• search
  • Live TV
ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

దివ్యాంగుడే.. కానీ రాక్షసుడు.. ప్రకాశం జిల్లా గ్యాంగ్‌రేప్ కేసులో సంచలన నిజాలు

|

అమరావతి : ప్రకాశం జిల్లాలో జరిగిన గ్యాంగ్ రేప్‌లో కొత్త కోణాలు వెలుగుచూశాయి. దివ్యాంగుడు ప్రధాన సూత్రధారిగా జరిగిన అరాచకపర్వంలో ట్విస్టులెన్నో బయటపడుతున్నాయి. వరంగల్‌లో జరిగిన చిన్నారి అత్యాచార కేసులో ఫేస్‌బుక్ వేదికగా తీవ్రంగా ఖండించిన ఆ దివ్యాంగుడిలో దాగి ఉన్న రాక్షసరూపం వెలుగుచూడటం రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది.

దివ్యాంగుడి రూపంలో ఉన్న ఆ భయంకర ఉన్మాది.. ఫేస్‌బుక్ వేదికగా వరంగల్ ఘటనను తీవ్రంగా ఖండించాడు. ఎక్కడా లేని ఆక్రోశం వెళ్లగక్కుతూ ఆ నిందితుడిని చంపేయాలంటూ నీతిసూక్తులు వల్లించాడు. అయితే ఆ పోస్ట్ చేసిన రెండు రోజులకే ఈ దుర్మార్గుడి లీలలు బయటపడటం గమనార్హం.

చంద్రబాబు అడగటమే తప్పా.. ప్రజావేదిక కూల్చితే ఏం లాభం.. టీడీపీ నేతల ఆగ్రహం

 దివ్యాంగుడు కాదు మోస్ట్ డేంజరస్ ఫెల్లో

దివ్యాంగుడు కాదు మోస్ట్ డేంజరస్ ఫెల్లో

ప్రకాశం జిల్లా గ్యాంగ్ రేప్ కేసులో బయటపడుతున్న నిజాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్నాయి. వరంగల్‌లో చిన్నారిపై జరిగిన అరాచకాన్ని ఫేస్‌బుక్ వేదికగా ఎండగట్టిన దివ్యాంగుడు బాజీ.. గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడిగా తేలడం చర్చానీయాంశమైంది. వరంగల్ ఘటనలో పట్టుబడ్డ నిందితుడిని జైల్లో పెట్టి పోషించడం కంటే చంపేయడం మేలంటూ పోస్టులు పెట్టాడు.

ఈ నెల 21వ తేదీన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన బాజీ రెండు రోజులకే ప్రకాశం జిల్లా గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులకు పట్టుబడటం గమనార్హం. తానేదో సంఘ సంస్కర్తగా ఫీలవుతూ వరంగల్ ఘటనపై గొంతు చించుకున్న బాజీ.. రెండు రోజులకే సామూహిక అత్యాచారం కేసులో నిందితుడిగా మారడం హాట్ టాపిక్ అయింది.

 రెండు చేతులు లేవని నమ్మి వెళితే.. రాక్షస క్రీడ

రెండు చేతులు లేవని నమ్మి వెళితే.. రాక్షస క్రీడ

దివ్యాంగుడైన బాజీకి రెండు చేతులు లేవు. అయితే అతడు వరంగల్ చిన్నారి అత్యాచార ఘటనను ఖండిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టులు పెడుతుంటే నెటిజన్లు కూడా చాలామంది రియాక్ట్ అయ్యారు. బాజీ వ్యాఖ్యలను సమర్థించారు. కానీ, వాడిలో కూడా ఉన్మాది దాగున్నాడనే విషయం అంతవరకు ఎవరికి తెలియదు. ఆ పోస్టులు పెట్టిన రెండు రోజులకే బాజీ బాగోతం బయటపడటంతో అందరూ షాక్‌కు గురయ్యారు.

ఈనెల 17వ తేదీన ఒంగోలు బస్‌స్టాండ్‌లో ఒంటరిగా కనిపించిన యువతికి మాయమాటలు చెప్పి తన గదికి తీసుకెళ్లాడు బాజీ. తనకు తోడుగా మరికొంతమంది స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రెండు చేతులు లేని దివ్యాంగుడు కదా తనకేమీ ముప్పు ఉండదని భావించిన ఆ యువతి అతడిని గుడ్డిగా నమ్మడమే పాపమైంది. ఆరు రోజులు నరకం చూపించారు దుర్మార్గులు.

గ్యాంగ్ రేప్ పై టీడీపీ నేతల ఆగ్రహం

ఆ యువతిపై పదే పదే అత్యాచారానికి పాల్పడుతూనే అటు ఫేస్‌బుక్‌లో మాత్రం వరంగల్ ఘటనను తీవ్రంగా ఖండించాడు. తానేదో మంచివాడిగా పోస్టులు పెడుతూ తనలోని దుర్మార్గాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశాడు. ఆరు రోజుల పాటు ఆ యువతికి ప్రత్యక్ష నరకం చూపించారు దుర్మార్గులు. దివ్యాంగుడైన బాజీ మాత్రం ఓవైపు తాను ఈ అరాచకానికి ఒడిగడుతూనే.. సోషల్‌ మీడియాలో మాత్రం అత్యాచారాలపై గళమెత్తాడు. అలాంటి వాళ్లను చంపేయాలంటూ నీతిసూక్తులు వల్లించాడు.

వరంగల్ చిన్నారి అత్యాచారం ఘటనపై గొంతెత్తినోడే ఈ అమానుషకాండ సాగించడం దుమారం రేపుతోంది. అంతేకాదు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రకాశం జిల్లాలో జరిగిన గ్యాంగ్ రేప్‌పై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగుడైన బాజీ వైసీపీ కార్యకర్త అంటూ ఆరోపిస్తున్నారు. అతని ఫేస్‌బుక్ పేజీ ఆధారంగా వైసీపీకి సన్నిహితంగా ఉంటాడనే విషయం అర్థమవుతోందని వాదిస్తున్నారు.

English summary
New Twists Found In Prakasham District Gang Rape Incidents. Police were declared Physical Handicapped person as most dangerous. His mentality very cruel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more