రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

coronavirus: తండ్రీకొడుకులను విచక్షణారహితంగా చితకబాదాడు, ఎస్ఐపై వేటు పడింది

|
Google Oneindia TeluguNews

పశ్చిమగోదావరి: కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో స్వీయ నిర్బంధంలో ఉండలదేని ఓ తండ్రీ కొడుకులను విచక్షణారహితంగా చితకబాదారు ఓ ఎస్ఐ. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు సదరు ఎస్ఐపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ క్రమంలో స్పందించిన ఏపీ డీజీపీ సవాంగ్ సదరు ఎస్ఐని సస్పెండ్ చేశారు.

విచక్షణా రహితంగా దాడి..

విచక్షణా రహితంగా దాడి..

వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా పెరవలిలో ఓ యువకుడు స్వీయ నిర్బంధం కాలేదని పెరవలి ఎస్ఐ కిరణ్ కుమార్ లాఠీ ఛార్జీ చేశారు. అక్కడేవున్న అతని తండ్రిని కూడా కొట్టాడు. ఆ యువకుడు ఎంత వేడుకున్నా.. వదలకుండా సదరు ఎస్ఐ విచక్షణా రహితంగా చితకబాదాడు. అంతేగాక, మహిళలపై కూడా లాఠీ ఎత్తి బెదిరింపులకు గురిచేశాడు.

తండ్రీకొడుకులను దారుణంగా.. వీడియో వైరల్..

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో సదరు ఎస్ఐ ఉద్దేశపూర్వకంగా సదరు కుటుంబాన్ని వేధించినట్లు ఉందని, ఎస్ఐ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఏపీ సర్కారును కోరారు.

డీజీపీ ఆగ్రహం..

డీజీపీ ఆగ్రహం..

ఈ క్రమంలో డీజీపీ గౌతమ్ సవాంగ స్పందించారు. పెరవలి ఎస్ఐపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారిని ఐసోలేషన్ వార్డుకు తరలించాలి కానీ.. దాడి చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే తీవ్ర చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు.

ఏపీలో 12కు చేరిన కరోనా కేసులు..

ఏపీలో 12కు చేరిన కరోనా కేసులు..


కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదుయ్యాయి. కరోనా అనుమానిత లక్షణాలతో 117 మంది చికిత్స పొందుతున్నారు. విదేశాల నుంచి ఏపీకి 26,590 మంది వచ్చినట్లు, వారిలో 25,942 మందిని హోం ఐసోలేషన్‌లో ఉంచినట్లు ఏపీ సర్కారు తెలిపింది. కాగా, విజయవాడలోని సిద్దార్థ మెడికల్ కాలేజీ, కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేన్నామని తెలిపింది. ఇప్పటికే కరోనా పరీక్షలు చేసేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నుంచి అనుమతి వచ్చిందని వెల్లడించింది.

English summary
coronavirus: peravali si suspended for brutally beating a man and his son.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X