రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెద్ద‌రికం నిల‌బెట్టుకున్న చిరంజీవి: త‌మ్ముడు విభేదించినా: విషాదంలో ఉన్న నాటి అనుచ‌రుడి కోసం..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

పెద్ద‌రికం నిల‌బెట్టుకున్న చిరంజీవి || Chiranjeevi Consoles YSRCP Leader || Oneindia Telugu

మెగాస్టార్ చిరంజ‌వి త‌న పెద్ద‌రికాన్ని నిల‌బెట్టుకున్నారు. రాజ‌కీయాలు ఎలా ఉన్నా..గ‌తం ఏమైనా..మాన‌వ సంబంధాలే ముఖ్య‌మ‌ని చాటారు. క‌ష్టంలో ఉన్న వారికి ఓదార్పు ఇచ్చి తాను అన్న‌య్య‌ను అని నిరూపించుకున్నారు. రాజ‌కీయాల నుండి రైట‌ర్ అయిన‌ట్లుగా అధికారికంగా ప్ర‌క‌టించ‌క‌పోయినా..చిరంజీవి దాదాపు రాజ‌కీయాల‌కు దూరం అయ్యారు. త‌న రాజ్య‌స‌భ ప‌ద‌వీ కాలం ముగిసిన నాటి నుండి రాజ‌కీయాల గురించి ప్ర‌స్తావించ లేదు.త‌మ్ముళ్లుద్ద‌రూ జ‌న‌సేన‌లో క్రియా శీల‌కంగా ఉన్నా..ఏనాడు ఆ పార్టీ గురించి మాట్లాడ‌లేదు. ఇక‌, తాజాగా చిరంజీవి విషాదంలో ఉన్న నాటి అనుచ‌రుడి కోసం అత‌ని వ‌ద్ద‌కే వెళ్లి ఓదార్పు ఇచ్చారు. ఇప్పుడు ఇది సినీ ఇండ‌స్ట్రీతో పాటుగా పొలిటిక‌ల్ సర్కిల్స్‌లోనూ హాట్ టాపిక్ గా మారింది.

మంత్రి క‌న్న‌బాబుకు చిరంజీవి ఓదార్పు..

మంత్రి క‌న్న‌బాబుకు చిరంజీవి ఓదార్పు..

రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖా మంత్రి క‌న్న‌బాబు సోద‌ర వియోగంతో విషాదంలో మునిగిపోయారు. ఆయ‌న్ను మెగాస్ట‌ర్ చిరంజీవి పరామ‌ర్శించారు. మంత్రి సోదరుడు సురే్‌షబాబు గుండెపోటుతో మృతి చెందడంతో కన్నబాబును పరామర్శించేందుకు హైదరాబాద్‌ నుంచి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం విమానాశ్రయంకు వచ్చిన చిరంజీవి అక్కడ నుంచి కారు లో నేరుగా కాకినాడ వైద్యనగర్‌లోని మంత్రి స్వగృహానికి చేరుకున్నారు. కన్నబాబు, ఆయన తండ్రి సత్యనారాయణ, కుటుంబ సభ్యులను చిరంజీవి ఓదార్చారు. చిరంజీవిని చూడ‌గానే క‌న్న‌బాబు ఒక్క‌సారిగా బోరుమ‌ని విల‌పించారు. ఆయ‌న్ను ఓదార్చ‌టం చిరంజీవికి సాధ్య‌ప‌డ‌లేదు. అదే స‌మ‌యంలో అక్క‌డే ఉన్న క‌న్న‌బాబు తండ్రి స‌త్య‌నారాయ‌ణ సైతం విల‌పించారు. కుటుంబ స‌భ్యులు చిరంజీవిని చూడ‌గానే త‌మ దుఃఖాన్ని ఆపులేక పోయారు. చిరంజీవి కుటుంబ స‌భ్యుల‌తో కాసేపు అక్క‌డే ఉన్నారు. వారిని ఓదార్చే ప్ర‌య‌త్నం చేసారు. ప్ర‌త్యేకంగా క‌న్న‌బాబుతో మాట్లాడి దైర్యం చెప్పారు.

క‌న్న‌బాబుతో మంచి సంబంధాలు..కానీ రాజ‌కీయంగా..

క‌న్న‌బాబుతో మంచి సంబంధాలు..కానీ రాజ‌కీయంగా..

కన్న‌బాబు తొలి నుండి చిరంజీవి అంటే చాలా అభిమానంగా ఉండేవారు. ఆయ‌న వ‌ద్ద ప‌ని చేసారు. క‌న్న‌బాబు సోద రుడు క‌ళ్యాణ్ కృష్ణ సైతం సినీ ప‌రిశ్ర‌మకే చెందిన వారు కావ‌టంతో వారి మ‌ధ్య సంబంధాలు ఇంకా బ‌లంగా ఉండేవి. క‌న్న‌బాబు చిరంజీకి పీఆర్వోగా ఉండేవారు. మంచి వాగ్దాటి..అవగాహ‌న ఉండ‌టంతో ప్ర‌జారాజ్యంలో సైతం క్రియాశీల కంగా వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌జారాజ్యం నుండి కాకినాడ రూర‌ల్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ త‌రువాత చిరంజీవితో క‌లిసి కాంగ్రెస్ లో చేరారు. ఇక‌, రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత క‌న్న‌బాబు స్వ‌తంత్ర అభ్య‌ర్దిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్ప‌టి నుండి చిరంజీవితో అంత‌గా సంబంధాలు లేవు. ఇక‌, రెండేళ్ల క్రితం ఆయ‌న వైసీపీలో చేరారు. కానీ, ఎప్పుడూ క‌న్న‌బాబు చిరంజీవి గురించి ఎక్క‌డా వ్య‌తిరేక కామెంట్లు..విమ‌ర్శ‌లు చేయ‌లేదు. ఇక‌, ఇప్పుడు క‌న్న‌బాబు సోద‌ర వియోగంతో విషాదంలో ఉన్న విస‌యం తెలుసుకొని గ‌తంలో జ‌రిగిన‌వి మ‌ర్చిపోయి త‌న మాజీ అనుచ‌రుడు.. స‌హ‌చ రుడు కోసం చిరంజీవి వ‌చ్చి ప‌రామ‌ర్శిచంటం ద్వారా చ‌ర్చ‌కు కార‌ణ‌మ‌య్యారు.

ప‌వ‌న్ విభేదించారు..అయినా

ప‌వ‌న్ విభేదించారు..అయినా

జ‌న‌సేన పార్టీ స్థాపించిన త‌రువాత స‌భ‌ల్లో ప‌వ‌న్ క‌ళ్యాన్ నేరుగా క‌న్న‌బాబు గురించి ఆరోప‌ణలు చేసారు. న‌మ్మిన వారిని మోసం చేసార‌నే విధంగా టార్గెట్ చేసారు. చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయ‌టంలో క‌న్న‌బాబు పాత్ర కూడా ఉంద‌నేది ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిప్రాయం. అయితే, క‌న్న‌బాబు సైతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న మీద చేసిన విమ‌ర్శ‌ల మీద ఘాటుగానే స్పందించారు. క‌న్న‌బాబు..గంటా శ్రీనివాస రావు ఇద్ద‌రూ ప్ర‌జారాజ్యం నుండి ఎమ్మెల్యేలుగా గెల‌వ‌టం..ఆ త‌రువాత మెగా కుటుంబాన్ని వీడి ఎవ‌రి దారిన వారు రాజ‌కీయంగా చూసుకోవటం..ప‌వ‌న్ ఆగ్రహానికి కార‌ణంగా చెబుతారు. దీంతో..ఆ ఇద్ద‌రి మీద ప‌వ‌న్ అనేక సార్లు ఫైర్ అయ్యారు. ఇవ‌న్నీ ఇలా ఉన్నా. .ఇప్పుడు త‌న సోద‌రుడు ప‌వ‌న్..క‌న్న‌బాబు మీద‌.. అదే విధంగా క‌న్న‌బాబు..ప‌వ‌న్ మీద విమ‌ర్శ‌ల సంగ‌తి ఎలా ఉన్నా .. రాజ‌కీయాల్లో ఏం జ‌రిగినా..క‌ష్టంలో ఉన్న క‌న్న‌బాబు కోసం చిరంజీవి రావ‌టం..ప‌రామ‌ర్శించ‌టం..ధైర్యం చెప్ప‌టం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

English summary
Ex Central Minister Chiranjeevi Console AP Minister Kanna babu in Kakinada. Minister younger brother sudden death by cardiac arrest. Now this matter became discussion in Political and Cinema circles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X