రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజమహేంద్రవరంలో భారీ జాతీయ జెండా.. 5200 మీటర్ల పొడవు

|
Google Oneindia TeluguNews

75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో యావత్ దేశం నిమగ్నమైంది. ఇప్పటికే అంతా తమ స్టేటస్‌ను జాతీయ జెండా పెట్టుకున్నారు. ఇక పలువురు కూడా తమ దేశభక్తిని చాటుకుంటున్నారు. ఆజాదీ అమృత్ మహోత్సవాలలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఘనంగా భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు.

స్వతంత్ర దినోత్సవం సందర్భంగా 5,200 మీటర్ల పొడవైన భారీ జాతీయ జెండా ర్యాలీ, ప్రదర్శనలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా 75 స్వాతంత్ర్య దినోత్సవాలలో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని వేడుకగా జరుపుకోవాలని నేతలు కోరారు. వచ్చే రెండు రోజులు ప్రతి ఇంటిపై దుకాణంపై, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలపై జాతీయ జెండా రెప రెప లాడాలని ప్రజలను నేతలు కోరారు.

big flag shown at rajamahendra varam

జనం, పాఠశాల విద్యార్ధినీ విద్యార్ధులు జాతీయ పతాకం ప్రదర్శనలో పాల్గొన్నారు. దేశ గౌరవాన్ని ప్రతి పౌరులు చాటాలని జిల్లా ఇంఛార్జి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర హోం మంత్రి డాక్టర్ తానేటి వనిత కోరారు. తర్వాత భారీ జాతీయ జెండా ప్రదర్శన ర్యాలీలో సీహెచ్ శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ, తానేటి వనిత, ఎంపీ మార్గని భరత్ రామ్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తదితరులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

బ్రిటిష్ బానిస సంకెళ్ల నుంచి 75 ఏళ్ల క్రితం దేశానికి స్వాతంత్ర్యం లభించిన సంగతి తెలిసిందే. ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల పోరాట ఫలితంగా దేశానికి ఆజాదీ లభించింది. ఏటా ఆగస్ట్ 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీని పురష్కరించుకొని జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే వేడుకలు కూడా నిర్వహించుకుంటున్నాం. దేశంలో ఈ రెండు పండుగలు అంతా వేడుకగా జరుపుకుంటా

English summary
big flag shown at rajamahendra varam. ministers and mla and mp are participated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X