• search
  • Live TV
ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాంకు ఇద్దరు భార్యలు .. ఆయన అనర్హుడు అంటున్న ఆమంచి

|

చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఎన్నిక చెల్లదంటూ వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే . కరణం బలరాం అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని కరణం బలరాంకు నలుగురు సంతానమని ఆరోపిస్తున్నారు ఆమంచి కృష్ణ మోహన్ .అయితే ఎన్నికల అఫిడవిట్ లో కేవలం ముగ్గురు అని మాత్రమే ఉన్నారని చూపించారని ఆరోపించారు. అందుకు సంబంధించి ఆధారాలను సైతం హైకోర్టుకు సమర్పించారు. కరణం బలరాంపై అనర్హత వేటు వేయాలని తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని కోరారు. ఇక అంతే కాదు ఈ రోజు మీడియాతో కరణం బలరాం ఎన్నిక చెల్లదు అని అందుకు గల కారణాలను తెలియజేశారు ఆమంచి కృష్ణమోహన్.

బీజేపీ టార్గెట్ గా టీఆర్ఎస్ వ్యూహం ..పార్టీ శ్రేణులకు కేటీఆర్ కఠిన ఆదేశంబీజేపీ టార్గెట్ గా టీఆర్ఎస్ వ్యూహం ..పార్టీ శ్రేణులకు కేటీఆర్ కఠిన ఆదేశం

కరణం బలరాం కు ఇద్దరు భార్యలు అన్న ఆమంచి .. అఫిడవిట్ లో తప్పుడు సమాచారం అని ఆరోపణ

కరణం బలరాం కు ఇద్దరు భార్యలు అన్న ఆమంచి .. అఫిడవిట్ లో తప్పుడు సమాచారం అని ఆరోపణ

2019 ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కరణం బలరాం, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కరణం బలరాం గెలుపొందారు. అయితే కరణం బలరాం ఎన్నిక చెల్లదని తప్పుడు సమాచారం ఇచ్చి ఎన్నికల సంఘాన్ని తప్పుదారి పట్టించారని ఆరోపించారు ఆమంచి . కరణం బలరాం తన ఎన్నికల అఫిడవిట్ లో ఓ భార్య వివరాలనే బయటపెట్టారని ఆయనకు ఇంకో భార్య కూడా ఉన్నారని ఆమంచి షాకింగ్ న్యూస్ చెప్పారు . కరణం బలరాంకు మరో భార్య, కుమార్తె ఉన్నారన్న విషయాన్ని దాచిపెట్టారని విమర్శించారు.

కోర్టులో కరణం ఎన్నిక చెల్లదని పిటీషన్ .. ఆన్ని ఆధారాలతో ఆమంచి ఫైట్

కోర్టులో కరణం ఎన్నిక చెల్లదని పిటీషన్ .. ఆన్ని ఆధారాలతో ఆమంచి ఫైట్


విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమంచి, తన ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాలను మీడియా ముందు ఉంచారు . ఎన్నికల అఫిడవిట్ లో ఒక భార్య పేరును కరణం సరస్వతిగా పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆయనకున్న మరో భార్య ప్రసూన గురించి ప్రస్తావించలేదని ఆయన అన్నారు . తనపై ఆధారపడి జీవిస్తున్నవారు ఎవరూ లేరని తెలిపారని, ప్రసూన గురించి, ఆమె ఆదాయం, ఆస్తి, అప్పుల గురించి వివరించలేదని పేర్కొన్నారు . పలువురు ప్రముఖులు, కుటుంబసభ్యుల సమక్షంలో 1985లో ప్రసూనతో బలరామకృష్ణ మూర్తి వివాహం శ్రీశైలంలో జరిగిందన్న ఆమంచి కరణం బలరాం, ప్రసూనలకు అంబిక కృష్ణ 1989లో హైదరాబాద్‌లోని సెయింట్‌ థెరిస్సా ఆస్పత్రిలో జన్మించిందని తెలిపారు . ఇక అంబిక ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్‌లో, ఆధార్‌ కార్డులో తండ్రి పేరు కరణం బలరామకృష్ణ మూర్తి అని ఉందని ఆయన పేర్కొన్నారు. అంబిక అన్నప్రాసన, మొదటి పుట్టినరోజు వేడుకలు, అక్షరాభ్యాస వేడుకలకు సంబంధించిన ఫొటోల్లోనూ బలరాం ఉన్నారని వాటిని చూపించారు . అంబిక కృష్ణ ప్రస్తుతం ఎల్‌ఎల్‌బీ చదువుతోందని చెప్పిన ఆయన కరణంకు ఇంకో కూతురు ఉందని అందుకు కావాల్సిన ఆధారాలను బయటపెట్టారు .

కరణం తప్పుడు సమాచారం ఇచ్చినందువల్ల నామినేషన్ చెల్లదంటున్న ఆమంచి

కరణం తప్పుడు సమాచారం ఇచ్చినందువల్ల నామినేషన్ చెల్లదంటున్న ఆమంచి


ఎన్నికల చట్ట నిబంధనల ప్రకారం.. కరణం నామినేషన్‌ను చట్ట ఆమోదయోగ్యమైన నామినేషన్‌గా పరిగణించడానికి వీల్లేదని పేర్కొన్న ఆమంచి ఆయన నామినేషన్‌ను చెల్లనిదిగా ప్రకటించాలి. బలరాం ఎన్నికను రద్దు చేయండి అంటూ తన పిటిషన్‌లో వివరించారు. కరణం బలరాంపై అనర్హత వేటు వేయాల్సిందిగా కోరినట్లు ఆమంచి చెప్పారు. . ఇక కరణం బలరాం నాలుగో కూతురు తనను చెల్లిగా భావించి న్యాయం చేయాలని తనను ఆడిగినట్టు ఆమంచి పేర్కొన్నారు.

English summary
Former MLA Amanchi Krishna Mohan filed a petition in the High Court against TDP MLA Karanam Balaram. In his petition, he alleged that Karanam did not furnish complete details about his family. Amanchi brought to the notice of the High Court that Karanam Balaram has four children and two wives. but he mentioned in the affidavit submitted to the Election Commission (EC) that he has only three children and only wife. The YSRCP leader urged the High Court to disqualify Balaram for hiding facts from the EC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X