• search
  • Live TV
ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఏపీలో ఉన్మాది పాలన- క్విట్ జగన్-సేవ్ ఏపీ నినాదం-మహానాడులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

ప్రకాశం జిల్లా ఒంగోలులో టీడీపీ వార్షిక పండుగ మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, నేతల్ని ఉద్ధేశించి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రారంభోపన్యాయం చేశారు. వైసీపీ పాలనపై ఈ సందర్భంగా ఆయన నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో గతంలో టీడీపీ ప్రభుత్వాల పాలనతో జగన్ పాలనను పోలుస్తూ చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

మహానాడుపై చంద్రబాబు

మహానాడుపై చంద్రబాబు


టీడీపీ వార్షిక మహానాడుపై మాట్లాడిన చంద్రబాబు.. ఈసారి మహానాడుకి ఎన్నో ప్రత్యేకలు ఉన్నాయన్నారు.
తొలిసారి ఇంత కళకళలాడుతున్న మహానాడు చూస్తున్నానని చంద్రబాబు తెలిపారు. మనం కష్టపడితే ఒక్కోసారి దేవుడు కూడా ఆశీర్వదిస్తాడన్నారు. ఈ మహానాడుకి ఓ ప్రత్యేకత ఉందని, టీడీపీ 40 ఏళ్లు పూర్తి చేసుకుని 41వ సంవత్సరంలోకి ప్రవేశించామని, ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నామని గుర్తుచేశారు.

మూడేళ్ల వైసీపీ పాలనపై

మూడేళ్ల వైసీపీ పాలనపై

గత మూడేళ్లలో ఎన్నో ఇబ్బందులు పడ్డామని, మీరు ఎంత మా కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే అంతగా రెచ్చిపోతారని వైసీపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు హెచ్చరించారు. రాజకీయాన్ని తమషా అనుకోవద్దన్నారు. ఓ ఉన్మాది పాలన రాష్ట్రానికి శాపంగా మారిందన్నారు. చేతకాని పాలనతో రాష్ట్రం పరువుపోయే పరిస్దితి వచ్చిందన్నారు. ఎన్నో ఏళ్లు రాజకీయాలు చేశాం, ఎంతో మంది సీఎంలు చూశాం, ఎన్నో పోరాటాలు చేశాం కానీ ఏపీ చరిత్ర టీడీపీ రాకముందు వచ్చాక అని చదువుకోవాల్సి వస్తుందన్నారు. టీడీపీ రాజకీయ పార్టీయే కాదు ఓ సేవాభావంతో రాష్ట్ర ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చిన పార్టీ అని చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్ పెద్ద విజనరీ, దూరదృష్టి కలిగిన నాయకులని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్నో కలర్స్ వచ్చాయికానీ పసుపు చూస్తే ఓ చైతన్యం వస్తుందన్నారు. శుభాన్ని చూపించే కలర్ అది అని చంద్రబాబు తెలిపారు. రైతు కోసం నాగలి, పేదవాడికి గుడిసె, కార్మికుడి కోసం చక్రం ఆరోజే ఏర్పాటు చేశారు ఎన్టీఆర్ అని గుర్తుచేశారు.

నేతల అరెస్టుతో నిద్రలేని రాత్రులు

నేతల అరెస్టుతో నిద్రలేని రాత్రులు


మీరు అరెస్టు అయినప్పుడు నిద్రలేని రాత్రులు గడిపానని కార్యకర్తలకు చంద్రబాబు తెలిపారు. మీ కుటుంబసభ్యుడికి ఇబ్బంది వస్తే మీరు నిద్రపోతారా నిద్రపోలేమన్నారు. వ్యతిరేకంగా మాట్లాడే వారిని విరోధులుగా చూసే నాయకులు ఇవాళ ఉన్నారన్నారు. జగనా్ తో మన పోరాటం ఆస్తుల కోసం కాదు ప్రజల ఇబ్బందుల కోసమేనని చంద్రబాబు తెలిపారు. సమాజంలో అందరిపైనా దాడులు చేస్తున్నారని, అభివృద్ధి చేయడం చేతకాదు, పోలీసుల్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల్ని టార్గెట్ా చేస్తున్నారన్నారు.

పోలీసులు మారాలన్న చంద్రబాబు

పోలీసులు మారాలన్న చంద్రబాబు

రాష్ట్రంలోని పోలీసుల్లో మార్పు రావాలని చంద్రబాబు కోరారు. కొందరి కోసం మీ వ్యక్తిత్వాన్ని త్యాగం చేయకండని పోలీసుల్ని చంద్రబాబు కోరారు. ఇదే రాష్ట్రంలో పోలీసులు శాంతి భద్రతలు కాపాడారు. తీవ్రవాదుల్ని, మత విద్వేషాలు రెచ్చగొట్టేవాళ్లను అణచివేశారని, ఇప్పుడు తమ మీద ప్రతాపం చూపిస్తున్నారన్నారు. మీ లాఠీలతోనో, కేసులతోనే ఎవరూ భయపడేవాళ్లు లేరన్నారు. తాటాకు చప్పుళ్లకు భయపడబోమన్నారు. డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకూ ఆలోచించుకోండి, ఉన్మాది చేతుల్లో మీరు బలైపోకండన్నారు. ఎంతోమంది జైలుకు పోయారు. జగన్ ను నమ్ముకుని వీరంతా జైలుకు వెళ్లారన్నారు. తప్పుడు పనులు చేసే వాళ్లను నేను వదిలిపెట్టనని హెచ్చరించారు.
అదికారులతో, పోలీసులతో కాదు ప్రజా సమస్యలపైనే మా పోరాటమన్నారు.

రాష్ట్రంలో ఎటు చూసినా సమస్యలే

రాష్ట్రంలో ఎటు చూసినా సమస్యలే

భారత్ లో ఎక్కడా లేని విధంగా ఏపీలో పన్నుల పెంపు ఉందని చంద్రబాబు ఆరోపించారు. బాదుడే బాదుడు, ప్రతీ ఒక్కరి చెవుల్లో బాదుడే బాదుడు వినిపిస్తోందన్నారు. దీన్ని ప్రజల గుండె చప్పుడుగా మార్చే బాధ్యత టీడీపీ కార్యకర్తలదేనన్నారు. వైసీపీ నేతల్ని చరిత్ర హీనులుగా నిరూపించేవరకూ పోరాటం ఆగదన్నారు. కేంద్రం తగ్గించినా పెట్రోధరల్ని వైసీపీ ప్రభుత్వం మాత్రం తగ్గించడం లేదన్నారు. కరెంటు ఛార్జీలు కూడా బాదుడే బాదుడు అన్నారు.
తాము 24 గంటలు కరెంటు ఇచ్చామని, కానీ ఇప్పుడు కరెంటు ఉందా అని ప్రశ్నించారు. రాని కరెంటుకు బాదుడే బాదుడు మాత్రం కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో ఎవరైనా బాగున్నారా, ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడా
కొందరు రైతులు దిక్కుతోచక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చంద్రబాబు గుర్తుచేశారు. రైతులు రోడ్లపైకి వస్తే టీడీపీ అండగా ఉంటుందని, మిమ్మల్ని బాగుచేసే బాధ్యత మాది అని చంద్రబాబు హామీ ఇచ్చారు. మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరితాడు వేసేందుకు వైసీపీ సిద్దమవుతోందని, మీ మోటార్లకు మీటర్లు పెడితే భవిష్యత్తులోచాలా నష్టం వస్తుందని హెచ్చరించారు.

 వైసీపీ సంక్షేమంపై చంద్రబాబు

వైసీపీ సంక్షేమంపై చంద్రబాబు

అమ్మ ఒడి అన్నారు, నాన్న బుడ్డి పెట్టారని చంద్రబాబు ఆరోపించారు. ఇప్పుడు అన్నింటికీ ఆంక్షలు పెడుతున్నారన్నారు. బాదుడే బాదుడులో వస్తున్న ఆదాయం, అప్పుల డబ్బులు ఎక్కడికి పోతున్నాయని ప్రశ్నించారు.అన్న క్యాంటీన్ లేని సంక్షేమం ఏంటని అడిగారు. సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా ఎక్కడికెళ్లాయి. చంద్రన్న భీమా అమలవుతోందా అని ప్రశ్నించారు.మద్యపాన నిషేధం హామీ ఎటు పోయిందని అడిగారు. నాసిరకం బ్రాండ్లు పెట్టడమే కాకుండా మద్యం ఆదాయంపై 25 ఏళ్లకు రుణాలు తెస్తున్నారని గుర్తుచేశారు. 30 లక్షల ఇళ్లు కడతామన్నారు. కనీసం ఇసుక దొరికే పరిస్దితి ఉందా అని ప్రశ్నించారు. 600 ట్రాక్టర్ ఉండే ఇసుక ఇప్పుడు 5 వేలకు పెరిగిపోయిందన్నారు. దోపిడీ వల్ల ఇళ్లు ఆగిపోయాయని, ఆరోగ్యం పోయే పరిస్ధితి వచ్చిందన్నారు. భూములపై కబ్జాలు, దోపిడీ జరుగుతూనే ఉందన్నారు. వైసీపీ అవినీతితోనే రాష్ట్రంలో అప్పులు 8 లక్షల కోట్లకు చేరాయన్నారు.
మోసకారి సంక్షేమంతో అప్పుల భారం పెరుగుతోందన్నారు. వైసీపీకి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదన్నారు.

English summary
tdp chief chandrababu naidu on today slams ysrcp govt for various reasons in party's mahanadu in ongole.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X