ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిజాలు నిగ్గు తేలుతాయి.. అంతర్వేది ఘటనపై సీఎం సీరియస్‌గా ఉన్నారు: హోంమంత్రి సుచరిత

|
Google Oneindia TeluguNews

అంతర్వేది రథం దగ్ధం ఘటన ఆంధ్రప్రదేశ్‌‌లో అగ్గిరాజేసింది. విపక్షాలు, హిందూ సంస్థలు ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సీబీఐ విచారణకు ప్రభుత్వం కోరడం.. కేంద్రం అంగీకరించడం చకచకా జరిగిపోయాయి. అయితే సీబీఐ విచారణకు సంబంధించి ఏపీ హోంమంత్ర సుచరిత స్పందించారు. నిజా నిజాలు త్వరలోనే నిగ్గు తేలతాయని స్పష్టంచేశారు. ఆమె శుక్రవారం ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడారు.

అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ: స్వాగతించిన స్వరూపానందేంద్ర స్వామి, సాహోసోపేత నిర్ణయం..అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ: స్వాగతించిన స్వరూపానందేంద్ర స్వామి, సాహోసోపేత నిర్ణయం..

సీబీఐ విచారణతో అంతర్వేది రథం దగ్దానికి గల కారణం తెలిసే అవకాశం ఉంది అని సుచరిత అన్నారు. రథం దగ్గం కావడంలో కుట్ర కోణం ఉంది అని ఆమె అనుమానం వ్యక్తంచేశారు. అయితే ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేయడం మరింత అనుమానాలకు తావిస్తోందన్నారు. సీబీఐ విచారణలో ప్రమాదానికి గల కారణం తెలుస్తోందని పేర్కొన్నారు. రథం దగ్ధం ఘటనపై సీఎం జగన్ సీరియస్‌గా ఉన్నారని తెలిపారు.

cm jagan serious on antarvedi incident: sucharita..

స్వామివారి కళ్యాణోత్సవాల్లో భాగంగా ఏటా ఇక్కడ ఘనంగా రథోత్సవం నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. అలాంటి రథం అనుమానాస్పద స్థితిలో దగ్ధమవడంపై రాజకీయ పార్టీల నేతలు, హిందూ సంఘాలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. రథం దగ్ధం కుట్రపూరితంగానే ఉందని ఆరోపించాయి. అంతర్వేది ఘటనపై బీజేపీ, జనసేన పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు కూడా చేపట్టాయి. ఘటనపై సీరియస్‌గా స్పందించిన సర్కారు.. సంబంధిత అధికారిని సస్పెండ్ చేసింది. కొత్త రథం నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తర్వాత సీబీఐ విచారణకు కూడా ఆదేశించింది.

English summary
ap cm jagan serious on antarvedi chariot fire incident home minister sucharitha said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X