ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుకు మరో షాక్: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి, ఆయన కుమారుడు

|
Google Oneindia TeluguNews

అమరావతి: మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. టీడీపీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి శిద్ధా రాఘరావు ఏపీ సీఎం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో బుధవారం ఆ పార్టీలో చేరారు.

పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన జగన్..

పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన జగన్..

రాఘవరావుతోపాటు ఆయన కుమారుడు కూడా వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ జగన్. ఈ కార్యక్రమంలో మంత్రులు బాలినేని శ్రీనివాస్, ఆదిమూలపు సురేష్, వెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

పేదల పెన్నిధి జగన్ అంటూ..

పేదల పెన్నిధి జగన్ అంటూ..

ఈ సందర్భంగా మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఏడాది పాలనలో జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. పేద, మధ్య తరగతి ప్రజలు అనేక మంది ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందుతున్నారని శిద్ధా రాఘవరావు తెలిపారు. భవిష్యత్తులోనూ అనేక సంక్షేమ పథకాలు సీఎం అమలు చేస్తారన్నారు. సీఎంగా వైఎస్ జగన్ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Recommended Video

Posani Krishna Murali Helps TV5 Reporter Manoj Kumar Family

టీడీపీకి షాక్‌ల మీద షాక్‌లు

గత టీడీపీ ప్రభుత్వంలో శిద్ధా రాఘవరావు అటవీ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత టీడీపీ గత ఎన్నికల్లో ఓటమిపాలు కావడంతో కొంత కాలంగా ఈయన టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆ తర్వాత తాజాగా వైసీపీలో చేరారు.
కాగా, ఇప్పటికే చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం కూడా వైసీపీకి మద్దతు పలుకుతున్నారు. అయన కుమారుడు వెంకటేశ్‌ను అధికారికంగా ఆ పార్టీలో చేర్పించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు టీడీపీ నుంచి వైపీలో చేరగా.. తాజాగా శిద్ధా రాఘవరావు కూడా ఆ పార్టీని వీడి వైసీపీలో చేరడం పసుపు పార్టీకి కొంతమేర నష్టమనే చెప్పాలి.

English summary
Former minister sidda raghava rao and his son joined ysrcp on the presence of cm ys jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X