ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అడకత్తెరలో అద్దంకి ఎమ్మెల్యే..... గొట్టిపాటి రవి కుమార్ ని టార్గెట్ చేసిన వైసీపీ !!

|
Google Oneindia TeluguNews

ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ ఎమ్మెల్యే గొట్టిపాటిరవి కుమార్ అడకత్తెరలో పోక చెక్కలా నలుగుతున్నారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ను పార్టీ మారాలని వైసీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. కానీ ఆయనకు పార్టీ మారితే కలిగే లాభం ఏంటి ? అంటే మాత్రం చెప్పకుండా వైసీపీ లో చేరాలని హుకుం జారీ చేస్తున్నట్టు తెలుస్తుంది. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్న సంకేతాలు కూడా ఇచ్చేశారు . దీంతో వైసీపీ, గొట్టిపాటిని టార్గెట్ చేసిందని ప్రకాశం జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది .

గొట్టిపాటి రవితో ఇద్దరు మంత్రుల మంతనాలు: క్వారీలపై దాడులు: బలరాం నిర్ణయం తో లింకు..!గొట్టిపాటి రవితో ఇద్దరు మంత్రుల మంతనాలు: క్వారీలపై దాడులు: బలరాం నిర్ణయం తో లింకు..!

 టీడీపీ అద్దంకి నియోజకవర్గ ఎమ్మెల్యే గొట్టిపాటి

టీడీపీ అద్దంకి నియోజకవర్గ ఎమ్మెల్యే గొట్టిపాటి

అద్దంకి నియోజకవర్గంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసి గెలిచారు గొట్టిపాటి రవికుమార్. 2004లో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన రవికుమార్, 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన అనూహ్యంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న గొట్టిపాటి రవికుమార్ టిడిపిలో చేరడంతో వైసీపీ శ్రేణులు అవాక్కయ్యాయి.

గొట్టిపాటి రవికుమార్ కు పార్టీ మారాలని వైసీపీ నేతల ఒత్తిడి

గొట్టిపాటి రవికుమార్ కు పార్టీ మారాలని వైసీపీ నేతల ఒత్తిడి

ఇక ఆ తర్వాత 2019 ఎన్నికల్లో టిడిపి నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కానీ టీడీపీ అధికారంలో లేకపోవటంతో గొట్టిపాటికి కష్టాలు మొదలయ్యాయి. వైసీపీ లో గతంలో ఉన్న నేత కాబట్టి గొట్టిపాటిని పార్టీ మారాలని వైసీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు . అయితే పార్టీ మారితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యాలి. ఆ తర్వాత పార్టీలో తన స్థానం ఏంటో కూడా అర్ధం కాని పరిస్థితి. ఈనేపధ్యంలోనే పార్టీ మార్పు విషయంలో వైసీపీ ముఖ్యనేతలతో గొట్టిపాటి తాను పార్టీ మారతానని, కాకుంటే నియోజకవర్గ ఇంచార్జ్ తనకే ఇవ్వాలని గొట్టిపాటి కోరుతున్నారట . కానీ వైసీపీ ముఖ్యనేతలు అంత సీన్ లేదు అంటున్నారని సమాచారం.

గొట్టిపాటి వ్యాపారాలపై విజిలెన్స్ దాడులు.. చంద్రబాబుకు చెప్పుకున్న గొట్టిపాటి

గొట్టిపాటి వ్యాపారాలపై విజిలెన్స్ దాడులు.. చంద్రబాబుకు చెప్పుకున్న గొట్టిపాటి

ఏపీలో టిడిపి నాయకులను టార్గెట్ చేసి కేసులు బనాయిస్తూ, ఇబ్బందులకు గురి చేస్తున్న క్రమంలో గొట్టిపాటి రవికుమార్ పార్టీ మారకుంటే ఎలా ఉంటుందో కూడా వైసీపీ ఆయనకు రుచి చూపించే పనిలో వుంది . ఇప్పటికే అయన వ్యాపారాలపై విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయి. ఆయనను ఇరకాటంలో పడుతూ పార్టీ మార్పుపై ఒత్తిడి పెంచుతున్నారని సమాచారం. గొట్టిపాటి రవికుమార్ నియోజకవర్గ పరిస్థితుల గురించి, తనకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి టిడిపి అధినేత చంద్రబాబుతో కూడా చెప్పుకుని లబోదిబోమన్న గొట్టిపాటి ఇప్పుడు తాను ఉన్న పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకోవాలో అర్ధం కాక సతమతమవుతున్నారని సమాచారం .

గొట్టిపాటి గ్రానైట్ క్వారీలే లక్ష్యంగా దాడులు

గొట్టిపాటి గ్రానైట్ క్వారీలే లక్ష్యంగా దాడులు

గొట్టిపాటి రవికుమార్ కు అద్దంకి నియోజకవర్గం లో గ్రానైట్ వ్యాపారం ఉంది . వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆయనను పార్టీ మారాలని ఒత్తిడి తెస్తూ విజిలెన్స్ దాడులతో గొట్టిపాటి రవికుమార్ కు సంబంధించిన బల్లికురవ, చీమకుర్తి లో ఉన్న గ్రానైట్ వ్యాపారాన్ని వైసీపీ టార్గెట్ చేసిందని స్థానికంగా చర్చ జరుగుతుంది. అప్పటినుండి వ్యాపారపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రవికుమార్ తాజాగా ఆయన టిడిపికి రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరాలని చూస్తున్నా వైసీపీ అధినాయకత్వం నుండి స్పష్టమైన హామీ లేదని ఆయన వేచి చూస్తున్నారు.

ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తేనే వైసీపీ లో చేరే అవకాశం

ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తేనే వైసీపీ లో చేరే అవకాశం

గ్రానైట్ వ్యాపారమే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న గొట్టిపాటి రవికుమార్ కు వ్యాపారం నిలిచిపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందులు ఒకవైపు, జగన్ తో ఉన్న సన్నిహిత సంబంధాలు మరోవైపు, వైసీపీ నేతలు ఒత్తిడి ఇంకొకవైపు.. ఇవన్నీ ఆయన పార్టీ మార్పు ఆలోచనకు కారణాలైనా జగన్ పార్టీ లోకి ఇతరపార్టీల నుండి వచ్చే వారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని పెట్టిన తిరకాసు ఇప్పుడు పార్టీ మారాలని భావిస్తున్న నేతలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తుంది. కానీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా జగన్ నుండి స్పష్టమైన హామీతో వైసీపీ లోకి వెళ్లాలని భావిస్తున్నారు గొట్టిపాటి.

ఎమ్మెల్యేగా రాజీనామా చేసి వైసీపీలో చేరితే భవిష్యత్ ఏమిటో తెలీని స్థితిలో గొట్టిపాటి

ఎమ్మెల్యేగా రాజీనామా చేసి వైసీపీలో చేరితే భవిష్యత్ ఏమిటో తెలీని స్థితిలో గొట్టిపాటి


ఇక ఇదే విషయమై గొట్టిపాటి రవికుమార్ నియోజకవర్గంలోని తన అనుయాయులతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ గొట్టిపాటి రవికుమార్ టిడిపికి రాజీనామా చేసి వైసీపీలో కి వస్తే ఆయనకు నియోజకవర్గ ఇంచార్జిగా బాధ్యతలు అప్పగించాలని ప్రధానంగా ఆయన కోరుతున్నారు. కానీ ఇంకా గొట్టిపాటి , వైసీపీ నేతల మధ్య చర్చలు ఇంకా కొనసాగుతున్న వేళ గొట్టిపాటికి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న పరిస్థితి ఉంది. టీడీపీలోనే ఎమ్మెల్యేగా ఉంటె వేధింపులు తప్పవు.. అలా కాదని టీడీపీ వీడి వైసీపీలోకి వెళ్తే రాజకీయ భవిష్యత్ పై ఎలాంటి భరోసా లేదు . దీంతో ఆయన పార్టీ మార్పు విషయంలో ఇంకా నలిగిపోతున్నారు. తెగ సతమతమవుతున్నారు.

English summary
Addanki TDP MLA Gottipati Ravi Kumar of Prakasham district is reportedly under political pressure as it is alleged that the ruling YSRCP has been putting pressure to join them. It is alleged that Gottipati Ravi Kumar is likely to become a victim by facing the vigilance attack over his alleged granite business activities in his Addanki constituency. It is speculated that Gottipati Ravi Kumar may join the ruling YSRCP after resigning to his party and MLA post provided he is offered the in-charge post of Addanki constituency. Gottipati Ravi Kumar has been winning MLA posts since 2004. So far he won four times as MLA in Addanki. In the year 2014, he won MLA on YSRCP ticket, but he joined TDP. As he is known to the YSRCP leaders, he has been targeted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X