ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వెంటాడిన దురదృష్టం..! కేవలం 1300 తేడాతో దగ్గుపాటి ఔట్...!!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరబాద్:ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లోనూ వైసీపీ హవా కొనసాగింది. జగన్ దెబ్బకు టీడీపీకి కంచుకోటలు సైతం కుదేలయిపోయాయి. ఇక, నాలుగు జిల్లాల్లో అయితే టీడీపీ అసలు ఖాతానే తెరవలేదు. ఇక, ప్రకాశం జిల్లాలోని మొత్తం 12 అసెంబ్లీ స్థానాలుండగా వైసీపీ ఎనిమిది, టీడీపీ నాలుగుచోట్ల గెలుపొందింది. గత ఎన్నికల్లో ఈ జిల్లాలో టీడీపీ ఐదు, వైసీపీ ఆరు సీట్లను గెలుచుకోగా, ఒకచోట స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. అయితే, వైసీపీకి ఎంతో కీలకమైన పర్చూరులో మాత్రం ఆ పార్టీ ఓడిపోయింది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తిరిగి విజయం సాధించారు. తనయుడు హితేశ్‌ను తొలుత ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేయించాలని దగ్గుబాటి వెంకటేశ్వరరావు భావించారు. అయితే, చివరి నిమిషంలో ఆయన పౌరసత్వం వివాదం అడ్డురావడంతో దగ్గుబాటి బరిలో నిలిచారు. అయినా ఆయనకు మాత్రం విజయం దక్కలేదు.

The misfortune that followed.!Daggubati out with just 1300 votes..!!

వైసీపీ నుంచి పర్చూరు అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీచేశారు. రాష్ట్రంలో ఈ నియోజకవర్గంపై అత్యంత ఆసక్తి నెలకుంది. ఓటమి ఎరుగని నేతగా గుర్తింపు పొందిన దగ్గుబాటి ఓ వైపు, నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపి టీడీపీ అభ్యర్థి మరోవైపు ఉండటంతో ఇక్కడ పోటీ రసవత్తరంగా సాగింది. ఓట్ల లెక్కింపులో ఇదే విషయం అవగతమైంది. తుది వరకూ ఇద్దరి మధ్యా విజయం దోబూచులాడింది. చివరకు టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. కేవలం 1,300 ఓట్లతో టీడీపీ అభ్యర్థి ఇక్కడ గెలుపొందడం విశేషం. దగ్గుబాటి వైసీపీలో చేరినా పురందేశ్వరి మాత్రం బీజేపీలోనే కొనసాగారు. ఆమె విశాఖపట్నం పార్లమెంటు స్థానం నుంచి పోటీచేసి, ఘోరంగా ఓడిపోయారు. ఇక్కడ ఆమెకు కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. గత ఎన్నికల్లో విశాఖపట్నం స్థానాన్ని పొత్తుల్లో భాగంగా బీజేపీకి టీడీపీ కేటాయించింది. దీంతో అక్కడ బీజేపీ సునాయాసంగా విజయం సాధించింది. అయితే, ఈసారి ఏపీలో బీజేపీకి ఎక్కడా డిపాజిట్లు దక్కలేదు. 2009 ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా గెలిచిన పురందేశ్వరికి ఈసారి మాత్రం డిపాసిట్ గల్లంతయ్యింది.

English summary
The party lost in the key role of the YCP. Here is the sitting MLA Eluri Sambasiva Rao, Daggubati Venkateswara Rao thought that his son Hitesh should first contest from here as a candidate for the YCP.But at the last minute Daggubati venkateswar rao was in the fray with his son citizenship controversy. But he did not win.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X