• search
 • Live TV
ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

బుల్లెట్ బండెక్కి వచ్చేత్తా పా: ఇప్పుడు పొరుగు రాష్ట్రంలో.. పెళ్లి కార్డులో సాంగ్ టైమింగ్

|
Google Oneindia TeluguNews

బుల్లెట్ బండెక్కి వచ్చేత పా.. అనే సాంగ్‌కి మాములు క్రేజీ లేదు. కొత్త జంట సాయి శ్రీయ, అశోక్ యావత్ ప్రపంచానికి తెలిసిపోయారు. ఇప్పుడు అంతా అదే పాట.. అదే చర్చ.. పలువురు డ్యాన్స్ చేసి మరీ వీడియోలను షేర్ చేస్తున్నారు. పెళ్లిలలో చాలా మంది డ్యాన్స్ చేస్తున్నారు. పెళ్లి కూతురు, పిల్లలు కూడా.. అధికార పార్టీకి చెందిన ఎంపీ కూడా చిందులేశారు. పెళ్లి వేడుకలు అంటే ఈ పాట తప్పని సరి అయిపోయింది. ఆ పాట లేకుంటే పెళ్లి వేడుకే లేదు అనుకునేంతంగా మారిపోయింది. ఇక పెళ్లి చేసుకుంటున్న వధువులు, త్వరలో పెళ్లికి సిద్ధమవుతున్న వధువులు అయితే ఈ పాటకు స్టెప్పులు నేర్చుకోవడం కామన్ అయ్యింది.

డుగు డుగు డుగు

డుగు డుగు డుగు

డుగు డుగు డుగు అని వాయిస్ రాగానే వేడుక అంతా క్లాప్స్‌తో మారు మోగిపోతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పాటే ట్రెండ్ అవుతోంది. కేవలం తెలంగాణకు మాత్రమే ఈ పాట ఇప్పుడు పరిమితం అవ్వలేదు. పక్క రాష్ట్రాల్లో సైతం ఈ పాటకు స్టెప్పులేస్తున్నారు. ఈ విషయంలో ఎవరూ వెనక్కు తగ్గడం లేదు. ఇంతకాలం దాచుకున్న తమ ప్రతిభనంతా ఇలా వరుడి ముందే ప్రదర్శిస్తూ టాలెంట్ చూపిస్తున్నారు. ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, జోష్, మోజ్, టకాటక్, ఎంఎక్స్ వంటి షార్ట్ వీడియో అప్లికేషన్స్‌లోనూ ఈ పాటే ట్రెండ్ అవుతోంది. లక్షలాది మంది ఈ పాటకు స్టెప్పులేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు.

రికార్డుల మోత

యూబ్యూట్‌లో అయితే ఈ పాట రికార్డులు అన్నీ ఇన్నీ కావు. కోట్లాది వ్యూస్‌తో ట్రెండింగ్‌లో ఉంది. నిజానికి ఈ పాట వచ్చి చాలా రోజులు అవుతుంది. కేవలం ఇన్‏స్టా రీల్స్‏లో ట్రెండింగ్‏లో ఉన్న ఈ సాంగ్ ఇప్పుడు పెళ్లి బరాత్‏లో రచ్చ చేస్తోంది. ఇటీవల ఓ పెళ్లి కూతురు తన పెళ్లి బరాత్‏లో ఈ పాటకు డ్యాన్స్ చేయడంతో ఈ పాటకు క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఒక్క డ్యాన్సుతో ఆ పెళ్లికూతురు ఫేమస్ అయ్యింది. ఆ జంట సెలబ్రిటీ అయిపోయింది. వరుస వారికి ఆపర్ల వర్షం కురుస్తోంది. ఆ వదువు స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అయ్యారు. దీంతో ఆ వధువుకు సాంగ్ నిర్మాణ సంస్థ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చింది. తమ సంస్థలో వచ్చే తరువాత పాటకు ఆమెతో ఒప్పందం చేసుకున్నారు. ఇక ఈ పాటకు వయసుతో సంబంధం లేకుండా చిన్న, పెద్ద అందరూ స్టెప్పులేస్తున్నారు.

మరో వధువు

మరో వధువు


ఈ పాటకు మరో నవ వధువు స్టెప్పులెసింది. ప్రకాశం జిల్లా కోమరోలు మండలం కురాకువారి పల్లెలో పెళ్లి కూతురు బుల్లెట్‌ బండి పాటకు డ్యాన్స్‌ చేసి అందరిని ఆకట్టుకుంది. పెళ్లి కూతురు తన స్లైలో స్టెప్పులెస్తూ కేక పుట్టించింది. ఆర్మీలో పనిచేస్తున్న శ్రీకాంత్‌ను తేజశ్రీ అనే అమ్మాయి ఈనెల 27వ తేదిన పెళ్లాడింది. ఈ సందర్బంగా పెళ్ళి కూతురు తేజశ్రీ బుల్లెట్‌ బండి పాటకు పెళ్ళికొడుకు ముందు స్టెప్పులేయడంతో బంధువులు చప్పట్లతో ఎంకరేజ్‌ చేశారు... ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. మరోవైపు ఇటీవల జగిత్యాల జిల్లా కోరుట్లలో కూడా వధువు డ్యాన్స్ వేశారు. ఆ డ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇలా ప్రతీ ఒక్కరు బుల్లెట్ సాంగ్ పాటకు డ్యాన్స్ చేసి.. షేర్ చేస్తున్నారు.

ఎంపీ కవిత..

ఎంపీ కవిత..

ఇటీవల మహబూబాబాద్ ఎంపీ మాలోత్‌ కవిత కూడా వివాహ వేడుకలో బుల్లెట్‌ బండి పాటకు ఆడిపాడారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొన్న ఎంపీ కవిత.. నూతన వధూవరులతో పాటు వారి కుటుంబసభ్యులతో కలిసి డ్యాన్స్‌ చేశారు. తన డ్యాన్స్‌తో అక్కడన్న వారందరిని అలరించారు. ఎంపీ డాన్స్‌ వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

  Megastar Chiranjeevi ఇండియన్ సినిమాకి ‘బ్రేక్‌ డ్యాన్స్‌' పరిచయం చేసిన స్టార్ || Oneindia Telugu
  పోస్ట్ వైరల్

  పోస్ట్ వైరల్

  ఇటు సోషల్ మీడియాలో కూడా బుల్లెట్ బండి పాట డ్యాన్స్ అని పోస్ట్ వైరల్ అవుతోంది. ఉదయం పెళ్లి.. మధ్యాహ్నం లంచ్.. 3 గంటలకు బుల్లెట్ బండి పాటకు డ్యాన్స్ అని పోస్ట్ చేశారు కొందరు. ఆ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. అవునా అయితే పెళ్లి కోసం కాకున్నా.. పాటకు చేసే డ్యాన్స్ కోసమైనా రావాల్సిందే అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. ఏ రోజు అయితే సాయి శ్రీయ చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అయ్యిందో.. అప్పటినుంచి బుల్లెట్ బండి పాట మారుమోగుతోంది. ఎక్కడ చూసినా.. ఆ పాట మోతే వినిపిస్తోంది. మరోవైపు వచ్చే వినాయక చవితి సమయంలో కూడా బుల్లెట్ బండి పాట కంటిన్యూగా ప్లే అవనుంది. దానికి సంబంధించి యువత ఇప్పటికే ఏర్పాట్లు చేస్తోంది. డీజే, సౌండ్ బాక్స్ ఏర్పాటు చేసే పనిలో మునిగిపోయారు. వినాయక చవితి సందర్భంగా 9 రోజులు.. సాధారణంగా సాంగ్స్ ప్లే చేస్తారు. నవరాత్రులు ముగిసిన తర్వాత నిమజ్జనం రోజున కూడా బుల్లెట్ బండి పాట.. కంటిన్యూగా ప్లే చేస్తారు. వినాయక చవితిన ప్రతీ పల్లెలో.. ప్రతీ గల్లీలో బుల్లెట్ బండి పాట ప్లే అవనుంది.

  English summary
  bullet bike song:a bride performing dance at prakasam district. this video also goes to viral.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X