రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కచ్చులూరు ప్రమాద కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా విడుదల చేసిన ఏపీ

|
Google Oneindia TeluguNews

కచ్చులూరు బోటు ప్రమాదంలో మృతుల కుటుంభాలకు ఏపీ ప్రభుత్వం ఎక్సిగ్రేషియా విడుదల చేసింది. మృతుల కుటుంబాలకు ఒక్కోక్కరికి 10 లక్షల రుపాయాల చొప్పున మొత్తం 12 మందికి ఒక కోటి ఇరవైలక్షల రుపాయలను ఎక్స్‌గ్రేషియాను సీఎం సహాయనిధి నుండి విడుదల చేశారు.

ఎక్స్‌గ్రేషియా చెల్లించినవారిలో వరంగల్ జిల్లా కడిపికొండకు చెందిన తొమ్మిది ఉండగా జనగాం, ఖమ్మం, నల్గోండ జిల్లాకు చెందిన వారు ముగ్గురు ఉన్నారు. వీరందరికి 10 లక్షల చొప్పున ఏపీ ప్రభుత్వం విడుదల చేసి ఆ మొత్తం తెలంగాణ ప్రభుత్వం అకౌంట్‌లో జమ చేసి వారి ద్వార భాదిత కుటుంబాలకు అందించనుంది. కాగా మృతుల కుటుంబాలకు పదిలక్షల సహాయంతోపాటు అదనంగా జీవితాబీమా ద్వార మరో పదిలక్షల రూపాలయను బాధిత కుటుంబాలకు అందించనున్నారు. ఇక ప్రమాదం నుండి బయటపడిన వారికి కూడ లక్ష రుపాయల ఆర్ధిక సహాయాన్ని ప్రకటించింది.

AP has released the ex gratia for the families Kachchaloor boat victim

కచ్చులూరు ప్రమాదంలో తెలంగాణకు చెందినవారే ఎక్కువ మంది ఉన్న విషయం తెలిసిందే... ఇందులో హైదరాబాద్‌కు చెందిన వారు 22 మంది కాగా, వరంగల్‌కు చెందిన వారు 14 మంది. దీంతో ఏపీ ప్రభుత్వం ప్రకటించిన సహాయానికి అదనంగా తెలంగాణ కూడ ప్రభుత్వం కూడ ఐదు లక్షల ఆర్ధిక సాయం ప్రకటించింది. వీరి కుటుంబాలకు అండగా ఉంటామని సీఎం కేసీఆర్‌ అప్పట్లో ప్రకటించారు.

సెప్టెంబర్ 15న జరిగిన బోటు ప్రమాద సమయంలో 8 మంది సిబ్బందితో పాటు ముగ్గురు పిల్లలు సహా మొత్తం 77 మంది ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. వీరిలో 26 మంది ప్రాణాలతో బయటపడగా 51 మంది మృతి చెందారు.

English summary
AP Government has released the ex gratia for the families of the Kachchaloor boat accident. 10 lakh each released.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X