రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజమండ్రి సెంట్రల్ జైలులో కరోనా కల్లోలం: 200 మందికి వైరస్..? ములాఖత్ బంద్

|
Google Oneindia TeluguNews

ఇక్కడ అక్కడ అనీ కాదు అన్నీ చోట్ల కరోనా విజృంభిస్తోంది. చివరికీ జైలులో కూడా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. రాజమండ్రి సెంట్రల్ జైలులో 200 మంది వరకు పాజిటివ్ వచ్చిందని తెలుస్తోంది. కానీ దీనిని అధికారులు ధృవీకరించాల్సి ఉంది. వాస్తవానికి 900 మందికి కరోనా పరీక్షలు చేయగా.. కొందరీ రిపోర్టు రావాల్సి ఉంది. జైలులో ఇప్పటికీ 29 మంది ఖైదీలు, 24 మంది సిబ్బందికి పాజిటివ్ కేసులు ఉండగా.. కొత్తగా మరో 10 మంది ఖైదీలకు వైరస్ సోకింది. దీంతో మొత్తం సంఖ్య 63కి చేరింది.

900 మంది ఖైదీలకు కరోనా పరీక్షలను నిర్వహించగా.. వీరి ఫలితాలు రావాల్సి ఉంది. గురువారం సాయంత్రం వరకు రిపోర్టులు రావచ్చని అధికారులు చెబుతున్నారు. జైలులో మొత్తం 1670 ఖైదీలు, 200 మంది సిబ్బంది ఉండగా.. పాజిటివ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పాజిటివ్ వచ్చిన ఖైదీలకు కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

200 people may be infected coronavirus in rajahmundry central jail

Recommended Video

Donald Trump : Facebook Twitter Removed Donald Trump's Post Over False Claim || Oneindia Telugu

వైరస్ వచ్చిన సిబ్బందిలో కొందరు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటుండగా.. మరికొందరు హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. రాజమండ్రి జైలులో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ములాఖత్‌ను అధికారులు నిలిపివేశారు. కానీ వైరస్ కేసుల సంఖ్య మాత్రం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

English summary
200 people may be infected coronavirus in rajahmundry central jail. officials not confirm the virus cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X