రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇక తాడో పేడో: వీధుల్లోకి టిడిపి - బిజెపి: చ‌ంపేందుకే వ‌చ్చారు..!

|
Google Oneindia TeluguNews

ఏపిలో కొత్త త‌ర‌హా పోరాట‌లు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రం పై ఏపి ప్ర‌భుత్వం..టిడిపి పై బిజెపి రాజ‌కీయ పోరాటాల‌కే ప‌రిమితం అయ్యాయి. ఇరు పార్టీల నుండి నేత‌ల వ్యాఖ్య‌లు శృతిమిస్తుండ‌టంతో..ఇప్పుడు నేరుగా బాహా బాహీకి దిగుతున్నారు. ఒక‌రికి వ్య‌తిరేకంగా మ‌రొక‌రు వీధుల్లోకి వ‌స్తున్నారు. దీంతో..ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నా యి. తాజాగా, కాకినాడ - గుంటూరు ల్లో జ‌రిగిన ఘ‌ట‌న‌ల త‌రువాత ప‌రిస్థితి మ‌రింత హీట్ ఎక్కుతోంది..

కాకినాడ‌లో చంద్ర‌బాబును అడ్డుకొని...

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు జ‌న్మ‌భూమి కార్య‌క్ర‌మంలో భాగంగా కాకినాడ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. అక్క‌డ బిజెపి కార్య‌క‌ర్త లు ముఖ్య‌మంత్రి ని డ్డుకొనే ప్ర‌య‌త్నం చేసారు. ఆ స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి..బిజెపి మ‌హిళా కార్య‌కర్త‌ల మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ముఖ్య‌మంత్రి మోదీని ఉద్దేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. త‌న‌ను అడ్డుకోవ‌టానికి వ‌చ్చి న మ‌హిళ‌ల పై సీయం చేసిన వ్యాఖ్య‌లు సైతం వివాదాస్ప‌దం అయ్యాయి. దీని పై బిజెపి నేత‌లు టిడిపి మీద‌.. టిడిపి నేత‌లు బిజెపి మీద తారా స్థాయిలో విమ‌ర్శ‌లు చేసుకున్నారు. వాస్త‌వంగా ఈ నెల 6న ప్ర‌ధాని మోదీ ఏపిలో ప‌ర్య‌టించా ల్సి ఉంది. ఆ ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకోవాల‌ని ముఖ్య‌మంత్రి తో స‌హా..టిడిపి నేత‌లు పిలుపునిచ్చారు. అయితే, ప్ర‌ధాని ఏపి ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింది. దీంతో..బిజెపి ముఖ్య‌మంత్రిని అడ్డుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇది రెండు పార్టీల మ‌ధ్య వివాదానికి కార‌ణ‌మైంది.

సీయం ఏక్ నంబ‌రీ..మంత్రి ద‌స్ నంబ‌రీ : ఏపిలో ప్ర‌భుత్వ పెద్ద‌ల తీరు..! సీయం ఏక్ నంబ‌రీ..మంత్రి ద‌స్ నంబ‌రీ : ఏపిలో ప్ర‌భుత్వ పెద్ద‌ల తీరు..!

గుంటూరు లో క‌న్నా ఇంటి వ‌ద్ద‌..

గుంటూరు లో క‌న్నా ఇంటి వ‌ద్ద‌..


కాకినాడ లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును బిజెపి కార్య‌క‌ర్త‌లు అడ్డుకోవాల‌ని ప్ర‌య‌త్నించ‌టం తో..దీనికి నిరస‌న‌గా టిడిపి శ్రేణులు ఆందోళ‌న చేప‌ట్టారు. గుంటూరు లోని బిజెపి రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా లక్ష్మీ నారాయ‌ణ ఇంటి ఎదుట టిడిపి ధ‌ర్నాకు దిగారు. మోదీ, కన్నాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అటు బీజేపీ కార్యకర్తలు కూడా పోటీగా ఆందో ళనకు దిగారు. కన్నాకు మద్దతుగా నినాదాలు చేసారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒక దశలో టీడీపీ-బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదంతో పాటు తోపులాట జరిగింది. టిడిపి నేత‌లే త‌మై దాడి చేసార‌ని బిజెపి నేత‌లు.. బిజెపి కార్య‌క‌ర్త‌లే త‌మ పై దాడికి పాల్ప‌డ్డార‌ని టిడిపి నేత‌లు ఆరోపిస్తున్నారు. ఇదే అంశం పై ఇటు టిడిపి నేత‌లు.. బిజెపి నేత‌లు సైతం తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇక‌, బిజెపి నేత క‌న్నా ఇంటి పై టిడిపి గూండాలు దాడి చేసార‌ని బిజెపి నేత విష్ణు వ‌ర్ద‌న్ రెడ్డి లాంటి వారు దుయ్య‌బ‌ట్టారు.

చంపేందుకు వ‌చ్చారు..హోం శాఖ‌కు ఫిర్యాదు..


త‌న ఇంటి ముందు ధ‌ర్నాకు వ‌చ్చిన టిడిపి నేత‌ల పై బిజెపి రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ తీవ్ర ఆరోప‌ణ లు చేసారు. ముఖ్య‌మంత్రి..మంత్రి లోకేష్ ఆదేశాల‌తో త‌న‌ను చంపేందుకు టిడిపి కార్య‌క‌ర్త‌లు వ‌చ్చార‌ని క‌న్నా ఆరో పించారు. త‌న మీద హత్యాయత్నంపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. గతంలో అమిత్‌షా, జగన్‌, పవన్‌పై ఇప్పుడు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. గవర్నర్‌ దృష్టిసారించి రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీలో ప్రజాస్వామ్యమే లేదని, వ్యవస్థలన్నింటినీ భ్రష్టుపట్టించారని విమర్శిం చారు. ఇక‌, టిడిపి త‌మ పై విమ‌ర్శ‌లు చేస్తున్న స‌మ‌యంలో తాము తాడో పేడో తేల్చుకోవాల్సిందేన‌నే అభిప్రాయం తో బిజెపి ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. బిజెపి ఏం చేసినా..దానికి ప్ర‌తిగా స్పందించాల్సిందేన‌నే నిర్ణ‌యం తో టిడిపి ముందుకు వెళ్తోంది. దీంతో..అటు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ..ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ క‌లిసి రాజ‌కీయం గా ఏపిలో కొత్త ఉద్రిక్త‌త‌ల‌ను సృష్టిస్తున్నాయి.

English summary
TDP and BJP leaders protesting against each other in AP. BJP cadre protest against Chandra babu in Kakinada. In Guntur TDP Cadre protest at BJP state president Kanna Lakhsmi Narayana's house. It caused to tension situation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X