ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోపిదేవి స్థానాన్ని భర్తీ చేయనున్న పెన్మత్స సురేష్: ఎమ్మెల్సీగా కాస్సేపట్లో నామినేషన్

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పెన్మత్స సాంబశివ రాజు కుమారుడు పెన్మత్స సురేష్‌బాబు శాసన మండలి సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ ఉదయం 11 గంటలకు ఆయన శాసన మండలి కార్యదర్శిని కలిసి తన నామినేషన్ పత్రాలను అందజేయనున్నారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ ఖాళీ చేసిన స్థానాన్ని పెన్మత్స సురేష్‌బాబుతో భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఆ విసా హోల్డర్లకు గుడ్‌న్యూస్: భార్యాబిడ్డలతో అమెరికా వెళ్లొచ్చు..కానీ: షరతులతో అనుమతిఆ విసా హోల్డర్లకు గుడ్‌న్యూస్: భార్యాబిడ్డలతో అమెరికా వెళ్లొచ్చు..కానీ: షరతులతో అనుమతి

నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి గురువారం చివరి రోజు. దీనితో ఈ ఉదయం ఆయన తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. పోటీలో ఎవరూ లేకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన పెన్మత్స సాంబశివరాజు సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగారు. ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీని నెలకొల్పిన తరువాత అందులో చేరారు. సోమవారం పెన్మత్స కన్నుమూశారు.

Penmatsa Suresh Babu filing his nomination as MLC from YSRCP in AP today

పార్టీకి చేసిన సేవలకు గుర్తుగా పెన్మత్స సురేష్‌బాబు శాసనమండలికి పంపించాలని నిర్ణయించారు. మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన స్థానాన్ని సురేష్‌బాబుతో భర్తీ చేయనున్నారు. 2014 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో సురేష్ బాబు నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పతివాడ నారాయణ స్వామి నాయుడు చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు.

Recommended Video

AP CM YS Jagan Launches YSR Cheyutha Scheme || Oneindia Telugu

ఆ లోటును భర్తీ చేయడానికి సురేష్‌బాబును శాసన మండలికి పంపించాలని నిర్ణయించుకున్నారు. మోపిదేవి రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని ఆయనతో భర్తీ చేయనున్నారు. నిజానికి- మోపిదేవి స్థానంలో మరో ఇద్దరిని శాసన మండలికి పంపించడానికి వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఏర్పాట్లు చేసినప్పటికీ.. అది సాధ్యం కాలేదు. గుంటూరు జిల్లాకు చెందిన ఓ సీనియర్ నాయకుడిని మోపిదేవి స్థానంలో భర్తీ చేయాలని మొదట్లో నిర్ణయించారు. పెన్మత్స సాంబశివరాజు కన్నుమూయడంతో సురేష్‌బాబు పేరు తెర మీదికి వచ్చింది.

English summary
Penmatsa Suresh Babu filing his nomination as MLC from YSRCP in AP today. Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy has recently announced the candidate for MLC elections. He has selected a candidate for the MLC election on behalf of the YSR Congress Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X