ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రకాశం జిల్లాకు ఏపీ రాజధాని : ఢిల్లీ పెద్దలకు జగన్ అదే చెప్పారా : ఎంపీ జీవీఎల్ కలకలం...!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

ప్రకాశం జిల్లాకు AP రాజధాని || GVL Narasimha Rao Sensational Comments On AP Capital || Oneindia

ఏపీ రాజధాని అమరావతిపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో రాజధానిని కొనసాగించే యోచన వైసీపీకి లేదనిపిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. తనకున్న సమాచారం మేరకు ప్రకాశం జిల్లాకు రాజధాని తరలిస్తున్నారంటూ మరో బాంబు పేల్చారు. ఇప్పటికే అమరావతి రాజధానిగా కొనసాగింపు పైన మంత్రి బొత్సా వ్యాఖ్యలతో రాజకీయంగా రగడ కొనసాగుతోంది. ఇదే సమయంలో బీజేపీ నేతలు రాజధానిలో పర్యటించి మద్దతు ప్రకటించారు. రాజధాని తరలించవద్దని డిమాండ్ చేసారు. ఇప్పుడు ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలు ఉన్న ఎంపీ జీవీఎల్ చేసిన వ్యాఖ్యలతో మరో సారి కలకలం రేగింది. దీనికి ఆయన వివరణ సైతం ఇచ్చారు. ఇప్పుడు దీని పైన ఏపీ ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి.

ప్రకాశం జిల్లాకు ఏపీ రాజధాని..

ప్రకాశం జిల్లాకు ఏపీ రాజధాని..

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపీలో జరుగుతున్న రాజధాని రగడ పైన ఆయన స్పందించారు. అమరావతిలో రాజధానిని కొనసాగించే యోచన వైసీపీకి లేదనిపిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో తనకున్న సమాచారం మేరకు రాజధాని ప్రకాశం జిల్లాకు తరలిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు. కొద్ది రోజలుగా ఏపీలో మంత్రి బొత్సా వ్యాఖ్యలతో రాజధాని మీద రగడ మొదలైంది. తాజాగా రాజధాని ప్రాంత రైతులకు కౌలు సైతం విడుదల చేసారు. ఇదే సమయంలో ప్రభుత్వం రాజధానిలో జరిగిన అవినీతి.. ఇనసైడర్ ట్రేడింగ్ అంటూ టీడీపీ నేతల భూమి కొనుగోళ్ల వివరాలను బయట పెడుతున్నారు. కానీ, రాజధాని గురించి మాత్రం స్పష్టత ఇవ్వటం లేదు. బీజేపీ నేతలు సైతం రాజధాని ప్రాంతంలో పర్యటించారు. రైతులకు అండగా నిలుస్తామని చెప్పుకొచ్చారు. చొక్కాలు మార్చినంత సులువుగా రాజధాని మార్చటం సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. అయితే రాజధాని కోసం భూములు ఇచ్చిన వేలాది మంది రైతులకు నష్టం కలిగేలా వ్యవహరించ వద్దని కోరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఈ నెల 30,31 తేదీల్లో రాజధానిలో పర్యటిస్తున్నారు. ఇప్పుడు సరిగ్గా ఎంపీ జీవీఎల్ చేసిన వ్యాఖ్యలు మరింత వేడిని పెంచుతున్నాయి.

ముఖ్యమంత్రి కేంద్రానికి అదే చెప్పారా..

ముఖ్యమంత్రి కేంద్రానికి అదే చెప్పారా..

రాజధాని పైన రగడ జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి జగన్ అమెరికా పర్యటనలో ఉన్నారు. వచ్చిన తరువాత సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ సమయంలో రాజధానితో పాటుగా పోలవరం వ్యవహారం పైన చర్చించినట్లు సమాచారం. అయితే, ఆయన ఏం చెప్పారనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది. అయితే, ముఖ్యమంత్రి ఢిల్లీ నుండి వచ్చిన తరువాత పోలవరం కంటే రాజధాని మీదే ఎక్కువగా చర్చ సాగుతోంది. అనేక మంది నేతలు ముఖ్యమంత్రి స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ, ముఖ్యమంత్రి మాత్రం దీని మీద ఎక్కడా నోరు విప్పటం లేదు. ఇదే సమయంలో రాజధాని రైతులు ముఖ్యమంత్రి కాన్వాయ్ కు ఎదురుగా నిరసన వ్యక్తం చేసారు. ఢిల్లీలో ప్రభుత్వంలోని పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్న బీజేపీ ఎంపీ జీవీఎల్ నేరుగా ఏపీ రాజధానిని ప్రకాశం జిల్లాకు తరలిస్తారని తనకు ఉన్న సమాచారం అని చెప్పటం ద్వారా ఇప్పుడు ముఖ్యమంత్రి అదే విషయం నేరుగా కేంద్రానిని నివేదించారా అనే అనుమానం మొదలైంది. అదే సమయంలో జీవీఎల్ ఏపీ మంత్రులు కొందరు రాజధాని మార్పు లేదని చెబుతున్న విషయాన్ని ప్రస్తావించారు. దీని పైన ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వాలని అంటూనే..అమరావతిలో రాజధాని కొనసాగదని చాలా ధీమాగా చెబుతున్నారు.

రాజధాని రాష్ట్ర ప్రభుత్వం అంశం..

రాజధాని రాష్ట్ర ప్రభుత్వం అంశం..

ఇదే సమయంలో రాజధాని కేంద్ర పరిధిలోని అంశం కాదని..రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని..దీని పైన స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసారు. రాజధానిని కొనసాగించకుంటే భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో ముఖ్యమంత్రి జగన్ సొంత ఇంటిని నిర్మించుకున్నారని..ఇప్పుడు రాజధాని గురించి రకరకాల వ్యాఖ్యలు చేయటం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు.
అమరావతిలో అవసరానికి మించి భూసేకరణ చేశారన్నారు. పోలవరంలో రూ.2347 కోట్లు అదనంగా ఖర్చు చేశారని.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. ఇందుకు ఎవరిని బాధ్యలుగా చేస్తారో చెప్పాలన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజా ప్రయోజనాల కోసమే ఉండాలి.. కానీ రాజకీయ కక్ష సాధింపు చర్యలుగా ఉండొద్దని జీవీఎల్ చెప్పుకొచ్చారు. అయితే బీజేపీ ఎంపీ చేసిన హాట్ హాట్ కామెంట్స్‌పై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారనేది చూడాలి.

English summary
BJP MP GVL Narasimha Rao sensational comments on AP Capital. He says AP Govt may shift capital to Prakasam dist.Now GVL comments created political heat in Capital controversy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X