పులివెందుల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జ‌గ‌న్ పై పోటీకి సై : పులివెందుల బ‌రిలో ఆయ‌నే..!

|
Google Oneindia TeluguNews

క‌డ‌ప జిల్లాలో జ‌గ‌న్ కు చెక్ పెట్టాల‌నే లక్ష్యం నెర‌వేరుతుందా. క‌డ‌ప జిల్లాలో జ‌గ‌న్ కు గ‌త ఎన్నిక‌ల్లో రాజంపేట మిన హా మిగిలిన అన్ని సీట్లు ద‌క్కాయి. ఈ సారి సీన్ రివ‌ర్స్ చేయాల‌ని టిడిపి అధినేత ప‌ట్టుద‌ల తో ఉన్నారు. ఇందుకోసం ఇప్ప‌టికే జిల్లాలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల అభ్య‌ర్ధుల ఖ‌రారు ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేసారు. అందులో భాగంగా.. జ‌గ‌న్ పై పులివెందులలో పోటీ చేసే అభ్య‌ర్ది ఎవ‌రో తేల్చేసారు.. నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం చేసుకోవాల‌ని పార్టీ- ప్ర‌భు త్వ ప‌రంగా స‌హాయ - స‌హ‌కారాలు అందిస్తామ‌ని హామీ ఇచ్చారు..

మూడు సార్లు తండ్రి పై ... రెండో సారి త‌న‌యుడి పై..

మూడు సార్లు తండ్రి పై ... రెండో సారి త‌న‌యుడి పై..

టిడిపి అభ్య‌ర్ధిగా ప్ర‌స్తుతం అధిష్ఠానం ఖ‌రారు చేసిన సింగిరెడ్డి స‌తీష్ కుమార్ రెడ్డి గ‌తంలో మూడు సార్లు వైయ‌స్ రాజ శేఖ‌ర రెడ్డి పై పోటీ చేసారు. 1999, 2004, 2009 ఎన్నిక‌ల్లో టిడిపి అభ్య‌ర్ధిగా వైయ‌స్ పై పోటీ చేసి ఓడిపోయారు. క‌డ‌ప జిల్లాలో ఉన్న ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల్లో వైయ‌స్ కుటుంబ వ‌ర్సెస్ స‌తీష్ రెడ్డిగా కొంత కాలం పోరు సాగింది. వైయ‌స్ తండ్రి రాజారెడ్డి హ‌త్య కేసులో ఆయనే సూత్ర‌ధారి అని వైయ‌స్ కుటుంబం ఆరోపించింది.

 పులి వెందుల‌లో ఎలాగైనా గెల‌వాల‌ని టిడిపి

పులి వెందుల‌లో ఎలాగైనా గెల‌వాల‌ని టిడిపి

ఇది ఇలా ఉంటే..వైయ‌స్ కుటుంబానికి కంచుకోట‌గా ఉన్న క‌డ‌ప జిల్లా అందులోనూ పులి వెందుల‌లో ఎలాగైనా గెల‌వాల‌ని టిడిపి తో పాటుగా స‌తీష రెడ్డి ప‌ట్టుద‌ల‌. మూడు సార్లు వైయ‌స్ పై పోడాది ఓడిన స‌తీష్ రెడ్డి.. 2014 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ పై పోటీ చేసి ఓట‌మి చ‌వి చూసారు. అప్ప‌టికే ఆయ‌న టిడిపి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ తరువాత ఆయ‌న‌కు మండ‌లి డిప్యూటీ ఛైర్మ‌న్ ప‌దవి ని క‌ట్ట‌బెట్టారు. ఆ ప‌ద‌వీ కాలం ముగిసిన త‌రువాత ప్ర‌స్తుతం ఆయ‌నకు జిల్లాలో పార్టీ బాధ్య‌త‌ల‌తో పాటుగా.. పులివెందుల అభ్య‌ర్ధిగా ఖ‌రారు చేసిన‌ట్లు స‌మాచారం అందించారు.

<strong>ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్: కాంగ్రెస్ దోస్తీ బాబుకు దెబ్బ, లోకసభ ఎన్నికల్లో జగన్‌దే హవా! </strong>ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్: కాంగ్రెస్ దోస్తీ బాబుకు దెబ్బ, లోకసభ ఎన్నికల్లో జగన్‌దే హవా!

ముందుగానే ప్ర‌క‌ట‌న‌.. ప‌ట్టు కోసం స‌హ‌కారం..

ముందుగానే ప్ర‌క‌ట‌న‌.. ప‌ట్టు కోసం స‌హ‌కారం..

ప్ర‌స్తుత ప్ర‌తిప‌క్ష నేత‌..వైసిపి ముఖ్య‌మంత్రి అభ్య‌ర్ధి జ‌గ‌న్ ను జిల్లాలో ఎలాగైనా దెబ్బ తీయాల‌ని టిడిపి అధినేత ఈ సారి ప‌ట్టుద‌ల తో క‌నిపిస్తున్నారు. 2014 ఎన్నిక‌ల్లో జిల్లాలో కేవ‌లం రాజంపేట మాత్రమే టిడిపికి ద‌క్కింది. ఆ త‌రువాత వైసిపి నుండి గెలిచిన ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌ను టిడిపి లోకి ఫిరాయించేలా ప్రోత్స‌హించారు. ఆ త‌రువాత అందులో ఒక‌రై న ఆదినారాయ‌ణ రెడ్డికి మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. ఇక‌, ఇప్పుడు జిల్లాలో అభ్య‌ర్ధుల ఖ‌రారు త్వ‌రిత గ‌తిన పూర్తి చేసి క‌డ‌ప లో ప‌ట్టు సాధించాల‌ని టిడిపి ప్ర‌య‌త్నిస్తోంది. ఇందులో భాగంగా.. పులివెందుల కు నీరు ఇస్తేగానీ త‌న గ‌డ్డం తీయ‌న‌ని ప్ర‌క‌టించి.. నీరు ఇచ్చిన త‌రువాత త‌న శ‌ప‌ధం నెరవేర్చ‌కున్న స‌తీష్ రెడ్డినే ఈ సారి కూడా టిడిపి అభ్య‌ర్ది గా బ‌రిలోకి దించాల‌ని టిడిపి అధినేత నిర్ణ‌యించారు. 20 ఏళ్లుగా పులివెందుల‌లో టిడిపి అభ్య‌ర్ధిగా పోటీ చేస్తున్న స‌తీష్ రెడ్డి ఈ సారి బ‌లం చాటుకుంటార‌ని టిడిపి నేత‌లు చెబుతున్నారు. ముఖ్య‌మంత్రి సైతం ఈ నియోజ‌క‌వ‌ర్గం లో పార్టీ వ్య‌వ‌హారాల పై ప్ర‌త్యేక దృష్టి సారించారు. మ‌రి..వైయ‌స్ కుటుంబానికి కంచు కోట‌గా ఉన్న పులివెందుల‌లో టిడిపి క‌ల‌లు ఎంత వ‌ర‌కు నెర‌వేరుతాయో చూడాలి.

English summary
TDP decided candidate in Pulivendula. Satish reddy will be the candidate for TDP on Jagan. Since 20 years he was the candidate for TDP in Pulivendula. He contested on late YSR for three times...and last election on Jagan, In 2014 elections Jagan defeated Satish Reddy by a margin of 75,243 votes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X