయకత్వం కావాలనే చర్చ జోరుగా సాగుతుంది.

గతంలోనూ కాబోయే సీఎం అంటూ రచ్చ ...ఇప్పుడు మరోమారు జూనియర్ పేరు

గతంలోనూ కాబోయే సీఎం అంటూ రచ్చ ...ఇప్పుడు మరోమారు జూనియర్ పేరు

గతంలో సంక్రాంతికి ముందు జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ ఫ్లెక్సీలు పెట్టి హడావిడి చేశారు . సీఎం కుర్చీలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో మార్ఫ్ చేసి భవిష్యత్ సీఎం ఎన్టీఆర్ అని ఫోటో వైరల్ చేశారు . ఇప్పుడు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ ఏపీ నెక్స్ట్ సీఎం అంటూ యువనాయకుడి పేరు మరోమారు తెరమీదకు తెచ్చారు . ఇది టీడీపీలో మరోమారు చర్చనీయాంశంగా మారింది .

English summary
AP next CM 2024 Junior NTR Poster creating hot debate in political circles. Photos of TDP leaders along with junior NTR were also printed at Flexie set up in Erragondapalem, Prakasam district. With this, there is a big discussion on this poster in Prakasam district now. Locals are talking about who set up this flexie. It is an interesting development that the name of Junior NTR is coming up on the screen again at a time when there is a debate over who will be the strongest and most effective leader in the TDP after Chandrababu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X