రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నా వ్యాఖ్యలను వక్రీకరించొద్దు..! దాడులు చేస్తే సహించేది లేదన్న పవన్ కళ్యాణ్..!!

|
Google Oneindia TeluguNews

బీమవరం/హైదరాబాద్ : చిన్న అంశాన్ని చిలవలు పలవలుగా చేసి చూడటం టీఆర్ఎస్ నాయకులకు అలవాటయ్యిందని జనసేన అధితనే పవన్ కళ్యాణ్ అభివర్ణించారు. తాను అనని మాటలకు వక్రభాష్యం ఆపాదించి తన ఇంటిమీద, కార్యాలయాల మీద దాడులకు పాల్పడటం ఎంతవరకు సమంజసమని గబ్బర్ సింగ్ ప్రశ్నించారు. అకారణంగా తన ఇంటిమీదకుచ కార్యాలయాలమీదకు దాడులకు ఉపక్రమిస్తే సహించేది లేదని కాటమరాయుడు హెచ్చరికలు జారీ చేసారు. తాను ఎవరి మనోభావాలను కించపరిచే విధంగా మాట్లడలేదని, అంత అవసరం తనకు లేదని వివరణ ఇచ్చారు. శాంతి కాముకులుగా ముద్ర వేసుకున్న గులాబీ నేతలు దుందుడుకు చర్యలకు పాల్పడరని తాను భావిస్తున్నట్టు ఒక వేళ అలా జరిగితే పరిణామాలను ఉన్నత స్థాయిలో తీసుకెళ్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు.

దాడులు చేస్తే ఊరుకునేది లేదు..! టీఆర్ఎస్ నేతలపై స్పందించిన పవన్ కళ్యాణ్..!!

దాడులు చేస్తే ఊరుకునేది లేదు..! టీఆర్ఎస్ నేతలపై స్పందించిన పవన్ కళ్యాణ్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తన ఇల్లు, పార్టీ కార్యాలయం దగ్గర టీఆర్ఎస్ నేతలు ధర్నా చేయడంపై మండిపడ్డారు. నేను తప్పు మాట్లాడి ఉంటే క్షమించమని అడుగుతా.. నా చిన్నబిడ్డలు ఉన్న ఇంటి మీదికి వచ్చి ధర్నాలు, దాడులు చేస్తామంటే చేతులు ముడుచుకు కూర్చోనని ఈ సందర్భంగా ఘాటుగా స్పంధించారు. ఇళ్ల మీదకు వస్తాం, ఆఫీసు మీదకు వస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు పవన్ కళ్యాణ్.

కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్మూ కశ్మీర్..! అత్యంత సాహోసోపేత అడుగులు వేసిన బీజేపి..!! కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్మూ కశ్మీర్..! అత్యంత సాహోసోపేత అడుగులు వేసిన బీజేపి..!!

తన వ్యాఖ్యలనను వక్రీకరించారు..! ఎవరీని కించపరచనన్న గబ్బర్ సింగ్..!!

తన వ్యాఖ్యలనను వక్రీకరించారు..! ఎవరీని కించపరచనన్న గబ్బర్ సింగ్..!!

భీమవరం పర్యటనలో ఉన్న ఆయన.. ఈ వ్యవహారంపై స్పందించారు. తాను రాజమండ్రిలో దిగగానే ఫోన్‌ వచ్చిందని.. తన ఇంటి ముందు ధర్నా చేయడానికి టీఆర్ఎస్ నేతలు వస్తున్నారని చెప్పారన్నారు. ఎందుకు వస్తున్నారని తాను ఆరా తీస్తే, తెలంగాణలో ఎవర్నో కించపరిచేలా తాను మాట్లాడాననని.. అందుకే ఆందోళన చేయడానికి వస్తున్నారని తనకు తెలిసిందన్నారు. వాస్తవానికి తాను మాట్లాడింది వేరు.. వారు చెప్పేది వేరన్నారు జనసేనాని. ఎప్పుడో ఐదు రోజుల క్రితం మాట్లాడితే దాన్ని ఇప్పుడు తెర మీదికి తెచ్చారన్నారు.

మనోభావాలు గౌరవిస్తా..! అన్నిటికి తెగించే రాజకీయాల్లోకి వచ్చానన్న కాటమ రాయుడు..!!

మనోభావాలు గౌరవిస్తా..! అన్నిటికి తెగించే రాజకీయాల్లోకి వచ్చానన్న కాటమ రాయుడు..!!

భీమవరం పర్యటన హైలైట్‌ కాకుండా చేసే ప్రయత్నం ఇది అన్నారు. తాను మాట్లాడిన విషయం జగన్‌ చెప్పిన మద్యపాన నిషేధం అంశానికి సంబంధించింది అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య గారు రాసిన తెలంగాణ సాయుధ పోరాటం పుస్తకంలో చదివిన అంశాన్ని ప్రస్తావించానని చెప్పారు. మద్యపానం అనేది కొన్ని గిరిజన తెగల్లో, కొన్ని రాష్ట్రాల్లో సంస్కృతిలో భాగంగా ఇమిడిపోయిందన్నాను. ప్రజల నుంచి సంస్కృతిని ఎలా వేరు చేయలేం కాబట్టి మద్యపాన నిషేధం కష్టం అవుతుందని చెప్పాలన్నదే తన ఉద్దేశం అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యునిస్టులు సైతం మద్యపాన నిషేధం ఎందుకు చేయలేం అన్నప్పుడు.. అది వారి సంస్కృతిలో ఒక భాగంగా భావించారన్నారు పవన్.

టీఆర్ఎస్ నాయకులు హద్దుల్లో ఉంటే మంచిది..! వాస్తవాలు తెలుసుకోవాలన్న జనసేనాని..!!

టీఆర్ఎస్ నాయకులు హద్దుల్లో ఉంటే మంచిది..! వాస్తవాలు తెలుసుకోవాలన్న జనసేనాని..!!

గిరిజనులు ఇప్ప పువ్వు నుంచి సారా తీస్తారని.. అది వారి సంస్కృతి, వద్దన్నా ఆగరన్నారు. తాను మాట్లాడింది ఒకటైతే దాన్ని వక్తీకరించి.. టీఆర్ఎస్ వ్యక్తులో కార్యకర్తలో తెలియదు.. తన ఇంటి మీద దాడికి ప్రయత్నించారన్నారు. ప్రజాస్వామ్యంలో ఏదైనా మాట్లాడినప్పుడు దాన్ని మీడియా ముఖంగా ఖండించాలన్నారు. అంతేగానీ దాడులకి దిగడం మంచిది కాదని ఇళ్ల మీదకి వస్తాం, ఆఫీసుల మీదకి వస్తామంటే చూస్తూ ఊరుకోను..తాటతీస్తానన్నారు. మీరు భీమవరం వచ్చి రాజకీయాలు చేయొచ్చు.. నేను ఒక అభిప్రాయం చెబితే ఇలాంటి పనులు చేస్తారా? ఈ విషయాన్ని తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌ గారి దృష్టికి, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు గారి దృష్టికి తీసుకువెళ్తున్నట్టు తెలిపారు.

English summary
Pawan Kalyan is the head of the Janasana. TRS leaders were on Dharna near his house and party office. If I talk wrong, ask him to forgive me. When my young children came to the house and the Dharna and the attacks, the hands were not folded. Pawan Kalyan has warned them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X