ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దొనకొండలో వైసిపి రియల్ వ్యాపారం..! అందుకే రాజధానిని తరలించే కుట్ర చేస్తున్నారన్న వేదవ్యాస్..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

అందుకే రాజధానిని తరలించే కుట్ర: వేదవ్యాస్ || TDP Leader Vedavyas Sensational Allegations On YSRCP

అమరావతి/హైదరాబాద్ : రాష్ట్ర ప్రయోజనాలకన్నా రాజకీయ ప్రయోజనాలకే ప్రాముఖ్యతనిస్తూ ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అదోగతి పాలు చేయాలని ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని టీడిపి సీనియర్ నేత బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు. కృష్ణ, గుంటూరు జిల్లాలను కలుపుతూ అందరికి ఆమోదయోగ్యమైన ప్రదేశంలో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి గత టీడిపి ప్రభుత్వం సన్నాహాలు చేసిందని, అందుకోసం రాజదాని శంఖుస్తాపనకు ప్రధాని మోదీ కూడా హాజరయ్యారని తెలిపారు.

కావాలనే ముంపు ప్రాంతంగా చిత్రీకరించి రాజధానిని తరలించే ప్రయత్నం చేస్తున్నారని వైసీపి ప్రభుత్వం పై మండిపడ్డారు. దొనకొండ ప్రాంతంలో వైసిపికి చెందిన నాయకులు భూములు ఎక్కువగా కొనుగోలు చేసారని, ఇప్పుడు రాజధానిని అక్కడకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని వేద వ్యాస్ అన్నారు. అమరావతిలో చంద్రబాబు నివాసంపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వరద ఉదృతిని బట్టి కృష్ణ నది గేట్లు ఎత్తాల్సి ఉన్నా ఎత్తకుండా ఎక్కువ టీఎంసీల నీటిని నిలువచేసిన తర్వాత అకస్మాత్తుగా గేట్లు ఎత్తారని, అప్పుడు ఆ నీరు ఎక్కువగా ప్రవహించిందని, దీనివెనక ప్రభుత్వ కుట్ర ఉందని వేదవ్యాస్ మండిపడ్డారు. ఏపి రాజదాని అంశంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన వన్ ఇండియా తెలుగుతో ప్రత్యేకంగ మాట్లాడారు.

The real business of the YCP in Donakonda.!Thats why the conspiracy to move the capital..!!

విజయసాయి రెడ్డి కావాలనే తప్పుడు సమాచారం ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు వేదవ్యాస్. ఆంద్ర ప్రదేశ్ అంతర్గత వ్యవహారాల్లో కేంద్ర జోక్యం చేసుకుంటుందని తాను భావించడం లేదని, విజయసాయి రెడ్డి కావాలనే ఏపి తప్పుడు సందేశాలను పంపిస్తున్నారని అన్నారు. రాజదాని నిర్మాణం కోసం 33వేల ఎకరాల భూమిని స్వచ్చందంగా ఇచ్చిన రైతులు ఆందోళన చెందాల్సి అవసరం లేదని, న్యాయపోరాటం చేసైనా రాజధాని నిర్మాణం తరలిపోకుండా కాపాడతామని అన్నారు.

పోలవరం అంశంలో కూడా వైసిపి ప్రభుత్వం తప్పుడు సందేశాలిచ్చే కార్యక్రమాలకు ఉపక్రమించిందని, జగన్ మోహన్ రెడ్డి పోలవరాన్ని ప్రత్యక్ష్యంగా చూసిన తర్వాత అభిప్రాయాన్ని మార్చుకున్నారని చెప్పకొచ్చారు. అమరావతిలో రైతులు గాని, ప్రజలు గాని ఎవ్వరు కూడా ఏపి అభివృద్ది పట్ల ఆందోళన చేందాల్సిన అవసరం లేదని, అందరికి న్యాయం జరిపించడానికి తెలుగుదేశం పార్టీ ఉందని బూరగడ్డ వేదవ్యాస్‌ స్పష్ఠం చేసారు.

English summary
Senior leader of the TDP, Buragadda Veda vyas said that the VP, Jagan Mohan Reddy, has been trying to make the Andhra Pradesh state more important to political interests than the state's interests. The last TDP government has made preparations for the construction of a world-class capital in a place that is acceptable to all, connecting Krishna and Guntur districts, and the Prime Minister has also attended the Rajits Shamkhastham. The VHP government has been accused of trying to move the capital, portraying it as a thorny area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X