• search
  • Live TV
ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అ అమ్మ, ఆ ఆస్తి.. తల్లిని గెంటేసిన కొడుకులు.. న్యాయం కోసం నడిరోడ్డు మీద..!

|

ప్రకాశం : బంధాలకు విలువ లేదు. అనుబంధాలకు చోటు లేదు. కేవలం డబ్బుకు మాత్రమే దాసోహం అంటోంది లోకం. డబ్బు మాయలో పడి ప్రేమానురాగాలు మరిచిపోతున్నారు. చివరకు మాతృమూర్తిని సైతం లెక్కచేయని మనుషులు దర్శనమిస్తున్నారు.

అమ్మకు అన్యాయం చేశారు కొడుకులు. కని పెంచి పెద్ద చేసిన అమ్మకు చుక్కలు చూపించారు. ఆస్తి కోసం వెంపర్లాడుతూ అమ్మను ఇంట్లో నుంచి గెంటేశారు. అమ్మ అనే పదానికి అర్థం లేకుండా చేసిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. నలుగురు పిల్లల తల్లిగా నీకేంటమ్మా అన్న నోళ్లే ఇవాళ ఆమెను అయ్యో పాపం అంటున్నాయి.

కన్నకొడుకులే కానివారుగా..!

కన్నకొడుకులే కానివారుగా..!

కన్నకొడుకులే కానివారుగా తయారైన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. తల్లి అని చూడకుండా వారు ప్రవర్తించిన తీరు చర్చానీయాంశమైంది.
కొరిశపాడు మండలం రావినూతల గ్రామానికి చెందిన బి. ప్రసాదరావు, ధనలక్ష్మి దంపతులకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. అయితే ప్రసాదరావు కాలం చేశారు. ఆయన ఉన్నప్పుడే ఆస్తిని నాలుగు భాగాలుగా చేశారు. కొడుకులు కోటేశ్వరరావు, శంకరరావు, వెంకట సుబ్బారావుతో పాటు ఆయన భార్య ధనలక్ష్మికి సమానంగా ఆస్తి పంపకాలు చేశారు.

అదలావుంటే పెద్దకొడుకు, చిన్నకొడుకు కలిసి ఆమెకు వచ్చిన ఆస్తి కొట్టేయాలని ప్లాన్ చేశారు. ఆ క్రమంలో మాయమాటలు చెబుతూ ఆమె ఆస్తిని తమ పేరు మీదకు రాయించుకున్నారు. ఆస్తి కాజేశాక ఆమెను సరిగా పట్టించుకోవడమే గాకుండా ఇంట్లో నుంచి గెంటేశారు. దాంతో ఆమె చేసేదేమీ లేక తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళనకు దిగారు.

పెద్దకొడుకు, చిన్నకొడుకు డ్రామా.. ఉన్నదంతా కాజేసి..!

పెద్దకొడుకు, చిన్నకొడుకు డ్రామా.. ఉన్నదంతా కాజేసి..!

ధనలక్ష్మి భర్త చనిపోవడంతో ఆమె ఒంటరిగా ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఆ క్రమంలో పెద్దకొడుకు కోటేశ్వరరావుతో పాటు చిన్నకొడుకు వెంకట సుబ్బారావు కలిసి ఆమె ఆస్తి కాజేసేందుకు ప్లాన్ వేశారు. తల్లిని చేరదీసినట్లు నటించి ఆమె దగ్గరున్న ఆస్తినంతా కొట్టేశారు. మనవళ్లు, మనవరాళ్లు చదువుకోవడానికి బ్యాంకు రుణాల కోసం తన సంతకాలు హామీగా కావాలని కోరడంతో వివిధ పత్రాల మీద సంతకాలు చేశారు.

అలా ఆమె దగ్గరున్న డబ్బు, నగలతో పాటు 25 లక్షల వరకున్న ఆస్తి మొత్తం ఇద్దరు అన్నదమ్ములు కలిసి కాజేశారు. 70 ఏళ్ల వయసున్న తల్లిని మోసం చేస్తున్నామనే బాధ లేకుండా ఆమె దగ్గరున్న మొత్తం కాజేశారు. ఇక ఆ వృద్ధురాలి దగ్గర ఏమీ లేకపోవడంతో రెండేళ్లుగా ఆమెను సరిగా పట్టించుకోవడం లేదు. అంతేకాదు చీటికిమాటికీ ఇబ్బందులకు గురిచేస్తూ కొడుకులు, కోడళ్లు టార్చర్‌ చేస్తున్నారు.

 కొడుకుల మోసంపై తల్లి పోరాటం..!

కొడుకుల మోసంపై తల్లి పోరాటం..!

అయితే ఆ తల్లికి ఇన్నిరోజులుగా అసలు విషయం అర్థం కాలేదు. తీరా ఆరా తీస్తే ఇద్దరు కొడుకుల మోసం బయటపడింది. ఆ క్రమంలో తన ఆస్తి కొట్టేయ్యడమే గాకుండా ఇబ్బందులు పెడతారా అంటూ నిలదీశారు. దాంతో ఇద్దరు కొడుకులు, కోడళ్లు అనరాని మాటలన్నారు. దిక్కున్నచోట చెప్పుకో అంటూ ఈసడించుకున్నారు. ఇంట్లో ఉండేది లేదంటూ ఆమెను బయటకు గెంటేశారు. అంతేకాదు తన బట్టలు కూడా కనిపించొద్దంటూ రోడ్డుపైకి విసిరేశారు.

పెద్దకొడుకు, చిన్నకొడుకు చేసిన మోసానికి ఆ తల్లి కన్నీరు కార్చింది. తీవ్ర మనస్థాపానికి గురై.. రెండో కుమారుడైన శంకరరావుకు విషయం వివరించారు. అతడి సాయంతో అద్దంకిలో నివసించే చిన్న కుమారుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. ఆస్తి లాక్కోవడమే గాకుండా తనను ఇంటి నుంచి గెంటేసిన కొడుకులపై చర్యలు తీసుకోవాలని.. తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

English summary
A mother neglected by her sons in addanki prakasham district. They suffered mother in the issue of assets and thrown out from house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X