జగన్ రాక్షసుడు.. బాబు రాముడు, అభివృద్దికి బ్రాండ్ అంబాసిడర్: నారా లోకేశ్
పసుసుజెండా మోస్తున్న కార్యకర్తలందరికీ పాదాభివందనం అని నారా లోకేశ్ అన్నారు. మనది పసుపు జెండా. మన శరీరం కోస్తే పసుపు రంగే వస్తుంది అంటూ కార్యకర్తల్లో ఉత్సాహం రగిల్చే ప్రయత్నం చేశారు. ఒంగోలులో జరుగుతున్న మహానాడులో లోకేశ్ ప్రసంగించారు. బస్సులను ఆపగలుగుతావ్... కార్ల టైర్లలో గాలి తీయగలుగుతావ్... కానీ టీడీపీ కార్యకర్తలను మాత్రం ఆపలేవని లోకేశ్ అన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పునాదులు ఇప్పటికీ గట్టిగానే ఉన్నాయని.. తమ పార్టీని భూస్థాపితం చేస్తామనే వాళ్లే గాలికి కొట్టుకుపోయారని తెలిపారు.

యువజన శృంగార అంటూ..
శవాన్ని అడ్డుపెట్టుకుని సీఎం అయిన ఘనత జగన్ కే దక్కుతుందని విమర్శలు చేశారు. వైఎస్సార్సీపీ అంటే ఏంటో తెలుసా... యువజన శృంగార, రౌడీ కాంగ్రెస్ పార్టీ అని లోకేశ్ కొత్త భాష్యం చెప్పారు. చంద్రబాబు రాముడు లాంటి వ్యక్తి. ఆయన పాలించిన 14 ఏళ్లలో కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టలేదన్నారు. ధరలు పెంచలేదు, ఆర్టీసీ చార్జీలు పెంచలేదు, విద్యుత్ చార్జీలు పెంచలేదు. హెచ్ సీఎల్, ఫాక్స్ కాన్, అపోలో టైర్స్, కియా మోటార్స్ వంటి పరిశ్రమలను తీసుకువచ్చి అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ నిలిచిన వ్యక్తి చంద్రబాబు అని చెప్పారు.

జగన్ రాక్షసుడు
రాముడు ఉన్నప్పుడు రాక్షసుడు కూడా ఉంటాడు. ఆ రాక్షసుడే జగన్ మోహన్ రెడ్డి. జగన్ సీఎం అయ్యాక జేసీబీ పాలన కొనసాగుతోంది. ప్రజావేదిక కూల్చి, అక్కడి నుంచి ప్రజలపై పడ్డారని పైరయ్యారు. కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నాడని.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడని ఫైరయ్యారు. ధరలు పెంచడంలో నెంబర్ వన్ అని.. పెట్రోల్ ధరల్లో నెంబర్ వన్, డీజిల్ ధరలు నెంబర్ వన్, చెత్తపై పన్నుల్లో నెంబర్ వన్, ఆర్టీసీ చార్జీల్లో నెంబర్ వన్, ఇసుక ధరల్లో నెంబర్ వన్ అయ్యాడని ఫైరయ్యాడు. చంద్రబాబు అన్న క్యాంటీన్లు, పెళ్లికానుక, విదేశీ విద్య వంటి కార్యక్రమాలకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచాడని.. జగన్ కోడికత్తి, బాత్రూంలో బాబాయి, మూడు రాజధానుల అంశాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మిగిలాడని ఆరోపించారు.

కూల్చివేత..
రాముడు కన్ స్ట్రక్షన్ చేస్తే ఈ రాక్షసుడు డిస్ట్రక్షన్ చేస్తున్నాడు. రాముడికి ముందు చూపు ఉంటే రాక్షసుడుకి మందు చూపు ఉందన్నారు. అవ్వా తాతా అక్కా చెల్లీ అంటూ ఒక్క చాన్స్ అడిగి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇలాంటి రాక్షసుడు కన్న తల్లిని, చెల్లిని, యువతను మోసం చేశాడు. అన్నగా స్పీడ్‌గా వస్తానని చెప్పి ఆడబిడ్డలను కూడా మోసం చేశాడరి లోకేశ్ నిప్పులు చెరిగారు.