ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసీపీ జెండా పోల్ కు కరెంట్ .. షాక్ తో ముగ్గురు విద్యార్థులు మృతి

|
Google Oneindia TeluguNews

ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. స్వాతంత్ర దినోత్సవానికి ముందు రోజు ముగ్గురు చిన్నారులు విద్యుత్ షాక్ కు గురయ్యి విగత జీవులుగా మారిపోయారు. సంతమాగులూరు మండలం కొప్పర గ్రామంలో చోటు చేసుకున్న ఈ విషాద సంఘటనలోగ్రామంలో ఏర్పాటు చేసిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గద్దె ముగ్గురి ఉసురు తీసింది.

<strong>రాజ్య సభ సభ్యురాలిగా కిల్లి కృపారాణికి ఛాన్స్ !!... స్థానిక వైసీపీ నేతల విముఖత .. రీజన్ ఇదే </strong>రాజ్య సభ సభ్యురాలిగా కిల్లి కృపారాణికి ఛాన్స్ !!... స్థానిక వైసీపీ నేతల విముఖత .. రీజన్ ఇదే

ఒకపక్క కురిసిన భారీ వర్షాలు, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ముగ్గురు చిన్నారులను బలిగొన్న ఘటన ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. ముగ్గురు చిన్నారుల మరణం స్థానికుల మనసులను కలచి వేస్తుంది. మూడు కుటుంబాల్లో విషాదం నింపిన ఘటన వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా పరిధిలోని సంతమాగులూరు మండలం కొప్పవరంలో కోదండరామస్వామి ఆలయ ప్రధాన కూడలి వద్ద గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ జెండా గద్దెను నిర్మించి పార్టీ జెండా ఆవిష్కరించింది. అయితే ఆ జెండా పోల్ కు పైన విద్యుత్ తీగలు తగలటంతో పోల్ దగ్గర ఆడుకుంటున్న ముగ్గురు విద్యార్థులు విద్యుత్ షాక్ తో మృత్యువాతపడ్డారు. ఇటీవలి వర్షాలకు ఆ జెండాపై విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. ఈ విషయం గమనించని ముగ్గురు విద్యార్థులు ఆడుకుంటూ దాని దగ్గరికి వచ్చారు. జెండా స్తంభాన్ని పట్టుకున్న వారికి ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలింది. దింతో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

three children died with current shock in prakasam district

కోదండరామస్వామి వారి ఆలయ ప్రధాన కూడలిలో చోటు చేసుకున్న ఈ ఘటనతో మూడు కుటుంబాలు కన్నీటి పర్యంతం అవుతున్నాయి. చిన్నారులు ముగ్గురూ ఆడుకుంటూ కూడలిలో ఉన్న వైసీపీ జెండా రాడ్‌ను పట్టుకుని మృతి చెందటంతో రాడ్ పై భాగంలో విద్యుత్ తీగలు పడ్డాయని స్థానికులు గుర్తించారు.. ముగ్గురు విద్యార్థులు షేక్ పఠాన్‌ గౌస్, షేక్‌ హసన్‌ బుడే, పఠాన్‌ అమర్‌ అక్కడికక్కడే చనిపోయారు. ముగ్గురి శరీరాలు మాడి మసైపోయాయి. చనిపోయిన ముగ్గురు విద్యార్థులు ఐదవ తరగతి చదువుతున్న 11 ఏళ్ల వయసున్న వారని తెలుస్తుంది . నమాజుకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో వైసీపీ జెండా రాడ్డును ముగ్గురు విద్యార్థులు పట్టుకొని అడుకుంటుండగా..ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు, కుటుంబసభ్యులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న విద్యుత్ అధికారులు గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని సంఘటనా స్థలంలో దర్యాప్తు చేస్తున్నారు. మరి అధికార వైసీపీ ఈ ఘటనపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి .

English summary
Tragedy struck in Prakasam district. The day before Independence Day, three little boys were died due to electric shock . The tragic incident that took place in the village of Koppara in Santamagulur Mandal, because of the flag of the YSR Congress party in the village.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X