ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్! అప్పుడే రోడ్లపైకి వచ్చేలా చేశారు: జనసేన ఓడిపోలేదంటూ పవన్ కళ్యాణ్

|
Google Oneindia TeluguNews

ప్రకాశం: గతంలో టీడీపీ ఇసుక మాఫియా చేస్తే.. ఇప్పుడు వైసీపీ చేస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఒంగోలులో బుధవారం జరిగిన పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని కొందరు పెద్దలతోపాటు బెంగళూరు, తెలంగాణకు ఇక్కడి ఇసుక లభిస్తోంది కానీ.. ఏపీ ప్రజలకు మాత్రం ఇసుక దొరకడం లేదని అన్నారు.

జగన్‌కు సీబీఐ కేసుల భయం, ఢిల్లీలో అందుకే రాజీ..: పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలుజగన్‌కు సీబీఐ కేసుల భయం, ఢిల్లీలో అందుకే రాజీ..: పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు

పిరికితనంగా బతకను..

పిరికితనంగా బతకను..

తాను పిరికితనంగా బతకనని.. గెలవడం కోసం గడ్డితిననని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తాను చనిపోయినా ధైర్యంగా చనిపోతానని అన్నారు. సేవ చేయాలనుకునేవారే తమ పార్టీలోకి రావాలని, ఉండాలన్నారు.

జనసేన ఓడిపోలేదు..

జనసేన ఓడిపోలేదు..


దేశంలో అతిపెద్ద పార్టీగా ఉన్న పార్టీకే ఏపీలో 0.8శాతం ఓట్లు వచ్చాయని, తొలిసారి పెట్టిన పార్టీ జనసేనకు 7శాతం ఓట్లు వచ్చాయన్నారు. మొత్తం సీట్లలో పోటీ చేసివుంటే 20-30శాతం ఓటింగ్ శాతం వచ్చివుండేదన్నారు. నిజంగా చెప్పాలంటే జనసేన ఓడిపోలేదన్నారు.

20ఏళ్ల తర్వాత దేశమంతా జనసేన గురించి..

20ఏళ్ల తర్వాత దేశమంతా జనసేన గురించి..


బీజేపీ, బీఎస్పీ లాంటి పార్టీలు ఎన్నో ఏళ్లుగా కష్టపడితేనే ఈ స్థాయికి వచ్చాయన్నారు.
20ఏళ్ల తర్వాత దేశమంతా జనసేన పార్టీ గురించి దేశమంతా చెప్పుకోవాలని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ లేని నీళ్లు రావాలన్నదే తన కల అని అన్నారు. ఉపాధి లభించాలన్నారు. తాను అందరిలా మాయమాటలు చెప్పనని.. అన్నారు.

జగన్.. అప్పుడే రోడ్లపైకి వచ్చేలా చేశారు..

జగన్.. అప్పుడే రోడ్లపైకి వచ్చేలా చేశారు..

151 సీట్లు సాధించిన జగన్.. ఇంత త్వరగా ప్రజల నమ్మకాన్ని కోల్పోతారని అనుకోలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. జగన్ 15-20ఏళ్లపాటు అధికారంలో ఉంటారనుకుంటే.. నాలుగు నెలలకే తనను ప్రజల కోసం రోడ్లపైకి వచ్చేలా చేశారన్నారు. తనకు ఓట్లు వేసినా.. వేయకపోయినా ప్రజల కోసం పోరాడతానన్నారు. ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే అభివృద్ధి చేయమంటే.. డబ్బులిస్తేనే ఓట్లు వేశారని అంటున్నారన్నారు.

కొట్టినా కొడతారంటూ..

కొట్టినా కొడతారంటూ..

ఒకే పార్టీకి భారీ మెజార్టీ వస్తే చర్చలు సరిగా సాగవని.. అసెంబ్లీలో 150 మంది సభ్యులు అధికార పార్టీకి చెందిన వారే ఉంటే.. మిగితా వారిని కొట్టినా కొడతారని అన్నారు.
రాష్ట్ర ప్రజల కోసం జనసేన ద్వారా పోరాటం కొనసాగించేందుకు ప్రజలు, యువత ముందుకు రావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. విశాఖలో నవంబర్ 3న భవన నిర్మాణ కార్మికుల కోసం భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని, మీరంతా సహకారం అందించాలన్నారు. ప్రజలతో మమేకం కావాలని నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

English summary
Janasena Party president Pawan Kalyan fired at YS Jaganmohan Reddy's government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X