• search
 • Live TV
ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కరణం బలరాం చర్యతో ఆమంచి సైలెంట్ .. పార్టీలో చేరకుండానే ప్రత్యర్థికి చెక్

|

టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీలో చేరకుండా వైసీపీ అధినేత జగన్ కు మద్దతునిచ్చి రాజకీయ చదరంగంలో కీలకమైన స్టెప్ వేశారు. స్థానికంగా ఆమంచి కృష్ణ మోహన్ తీరుతో తీవ్ర అసహనానికి గురైన కరణం బలరాం ఇప్పుడు అధికార పార్టీ వైపు చేరి అధికార పార్టీలో తనకు ప్రత్యర్థిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ కు మంచిగానే చెక్ పెట్టారు. నోరు మెదపకుండా చేశారు. తన గురించి అవాకులు, చెవాకులు పేలి నోటికొచ్చినట్టు విమర్శించే ఆమంచి కృష్ణమోహన్ నోటికి తాను తీసుకున్న నిర్ణయంతో తాళం వేశారు.

వైసీపీలో చేరిన కరణం వెంకటేష్... వెనక్కు తగ్గిన బలరాం .. రీజన్ ఇదే

గత ఎన్నికల్లో టీడీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరాం

గత ఎన్నికల్లో టీడీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరాం

గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి ప్రభంజనం కొనసాగినా ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గంలో ఆమంచి కృష్ణ మోహన్ మాత్రం ఘోర ఓటమి పాలయ్యారు. ప్రకాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఆమంచి కృష్ణమోహన్ ఎన్నికలకు ముందు నుంచి వివాదాస్పదుడు . ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసిపిలోకి పార్టీ ఫిరాయించిన ఆమంచి చీరాలలో టిడిపి సీనియర్ నేత కరణం బలరాంపై 17 వేల ఓట్ల భారీ తేడాతో పరాజయం పాలయ్యారు .

 నిన్నటిదాకా ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కరణం బలరాం వర్సెస్ ఆమంచి

నిన్నటిదాకా ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కరణం బలరాం వర్సెస్ ఆమంచి

ప్రకాశం జిల్లా రాజకీయాలలో కీలక వ్యక్తిని తానేనని ప్రతి విషయంలో వేలు పెడుతూ టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం కి పెద్ద తలనొప్పిగా తయారయ్యారు. రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచిన సమయంలో చీరాలలో ఓటమికి మాత్రం ఆమంచి వ్యక్తిగత ప్రవర్తనే కారణమని పలువురు చెప్పిన పరిస్థితి ఉంది. ఇక ఎన్నికల్లో ఓటమిని చవి చూసిన ఆమంచి తాను ఓటమి పాలైనా , తమ ప్రభుత్వం గెలిచిందని ఏదున్నా తన మాటే వినాలని ఆయన స్థానిక అధికారులకు హుకుం జారీ చెయ్యటం కరణం బలరాం కు ఇబ్బందిగా ఉండేది.

ఇద్దరు భార్యలు , ఎమ్మెల్యేగా అనర్హుడు అంటూ కోర్టులో ఆమంచి అఫిడవిట్

ఇద్దరు భార్యలు , ఎమ్మెల్యేగా అనర్హుడు అంటూ కోర్టులో ఆమంచి అఫిడవిట్

ఇక కరణం బలరాం ఎమ్మెల్యేగా అనర్హుడు అని ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారని ఎన్నికల అఫిడవిట్ లో ఒక భార్య పేరును కరణం సరస్వతిగా పేర్కొన్నారని, ఇదే సమయంలో ఆయనకున్న మరో భార్య ప్రసూన గురించి ప్రస్తావించలేదని ఆమంచి ఆరోపించారు . ఆయన ఇద్దరు పెళ్ళాల కథకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని , ఆయనను అనర్హుడిగా పేర్కొనాలని ఆమంచి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.

వైసీపీకి మద్దతు తెలిపిన ఎమ్మెల్యే కరణం బలరాం

వైసీపీకి మద్దతు తెలిపిన ఎమ్మెల్యే కరణం బలరాం

ఇక ఈ క్రమంలో వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితి నెలకొంది . ఒక పక్క ఆమంచి, మరో పక్క కరణం ఇద్దరు కూడా నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం పోటీపడుతున్న క్రమంలో కరణం బలరాం తన కుమారుడు కరణం వెంకటేష్ ను వైసీపీలో చేర్పించి తాను మాత్రం వైసీపీకి మద్దతు ప్రకటిస్తానని చెప్పి వైసీపీ బాట పట్టారు. పార్టీలో అధికారికంగా చేరకున్నా పార్టీ కోసం పని చెయ్యనున్నారు. ఈ క్రమంలో కరణం బలరాం అంటే అసలే గిట్టని ఆమంచి ఇప్పుడు సైలెంట్ అయ్యే పరిస్థితి వచ్చింది.

  AP Local Body Polls: YSRCP MLA On Macherla Incident | టీడీపీ నేతలు మాచర్ల ఎందుకు వెళ్లారో చెప్పాలి ?
  అధికార పార్టీకి సన్నిహితంగా మారి ఆమంచికి చెక్ పెట్టిన కరణం బలరాం

  అధికార పార్టీకి సన్నిహితంగా మారి ఆమంచికి చెక్ పెట్టిన కరణం బలరాం

  అంతే కాదు ఇప్పుడు కరణం బలరాం వైసీపీకి దగ్గర కావడంతో ఆమంచి బలరాం పై వేసిన అనర్హత పిటిషన్ ను వెనక్కు తీసుకోవాల్సి వస్తుందేమో అన్న చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా కరణం బలరాం చాలా తెలివైన స్టెప్ వేసి రాజకీయంగా తనపని తాను చేసుకుపోతున్నారు. ఇక ఆమంచి కక్కలేక , మింగలేక , ఏం చెయ్యాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. కరణం బలరాం తానూ వేసిన స్టెప్ తో , చేసిన పనితో స్థానికంగా ఆమంచికి చెక్ పెట్టారని ప్రకాశం జిల్లాలో జోరుగా చర్చ జరుగుతుంది.

  English summary
  Former MLA Amanchi Krishna Mohan defeated by TDP MLA Karanam Balaram in th previous assembly elections . Since the loss of the election, he is involving in every work in the cheerala constituency and irritating karanam balaram in prakasham district . MLA Karanam Balaram check to Amanchi krishna mohan with his latest decision . Karanam balaram son karanam venkatesh joined in YCP and also balaram is supporting YCP government . this made Amanchi silent.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more