రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బోటు ప్రమాదం : బోటు యజమానితో సహ ముగ్గురి అరెస్ట్ , బోటులో మొత్తం 67 మంది : జిల్లా ఎస్పీ

|
Google Oneindia TeluguNews

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు పడవ ప్రమాదానికి అసలు కారణాన్ని తూర్పు గోదావరి జిల్లా పోలీసు అధికారులు తెలిపారు. బోటును నడిపే డ్రైవర్‌కు సరైన అనుభవం లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. డ్రైవర్‌కు అనుభవం లేకపోవడంతోనే నది అంచుల నుండి వెళ్లాల్సిన బోటును నది మధ్యలో నుండి తీసుకువెళ్లారని ఎస్పీ తెలిపారు. దీంతో ప్రమాదం జరిగేందుకు అవకాశం ఏర్పడిందని అన్నారు.

బోటు యజమాని వెంకటరమణ అరెస్ట్

బోటు యజమాని వెంకటరమణ అరెస్ట్

ఇక ప్రమాదానికి సంబంధించి ముగ్గురు బాధ్యులను అరెస్ట్ చేశామని ఆయన తెలిపారు. వీరిలో బోటు యజమాని కోడిగుట్ల వెంటకరమణతో పాటు ఎల్లా ప్రభావతి, ఆచ్యుతమణిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. బోటు యజమానుల్లో ప్రధానంగా ఏ-1గా ఉన్న కోడిగుడ్ల వెంకటరమణతో పాటు ఏ-2 ప్రభావతి, ఏ-3 అచ్యుతమణిని అరెస్ట్ చేశామని జిల్లా ఎఎస్పీ వకుళ్ జిందాల్ వెల్లడించారు.

64 మంది పెద్దలు 3గ్గురు పిల్లలు

64 మంది పెద్దలు 3గ్గురు పిల్లలు

ఇక బోటులో ఎంతమంది ప్రయాణించారనే దానిపై ఎస్పీ స్పష్టత ఇచ్చారు. ప్రమాద సమయంలో బోటులో మొత్తం 64 మంది పెద్దలు ప్రయాణించగా ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారని ఎస్పీ తెలిపారు. బోటు ప్రయాణ సమయంలో అందరు లైఫ్ జాకెట్లు వేసుకున్నారని చెప్పారు. బోటు కదిలిన తర్వాత లైఫ్ జాకెట్లు తీసివేసి ఉండవచ్చని చెప్పారు. అయితే బోటు ప్రమాదంలో మొత్తం 93 మంది మంది ఉన్నారని మాజీ ఎంపీ హర్షకుమార్ ప్రకటించారు. పోలీసుల ఆదేశాలతోనే బోటు నదిలోకి వెళ్లిందని కూడ ఆయన ఆరోపించారు. పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ జిల్లా ఎస్పీకి ఫోన్ చేశారని దాంతో బోటుకు పోలీసులు అనుమతి ఇచ్చారని ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయితే హర్షకుమార్ ఆరోపణలను జీల్లా ఎస్పీ కొట్టిపారేశారు. తనకు మంత్రి ఫోన్ చేయలేదని ప్రకటించారు.

బోటులో 73 మంది ఉన్నారన్న పోలీసులు

బోటులో 73 మంది ఉన్నారన్న పోలీసులు

ప్రమాద సమయంలో బోటులో 8 మంది సిబ్బంది సహా మొత్తం 75 మంది ఉన్నారని పోలీసులు చెప్పారు. వీరిలో 26 మంది ప్రాణాలతో బయటపడగా.. 34 మృతదేహాలను బయటకు తీశారు. మరో 15 మంది ఆచూకీ తెలియలేదు. బోటులోనే వారి డెడ్‌బాడీలు చిక్కుకొని ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇక గోదావరి నదిలో 210 అడుగుల లోతులో ఉన్న బోటును తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు.

English summary
Boat driver has no proper experience east godavari sp said, the accident was caused by the driver lacking proper experience.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X