రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీడీపీకి షాక్ ఇచ్చి వైసీపీ తీర్ధం పుచ్చుకున్న కీలక నేత .. జగన్ సమక్షంలో చేరిక

|
Google Oneindia TeluguNews

ఏపీలో వలసల పర్వం మళ్లీ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది . తాజాగా వైఎస్సార్సీపీలోకి ఏపీలో ప్రతిపక్ష పార్టీ నుండి నేతలు వచ్చి చేరుతున్నారు. గత కొంత కాలంగా చేరికలకు కాస్త బ్రేక్ ఇచ్చిన వైసిపి మళ్లీ పార్టీలో చేరడానికి వస్తున్న వారిని ఆహ్వానిస్తుంది.

తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మాజీ ఎమ్మెల్యే చందన రమేష్ టీడీపీకి గుడ్ బై చెప్పి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి పెద్ద దెబ్బ తగిలినట్లయింది.

యరపతినేని టార్గెట్ గా వేగం పెంచిన సీబీఐ .. మైనింగ్ అక్రమాల కేసుతో టెన్షన్ లో టీడీపీ మాజీ ఎమ్మెల్యేయరపతినేని టార్గెట్ గా వేగం పెంచిన సీబీఐ .. మైనింగ్ అక్రమాల కేసుతో టెన్షన్ లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే

రాజమండ్రి రూరల్ మాజీ ఎమ్మెల్యే చందన రమేష్ టీడీపీకి గుడ్ బై

రాజమండ్రి రూరల్ మాజీ ఎమ్మెల్యే చందన రమేష్ టీడీపీకి గుడ్ బై

ఏపీలో వైసిపి అధికారంలో ఉండటంతో టిడిపి శ్రేణులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కొందరు నేతలు అధికార పార్టీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కొందరు జగన్ చేసిన అభివృద్ధిని చూసి పార్టీలోకి వస్తున్నట్లుగా చెబుతున్నారు. అందులో భాగంగానే రాజమండ్రి రూరల్ మాజీ ఎమ్మెల్యే చందన రమేష్ పార్టీకి గుడ్ బై చెప్పి వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.

రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో చేరికలు

రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో చేరికలు

చందన రమేష్ తో పాటు ఆయన తనయుడు నాగేశ్వర్ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. సీఎం జగన్ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగినట్లుగా తెలుస్తోంది.

ఏపీలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను చూసి తాను వైసీపీలో చేరానని చంద్ర రమేష్ పేర్కొన్నారు. రాజమండ్రిలో పార్టీ అభివృద్ధికి తాను కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. చందన రమేష్ చేరికతో రాజమండ్రిలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని మార్గాని భరత్ వ్యాఖ్యానించారు.

Recommended Video

Ayodhya Ram Mandir : మూడేళ్ల లో పూర్తి, పురాతన సాంకేతిక పద్ధతితో నిర్మాణం!! || Oneindia Telugu
కొంతకాలంగా టీడీపీకి దూరంగా .. నేడు వైసీపీలో చేరిక

కొంతకాలంగా టీడీపీకి దూరంగా .. నేడు వైసీపీలో చేరిక

చందన రమేష్ విషయానికొస్తే 2009లో కొత్తగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా అయిన ఎన్నికయ్యారు. ఇక ఆ తర్వాత నుండి ఆ స్థానాన్ని గోరంట్ల బుచ్చయ్య చౌదరి కేటాయించడంతో 2014 ఎన్నికల్లోనూ, 2019 ఎన్నికల్లోనూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయినప్పటికీ టిడిపిలోనే కొనసాగి టిడిపి గెలుపుకు చందన రమేష్ ఎంతగానో కృషి చేశారు.అయితే గత కొంత కాలంగా పార్టీ పట్ల తీవ్ర అసహనంతో ఉన్న ఆయన నేడు జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

English summary
Former Rajahmundry Rural MLA Chandana Ramesh said goodbye to TDP and joined the YCP. He was wearing a YSR Congress party scarf in the presence of Chief Minister YS Jaganmohan Reddy at the camp office in Taadepalli.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X