ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు హెచ్చ‌రిక‌: నాకేమైనా జ‌రిగితే రాష్ట్రాన్ని కంట్రోల్‌ చేయలేరు

|
Google Oneindia TeluguNews

టీడీపీ అధినేత ..ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పై ఫైర్ అయ్యారు. త‌న‌కు భ‌ద్ర‌త త‌గ్గించ‌టం పైన చంద్ర‌బాబు సీరియ‌స్‌గా రియాక్ట్ అయ్యారు. వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత రాజ‌కీయ దాడుల్లో మ‌ర‌ణించిన టీడీపీ కార్య‌క‌ర్త‌ల కుటుంబాల ప‌రామ‌ర్శ యాత్ర చంద్ర‌బాబు ప్రారంభించారు. ప్ర‌కాశం జిల్లాలో ఆత్మ‌హత్య చేసుకున్న ప‌ద్మ కుటుంబాన్ని చంద్ర‌బాబు ప‌రామ‌ర్శించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డ‌ర్ ప‌నితీరు పైన ఫైర్ అయ్యారు. ముఖ్య‌మంత్రి ప‌ట్టించుకోర‌ని దుయ్య‌బ‌ట్టారు.

రాష్ట్రాన్ని కంట్రోల్‌ చేయలేరు..

రాష్ట్రాన్ని కంట్రోల్‌ చేయలేరు..

త‌న‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌టం లేద‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్ర ఆరోప‌ణ‌లు చేసారు. భ‌ద్ర‌త విష‌యంలో జోక్యం చేసుకొని..రాజ‌కీయంగా క‌క్ష్య సాధింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఫైర్ అయ్యారు. త‌న‌కు ఏదైనా జ‌రిగినే రాష్ట్రాన్ని కంట్రోల్‌ చేయలేరు అని చంద్ర‌బాబు ఏపి ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు. తన‌ను వెంటాడ‌మే ప‌నిగా పెట్టుకున్నార‌ని చంద్ర‌బాబు ధ్వ‌జ‌మెత్తారు. ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండలం రుద్రమాంబపురంలో ఆత్మహత్య చేసుకున్న పద్మ కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించారు. పద్మ కుటుంబానికి రూ.7.65 లక్షల ఆర్థికసాయం అందజేశారు. మహిళను రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి తన్నితన్ని చంపారని మండిపడ్డారు. వివస్త్రను చేసి సెల్‌ఫోన్‌లో చిత్రీకరించడం దారుణమ న్న రు. ఓ ఆడబిడ్డ పట్ల వీళ్లు అనుసరించిన తీరు అనాగరికమని ధ్వజమెత్తారు. ప్రజలు తిరగబడితే మీరేం చేయలేరు అంటూ మాజీ సీఎం తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

మ‌రో పులివెందుల చేద్దామ‌నా..

మ‌రో పులివెందుల చేద్దామ‌నా..

రుద్ర‌మాంబ పురంలో జ‌రిగిన ఘ‌ట‌న అనాగ‌రిక‌మ‌ని..ఇంత ఘోరం జ‌రుగుతుంటే ముఖ్య‌మంత్రి మాట్లాడ‌ర‌ని ఎద్దేవా చేసారు. హోం మంత్రి మామాలే అంటున్నార‌ని ఆరోపించారు. పోలీసుల క‌ళ్ల ముందే దోషులు తిరుగుతుంటే వైసీపీ ప్ర‌భుత్వం ఏం చేస్తోంద‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. రాష్ట్రాన్ని మరో పులివెందుల చేద్దామనుకుంటున్నారా అంటూ నిల‌దీసారు. త‌మ పార్టీ నేత‌లు డీజీపీ ద‌గ్గ‌ర‌కు వెళ్లి త‌మ పార్టీ కార్యాక‌ర్త‌ల‌ను చంపుతున్నారంటూ మెమోరాండం ఇస్తే ఎగ‌తాళి చేసార‌ని ఆరోపించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ..త‌రువాత రాష్ట్రంలో జ‌రిగిన ప‌రిణామాల పైనే టీడీపీ ప్ర‌ధానంగా ఫోక‌స్ చేస్తోంది. కార్య‌క‌ర్త‌ల పైన దాడులు జ‌రుగుతున్నాయ‌ని..ఇప్ప‌టి వ‌ర‌కు ఆరుగురు టీడీపీ కార్య‌క‌ర్త‌ల ను హ‌త్య చేసార‌ని టీడీపీ అధినాయ‌క‌త్వం ఆరోపిస్తోంది. దీంతో..కార్య‌క‌ర్త‌ల కుటుంబాల‌కు ప‌రామ‌ర్శ‌లు మొద‌లు పెట్టిన చంద్ర‌బాబు..ప్ర‌భుత్వం మీద ఫైర్ అవుతున్నారు.

అసెంబ్లీ స‌మావేశాల్లో ఇదే ప్ర‌ధాన అంశంగా..

అసెంబ్లీ స‌మావేశాల్లో ఇదే ప్ర‌ధాన అంశంగా..

ఈ నెల 11వ తేదీ నుండి ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ స‌మావేశాల్లో త‌మ పార్టీ కార్య‌క‌ర్త ల మీద దాడుల అంశాన్ని ప్ర‌స్తావించి ప్ర‌భుత్వాన్ని నిల‌దీయాల‌ని టీడీపీ నిర్ణ‌యించింది. ఇప్ప‌టికే కార్య‌క‌ర్త‌ల కోసం పార్టీ టోల్ ఫ్రీ నెంబ‌ర్‌ను ప్రారంభించింది. స‌మావేశాలు ప్రారంభించే లోగా హ‌త్య‌కు గుర‌యిన కార్య‌క‌ర్త‌ల కుటుంబాల ను ప‌రామ‌ర్శ పూర్తి చేయాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. ఆయ‌న అనంత‌పురం, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో ప‌ర్య టించ‌నున్నారు. ఇక‌, ఇప్పుడు చంద్ర‌బాబు చేసిన తీవ్ర వ్యాఖ్య‌ల పైన వైసీపీ నేత‌లు ఎలా స్పందిస్తారో చూడాలి.

English summary
TDP Cheif Chandra babu warned CM Jagan that if any thinh happen to him cant control state. Is Cm want to create state as Puivendula. Chandra Babu console Padma family in Prakasam dist.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X