ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కలికాలం గురూ.. భార్య వేధింపులు.. తట్టుకోలేని భర్త.. బలవన్మరణం..

|
Google Oneindia TeluguNews

ఇది నిజంగా కలికాలమే. ప్రేమ, అప్యాయతలు సరికదా.. వేధింపుల పర్వం కొనసాగుతోంది. సమాజంలో ఇప్పటికీ కొందరు వివాహితలు వేధింపులకు గురవుతూనే ఉన్నారు. కానీ ఏపీలోని ప్రకాశం జిల్లాలో కాస్త డిఫరెంట్ ఘటన జరిగింది. భార్య వేధింపులతో.. భర్త తట్టుకోలేకపోయాడు. పైగా ప్రేమించి.. పెళ్లి చేసుకున్న అమ్మాయికి నచ్చజెప్పకపోయాడు. విసిగి వేశారి పోయి.. జీవితంపై విరక్తి చెందాడు. లాభం లేదనుకొని భార్య ముందే ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

మార్కాపురంలో దంపతులు

మార్కాపురంలో దంపతులు

మార్కాపురం పట్టణంలోని రామలక్ష్మణ వీధిలో బొమ్మల బోయిన రామకృష్ణ దంపతులు ఉంటున్నారు. రమణి అనే యువతిని ఐదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి సంసారం సాఫీగానే సాగిపోయింది. పైగా వీరిద్దరూ ఉండటంతో ఇబ్బందులు లేవు. కానీ తర్వాత గొడవుల ప్రారంభమయ్యాయి. ఆలుమగలు అన్నాక గొడవలు కామనే.. కానీ ఇద్దరే ఉండటం.. చెప్పేందుకు పెద్దలు లేకపోవడంతో మనస్పర్థలు తీవ్రరూపం దాల్చాయి.

పెట్రోల్ పోసుకొని..

పెట్రోల్ పోసుకొని..

మంగళవారం గొడవ పీక్ స్టేజీకి చేరింది. భార్యభర్తల మధ్య గొడవతో రామకృష్ణ భరించలేకపోయాడు. తన టూ వీలర్‌లోని పెట్రోల్ తీసుకొని భార్య ముందే ఒంటిపై పోసుకున్నాడు. వెంటనే స్థానికులు హుటాహుటిన మార్కాపురం వైద్యశాలకు తరలించారు. రామకృష్ణకు వైద్యులు ప్రథమ చికిత్స నిర్వహించారు. మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో గుంటూరు పంపించారు. అయితే మార్గమధ్యలో రామకృష్ణ చనిపోయాడు.

కులాంతర వివాహం

కులాంతర వివాహం

రామకృష్ణకు తల్లిదండ్రులు ఉన్న... ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవడంతో తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నాడు. అయితే అతని భార్యకు మాత్రం ఇదివరకు ఒకసారి పెళ్లయ్యింది. విడాకులు తీసుకొని.. రామకృష్ణను రెండో పెళ్లి చేసుకుంది. అయినా భార్య భర్తల మధ్య గొడవల వల్ల.. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. కేసును అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

English summary
couple clash.. husband suicide at home in prakasams markapuram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X