వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆదుకుందాం: కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ప్రేమ్..తన కొడుకును ఆదుకోవాలని అర్థిస్తున్న తల్లి

Google Oneindia TeluguNews

ఇదిగో కింద ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి పేరు ప్రేమ్. 15 ఏళ్ల వయస్సు. ప్రేమ్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుచున్నాడు. తన కిడ్నీ తీవ్రంగా దెబ్బతినింది. వెంటనే శస్త్రచికిత్స చేసి ప్రేమ్‌‌కు కిడ్నీ మార్పిడి చేయాల్సిన అవసరం ఉంది. వెంటనే సర్జరీ చేయకుంటే అతని ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు తెలిపారు. కొన్నేళ్ల క్రితం ప్రేమ్ తండ్రి కామేష్‌ కూడా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడ్డాడు. మంచానికే పరిమితం అయ్యాడు. తన పనులను తాను చేసుకోలేకపోయాడు. కామేష్ ఇంటికే పరిమితం కావడంతో వారి జీవనోపాధి నిలిచిపోయింది.

ఇక ఇళ్లు గడవడం కోసం కామేష్ భార్య, ప్రేమ్ తల్లి చరకల్ పనికి వెళ్లడం ప్రారంభించింది. హౌజ్ కీపింగ్ ఉద్యోగంలో చేరింది. నెలకు రూ. 4వేలు జీతం వచ్చేది. దాంతోనే నెలమొత్తం జరిపేది. ఈ కష్టాలన్నీ చూస్తూ ప్రేమ్ పెరిగాడు. కనీస అవసరాలు కూడా తీర్చుకోలేనంత కష్టం ఆ కుటుంబానికి సంభవించింది. బాగా చదువకుని ప్రయోజకుడై మంచి ఉద్యోగంలో స్థిరపడాలని కలలు కన్నాడు. తను ఉద్యోగం చేసి వచ్చిన డబ్బుతో ఒక ఇల్లు కొనిస్తానని ప్రేమ్ చెప్పేవాడని తలచుకుంటూ చరకల్ కన్నీరుమున్నీరైంది. ప్రేమ్ ఒకలా తలిస్తే విధి మరోలా తలిచిందని ప్రేమ్ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.

Poor mother is struggling alone to save teenage son from deadly kidney disease

ఏప్రిల్ 2008లో ప్రేమ్‌కు కిడ్నీ సంబంధిత వ్యాధి ఉన్నట్లు బయటపడింది. మందులు చికిత్స అందిస్తున్నప్పటికీ తన ఆరోగ్యం మాత్రం మెరుగుపడటం లేదు. ఇప్పుడు పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. మంచానికే పరిమితమయ్యాడు. తనకు రక్తపోటు కూడా ఎక్కువైంది. అంతేకాదు కాళ్లల్లో కీళ్లల్లో తట్టుకోలేని నొప్పితో బాధపడుతున్నాడు. ప్రేమ్ చాలా నొప్పితో బాధపడుతున్నాడని బతుకుపై ఆశ వదిలేసుకున్నాడని తల్లి చరకల్ చెబుతూ కన్నీటి పర్యంతమైంది. ప్రేమ్‌ నవ్వడం చూసి కొన్ని నెలలు అయ్యిందని చెప్పుకొచ్చింది తల్లి చరకల్. తన ఎదురుగా కూడా ప్రేమ్ ఏడవడని.. తల్లి దండ్రులను బాధపడుతారన్న విషయం వాడికి తెలుసని తల్లి చరకల్ చెబుతోంది.

Poor mother is struggling alone to save teenage son from deadly kidney disease

కిడ్నీ మార్పిడి వెంటనే చేయకుంటే ప్రేమ్ ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు చెప్పారు. కొన్ని పరీక్షలు చేయగా తల్లి చరకల కిడ్నీ ప్రేమ్‌కు సరిపోతుందని వెల్లడైంది. మరోవైపు సర్జరీకి కావాల్సిన రూ.10 లక్షలు సమకూర్చడం ఆ పేద తల్లివల్ల కావడం లేదు. తనకు తెలిసిన ప్రతి ఒక్కరిని డబ్బుల కోసం అడిగానని అయితే అంత పెద్ద మొత్తంలో ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె వద్ద చిల్లి గవ్వలేదని పోనీ ఏదైనా అమ్ముదామంటే అది కూడా లేదని భోరున విలపించింది. తన భర్త కూడా అనారోగ్యంతో ఉన్నాడని ఇక కొడుకుపై ఆశలు వదిలేసుకుందామని చెబుతూఉంటాడని చరకల్ చెప్పింది. అయితే కొడుకు ప్రాణాలు తమ చేతిలో లేవని, ఏం చేయాలో అర్థం కావడం లేదని విలపిస్తూ ఎలాగైనా సహాయం చేసి తన కొడుకుకు తిరిగి ప్రాణం పోయాలని దాతలను అర్థిస్తోంది.

ఎలా సహాయపడగలరు..?

తన కుటుంబాన్ని చరకల మాత్రమే పోషిస్తోంది. అయితే తన కొడుకు ప్రాణాలను కాపాడేందుకు ఆమె దగ్గర ఏమీ లేదు. అయితే మంచి మనస్సుతో మీరు ఇచ్చే విరాళాలు ప్రేమ్ ప్రాణాలను నిలపగలవు. మంచి మనసు చేసుకుని మీకు తోచినంతగా విరాళాలు పంపండి. ప్రేమ్ వ్యాధికి సంబంధించి హాస్పిటల్ వైద్య బృంధం ధృవీకరించింది. చికిత్స కోసం లేదా ఖర్చుల వివరాల కోసం మెడికల్ బృందంలోని క్యాంపెయిన్ ఆర్గనైజర్‌ను సంప్రదించండి.

Poor mother is struggling alone to save teenage son from deadly kidney disease

చారిటీ నెంబర్: 89541849
నోట్: ఈ విరాళాలు 80(జీ) పన్ను మినహాయింపు కిందకు రాదు.

విరాళాలు పంపేందుకు ఇతర మార్గాలు:
నేరుగా బ్యాంకు ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ చేయగలరు:
బ్యాంక్ అకౌంట్ నెంబర్ : 6999413500135521
బ్యాంకు ఖాతాదారుడి పేరు: Charakala-Ketto
ఖాతా టైపు: కరెంట్
ఐఎఫ్ఎస్‌సీ :YESB0CMSNOC

అంతేకాదు పేటీఎం లేదా యూపీఐ ద్వారా కూడా విరాళాలు పంపొచ్చు.

కెట్టో ఆర్గ్ అనేది భారతదేశంలో ఆన్‌లైన్ ద్వారా విరాళాలు సేకరించే వేదిక. క్యాన్సర్ చికిత్స, లుకేమియా చికిత్స, గుండె చికిత్సతో పాటు ఇతర చికిత్సలకు ఒక వ్యక్తికి కావాల్సిన డబ్బులు విరాళాల ద్వారా సేకరించేందుకు కెట్టో సహాయం చేస్తుంది

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X