రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యేకు షాక్: హైకోర్టు నోటీసులు, ఎందుకంటే..?

|
Google Oneindia TeluguNews

అమరావతి: తూర్పుగోదావరి జిల్లా రాజోలు ఎమ్మెల్యే, జనసేన పార్టీ నేత రాపాక వరప్రసాదరావుకు హైకోర్టు షాకిచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేశారని, బ్యాలెట్ ఓట్లలో రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ.. రాజోలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ బొంతు రాజేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

స్టిక్కర్ సీఎం: చంద్రబాబుతో పోలుస్తూ జగన్‌పై పవన్ కళ్యాణ్ నిప్పులుస్టిక్కర్ సీఎం: చంద్రబాబుతో పోలుస్తూ జగన్‌పై పవన్ కళ్యాణ్ నిప్పులు

దొంగ ఓట్లు, రిగ్గింగ్ ఆరోపణలు

దొంగ ఓట్లు, రిగ్గింగ్ ఆరోపణలు

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుతోపాటు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యే రాపాకపై వస్తున్న దొంగ ఓట్లు, రిగ్గింగ్ ఆరోపణలపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారిని హైకోర్టు ఆదేశించింది.

ఆ నాడు వైఎస్..

ఆ నాడు వైఎస్..

ఈ పిటిషన్‌పై విచారణను హైకోర్టు మరో మూడు వారాలకు వాయిదా వేసింది. కాగా, గతంలో రాపాక వరప్రసాదరావు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా కొనసాగారు. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజోలు నుంచి టికెట్ కూడా ఆయనకు కేటాయించారు. దీంతో రాపాక ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు.

జనసేనలో ఏకైక ఎమ్మెల్యేగా..

జనసేనలో ఏకైక ఎమ్మెల్యేగా..


2014 ఎన్నికల తర్వాత రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్న రాపాక వరప్రసాద రావు.. 2019 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీలో చేరారు. దీంతో రాజోలు నుంచి ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు పవన్ కళ్యాణ్. ఆయన రాజోలు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాకే కావడం గమనార్హం.

ఏపీ సీఎంపై పవన్ కళ్యాణ్ ఫైర్

ఏపీ సీఎంపై పవన్ కళ్యాణ్ ఫైర్


ఇది ఇలావుండగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసిన నిర్లక్ష్యం, అలసత్వాన్ని మీరు కొనసాగిస్తున్నారంటూ మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా సీఎం జగన్మోహన్ రెడ్డి 100 రోజులపాలనపై విమర్శలు ఎక్కుపెట్టారు జనసేనాని. గతంలో చంద్రబాబు నాయుడు చేసిన పొరపాట్లనే సీఎం జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారని, ఎలాంటి తేడాలేదని మండిపడ్డారు. ఈ వందరోజులప పాలనలో ప్రభుత్వ వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు. ఇక మిగిలింది రైతుకు రంగులు వేయడం, మద్యం షాపులకు రంగులెయ్యడం మాత్రమే అంటూ జగన్ సర్కారుపై సెటైర్లు వేశారు జనసేనాని.

English summary
Andhra Pradesh High Court issues notice to Janasena MLA Rapaka Varaprasad rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X