ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రత్యక్ష రాజకీయాలకు దగ్గుపాటి గుడ్ బై?.. బీజేపీలోనే పురంధరేశ్వరి.. జగన్ అల్టిమేటమే కారణం

|
Google Oneindia TeluguNews

ప్రకాశం జిల్లా పర్చూరు రాజకీయాలలో దగ్గుపాటి రాజకీయ ప్రస్తానం హాట్ టాపిక్ గా మారింది. తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో సీఎం జగన్ దగ్గుపాటి ఫ్యామిలీకి అల్టిమేటం ఇవ్వటం తర్వాత పురంధరేశ్వరి పార్టీలోకి వస్తే రాజ్య సభ మెంబర్ గా అవకాశం ఇస్తామని చెప్పటం, బీజేపీనో, వైసీపీనో త్వరగా తేల్చుకోవాలని చెప్పటంతో దగ్గుపాటి ఫ్యామిలీ మల్లగుల్లాలు పడింది. ఫైనల్ గా నిర్ణయం తీసుకుంది అని స్థానికంగా చర్చ జరుగుతుంది.

 జగన్ కు షాక్ ఇవ్వటానికి సిద్ధం అయిన దగ్గుపాటి .. వైసీపీ అల్టిమేటానికి సమాధానం ఇదేనా ? జగన్ కు షాక్ ఇవ్వటానికి సిద్ధం అయిన దగ్గుపాటి .. వైసీపీ అల్టిమేటానికి సమాధానం ఇదేనా ?

షాకింగ్ నిర్ణయం తీసుకున్న దగ్గుపాటి

షాకింగ్ నిర్ణయం తీసుకున్న దగ్గుపాటి

ఏదో ఒక పార్టీలోనే ఉండాలని దగ్గుపాటి ఫ్యామిలీ విషయంలో వైసీపీ అల్టిమేటం ఇచ్చిన నేపధ్యంలో దగ్గుపాటి ఏ పార్టీలోనూ వద్దని ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారని టాక్ వినిపిస్తుంది. సీఎం జగన్ దగ్గుపాటి కి అల్టిమేటం జారీ చేసిన నేపధ్యంలో ఆయన జగన్ పార్టీకి షాక్ ఇవ్వనున్నారని బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ దగ్గుపాటి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని షాకింగ్ నిర్నయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని వీడి వైసీపీ లో చేరే ఆలోచనలో దగ్గుపాటి పురంధరేశ్వరి లేరని తెలుస్తుంది.

రాజకీయాల్లో సైలెంట్ గా ఉండాలని నిర్ణయం

రాజకీయాల్లో సైలెంట్ గా ఉండాలని నిర్ణయం


నియోజకవర్గంలో తన ముఖ్య అనుచరులతో, కుటుంబ సభ్యులతో సమావేశం అయిన దగ్గుపాటి రాజకీయాల్లో సైలెంట్ గా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్ట తెలుస్తుంది. కేంద్రమాజీమంత్రి పురంధరేశ్వరి బీజేపీలోనే కొనసాగాలని నిర్ణయం తీసుకున్నారు. వైసీపీలో చేరేది లేదని తేల్చేశారు. ఇక గత కొంత కాలంగా జగన్ షరతు నేపధ్యంలో రాజకీయ భవితవ్యంపై మల్లగులాలు పడుతున్న దగ్గుపాటి ఎట్టకేలకు ఫైనల్ గా ఒక నిర్ణయానికి వచ్చారు.

వైసీపీని వీడి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని డెసిషన్

వైసీపీని వీడి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని డెసిషన్

అమెరికా వెళ్ళిన పురంధరేశ్వరి తిరిగి రావటంతో దగ్గుపాటి ఫ్యామిలీ ఫైనల్ గా ఈ నిర్ణయం తీసుకుంది. నిన్నటి వరకు కుమారుడు హితేష్ చెంచురాం రాజకీయ భవితవ్యంపై మల్లగులాలు పడిన దగ్గుపాటి ఫ్యామిలీ ఫైనల్ గా ఇలా నిర్ణయం తీసుకున్నారు. ఇక తమ అనుచరులతో హితేష్ చెంచురాం ఆత్మాభిమానం చంపుకోవాల్సిన అవసరం లేదని చెప్పినట్టు తెలుస్తుంది. జగన్ విధించిన షరతుతో చాలా ఇబ్బంది పడిన దగ్గుపాటి కుటుంబం ఫైనల్ గా వైసీపీని వీడేందుకే నిర్ణయం తీసుకున్నారు.

 కుమారుడు హితేష్ కోసం ఇంతకాలం వేచి చూసిన దగ్గుపాటి

కుమారుడు హితేష్ కోసం ఇంతకాలం వేచి చూసిన దగ్గుపాటి


కుటుంబ సభ్యుల సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దగ్గుబాటి తీసుకున్న తాజా నిర్ణయంపై ఈ రోజు దగ్గుబాటి అనుచరులతో భవిష్యత్ కార్యాచరణపై నియోజకవర్గంలో సమావేశం నిర్వహించబోతున్నారు. కుమారుడు హితేష్ చెంచురాం రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇంత కాలం వేచి చూశానని దగ్గుబాటి చెప్తున్న పరిస్థితి. అయితే కుమారుడు హితేష్ చెంచురాం మాత్రం తనకోసం ఎవరు ఆత్మాభిమానాన్ని చంపుకోవాల్సిన అవసరం లేదని అనుచరులతో చెప్పారు.

 ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కానున్న దగ్గుపాటి ?

ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కానున్న దగ్గుపాటి ?

ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండటమే సమంజసంగా ఉంటుందని దగ్గుబాటి వెంకటేశ్వర రావు నిర్ణయం తీసుకున్నట్లు గా తెలుస్తుంది. ఇక తాను తీసుకున్న నిర్ణయానికి గల కారణాలు వివరిస్తూ ప్రజలకు లేఖ కూడా రాయాలని భావిస్తున్నారట దగ్గుబాటి వెంకటేశ్వర రావు. గత ఎన్నికల ముందు వైసీపీలోకి చేరి చక్రం తిప్పాలని , చంద్రబాబుకు చెక్ పెట్టాలని చూసిన దగ్గుపాటి వెంకటేశ్వర్ రావు ఊహించని విధంగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు .

నేడు అనుచరులతో సమావేశం .. భవిష్యత్ కార్యాచరణ

నేడు అనుచరులతో సమావేశం .. భవిష్యత్ కార్యాచరణ

గత ఎన్నికలకు ముందు వైసీపీ తీర్ధం పుచ్చుకున్న ఆయన అనతికాలంలోనే పార్టీని వీడాల్సిన పరిస్థితి వచ్చింది. వైసీపీ లో ఉన్న అంతర్గత రాజకీయాలు, పురంధరేశ్వరి బీజేపీలో ఉండటం వంటి అంశాలు దగ్గుపాటిని ఇబ్బంది పెట్టాయి. దీంతో పర్చూరు రాజకీయాల్లో సీనియర్ నాయకుడు అయిన దగ్గుపాటి సైలెంట్ గా ఉండాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. నేడు మరోమారు తన అనుచరులతో సమావేశం అనంతరం ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది .

English summary
Andhra Pradesh Chief Minister YS Jagan has made it clear to Daggubati Venkateswara Rao that all the members of their family should be in one party. Jagan also promised that Purandeswari who is in BJP will be given a respectable position in YSRCP as well. Sources say that senior leader Daggubati Venkateswara Rao is likely to quit politics. Daggubati Purandeswari returned from America and the family members had discussion over the issue. It is also learnt that Daggubati Venkateswara Rao is likely to write a letter to people explaining the entire situation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X