వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆదుకోండి: ఆ జబ్బుతో ఒక కొడుకు మృతి.. రెండో బిడ్డకు కూడా అదే జబ్బు..లక్షల్లో వైద్యం

Google Oneindia TeluguNews

ఏప్రిల్ 1వ తేదీ 2017లో చెడియాక్ హిగాషి సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధితో తన ఏడేళ్ల కొడుకు అమన్‌ను కోల్పోయినట్లు చెప్పి కన్నీటి పర్యంతమయ్యారు ఆ తల్లిదండ్రులు. ఈ వ్యాధి సోకిన వారికి చర్మం, కళ్లలో పిగ్మెంట్స్ తగ్గిపోతుంది. దీంతో శరీరంలో ఇన్‌ఫెక్షన్ ముదిరిపోతుంది. అమన్ చనిపోక నెలకు ముందు ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. అయితే ఈలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని చెప్పారు అమన్ తల్లిదండ్రులు. కళ్లముందే కన్నకొడుకు మృతి చెందడం జీర్ణించుకోలేని విషయమని ఆ తల్లి కన్నీరుమున్నీరు అయ్యింది. చిన్నారి అమన్ మృతితో తమ జీవితంలో ఎంతో కోల్పోయామని చెప్పిన తల్లిదండ్రులు తన చిన్న కొడుకు అనాస్ మీద ఆశతోనే జీవిస్తున్నామని చెప్పారు.

ఇంకా చిన్నారి అమన్ మృతి నుంచి కోలుకోకముందే ఆ కుటంబాన్ని అదే చెడియాక్ హిగాషీ సిండ్రోమ్‌ లక్షణాలు చిన్న కొడుకు అనాస్‌లో కనిపించాయి. ఇక ఆ తల్లిదండ్రుల ఆవేదన వర్ణణాతీతం. తమ బిడ్డలను భగవంతుడు ఎందుకు కోరుకుంటున్నాడో తెలియదని చెబుతూ కన్నీటిపర్యంతం అయ్యింది అనాస్ తల్లి. అయితే మందులు తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇవ్వగలవని డాక్టర్ చెప్పారు. ఇక శాశ్వత పరిష్కారం మాత్రం సర్జరీ చేసి స్టెమ్ సెల్‌ను రీప్లేస్ చేయాలని డాక్టర్లు చెప్పారు. అయితే ఈ సర్జరీకి అయ్యే ఖర్చు రూ. 22 లక్షల 50వేలు అని డాక్టర్లు చెప్పడంతో ఆ తల్లిదండ్రులకు గుండె పగలినంత పనైంది. ఒక కొడుకును కళ్లముందే పోగొట్టుకున్నారు.. రెండో బిడ్డకు కూడా అలా జరగకూడదని ఎలాగైనా బతికించుకోవాలని తాపత్రయపడుతున్నారు. అయితే వారిదగ్గర అంత డబ్బులు లేకపోవడంతో ప్రస్తుతానికి మెడిసిన్స్‌తోనే కాలం వెల్లదీస్తున్నారు.

గత రెండేళ్లుగా ఆపరేషన్‌కు కావాల్సిన మొత్తం కోసం చాలా ప్రయత్నించినప్పటికీ అంత డబ్బు జమకావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.తన భర్త హబీబ్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడని అతని జీతం అంతంత మాత్రమే అని తల్లి చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. అతని సంపాదనతో పూట మాత్రమే గడుస్తోందని చెప్పి ఆవేదన చెందింది అనాస్ తల్లి. ఇక మరోవైపు రోజులు గడుస్తున్న కొద్దీ అనాస్ ఆరోగ్యం క్షీణిస్తోంది. చర్మం నలుపు రంగులోకి మారుతోందని కళ్లు తేలిపోతున్నాయని చెప్పింది. అంతర్గతంగా కూడా రక్తమోడుతోందని చెప్పింది. చిన్నారి ఏడ్చినప్పుడల్లా తన గుండె పగిలిపోయేంత పని అవుతోందని అనాస్ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. చిన్నారిని సముదాయించేందుకు ఏమి చేసినా తనవల్ల కావడం లేదని ఆ తల్లి బాధను వ్యక్తం చేసింది.

ఇక మెడిసెన్లతో బాబు ప్రాణాలు కాపాడటం కష్టమని డాక్టర్లు తేల్చి చెప్పారు. కేవలం సర్జరీతోనే బిడ్డ ప్రాణాలు దక్కుతాయని వెల్లడించారు. తమ దగ్గర ఆపరేషన్‌కు అంత డబ్బులు లేవని కేవలం దాతలు పెద్దమనస్సు చేసుకుని తమకు తోచినంత విరాళంగా ఇస్తేనే తప్ప బిడ్డ ప్రాణాలు దక్కవని చెబుతున్నారు. దాతలు ఇచ్చే ఆ కొద్దిపాటి విరాళాలే తన బిడ్డను బతికిస్తాయన్న ఆశతో ఆ తల్లిదండ్రులు ఉన్నారు.

చిన్నారి అనాస్‌కు ఉన్న జబ్బును మెడికల్ టీమ్ నిర్థారించింది. చికిత్సకు సంబంధించి మరిన్ని వివరాలు కోసం అంటే చికిత్సకు అయ్యే పూర్తి ఖర్చు వివరాలు తెలుసుకోవాలంటే క్యాంపెయిన్ ఆర్గనైజర్‌ లేదా మెడికల్ టీమ్‌ను సంప్రదించగలరు.
ఛారిటీ నెంబర్: 73819203

విరాళాలు ఇవ్వాలనుకునేవారు నేరుగా బ్యాంకు ఖాతాలోకి డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. బ్యాంకు ఖాతా వివరాలు

ఖాతా నెంబరు: 6999413500129703
ఖాతాదారుడి పేరు : రిజ్వానా-కెట్టో
ఖాతా టైపు: కరెంట్
ఐఎఫ్‌ఎస్‌సీ కోడో: YESB0CMSNOC

ఇక విరాళాలు పంపించాలనుకునేవారు పేటీఎం లేదా ఫోన్‌పే, లేదా గూగుల్‌ పే, వాట్సాప్‌ద్వారా కూడా చేయొచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X