• search
  • Live TV
రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రాజ్యాంగం తెలియని వీడు చీఫ్ సెక్రెటరీ అంట: ఎల్వీ సుబ్రహ్మణ్యంపై మాజీ ఎంపీ షాకింగ్ కామెంట్స్

|

అమరావతి: తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, లోక్ సభ మాజీ సభ్యుడు జీవీ హర్షకుమార్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జిల్లాలోని దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరి నదిలో పర్యాటక లాంచీ రాయల్ వశిష్ఠ ప్రమాదానికి గురైన సమయంలో 93 మంది ఉన్నారంటూ సంచలన కామెంట్స్ చేసిన ఆయన.. మరోసారి విరుచుకు పడ్డారు. ఈ సారి ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని వాడు.. వీడు అని సంబోధించారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ లో కొన్ని షాకింగ్ కామెంట్స్ ను పోస్ట్ చేశారు. ఓ సీనియర్ ఐఎఎస్ అధికారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మీద జీవీ హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. భారతీయ జనతాపార్టీ రాష్ట్రశాఖ నాయకులు దీనిపై మండిపడుతున్నారు. హర్షకుమార్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

12 ఏళ్ల బాలికపై 30 మంది లైంగిక దాడి: సహకరించిన తండ్రి! వారంతా అతని పరిచయస్తులేనట!

దేవాలయాల్లో హిందూయేతర ఉద్యోగులు గానీ, కిందిస్థాయి సిబ్బంది గానీ వెంటనే సంబంధిత శాఖ కమిషనర్ కు రిపోర్ట్ చేయాలంటూ కిందటి నెల ఎల్వీ సుబ్రహ్మణ్యం ఓ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తిరుమల ఆర్టీసీ బస్సులో ప్రయాణికులకు జారీ చేసిన టికెట్ల వెనుక అన్యమత ప్రచారానికి సంబంధించిన ప్రకటనలు ఉండటం, కర్నూలు జిల్లాలోని శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ముస్లింలకు దుకాణాలను కేటాయించిన సంఘటనల అనంతరం ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. దేవాదాయ శాఖ సహా.. రాష్ట్రంలోని అన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో పని చేస్తోన్న హిందూయేతర ఉద్యోగులు వెంటనే రిలీవ్ కావాలంటూ ఉత్తర్వులను జారీ చేసింది.

former MP GV Harsha Kumar made shocking and controversial comments on Chief Secretary of Andhra Pradesh

దీనిపై ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని తప్పు పట్టారు జీవీ హర్షకుమార్. ఎల్వీ సుబ్రహ్మణ్యం విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వీడియో క్లిప్పింగ్ ను ఆయన తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. దానికి ఘాటు వ్యాఖ్యాలను జత చేశారు. వీడు ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ సెక్రటరీ అంట. రాజ్యాంగం తెలియని వాడు .. వీడు ముందు ఈ రాష్ట్రంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు వుంటున్నారు. కాబట్టి వీడు ఈ ముగ్గురిని సమానంగా చూడలేని వీడిని ఆ పదవి నుంచి తొలగించాలి.. అని రాసుకొచ్చారు. హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. రాజకీయ రంగును పులుముకొంటున్నాయి. దేవాదాయ శాఖలో అన్యమతస్తులను తొలగిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకున్నారంటూ ప్రశంసించిన భారతీయ జనతాపార్టీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి తాజాగా హర్షకుమార్ పై నిప్పులు చెరిగారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని వాడు, వీడు అని సంబోధిస్తూ హర్షకుమార్ వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటు అని అన్నారు. నాగరిక సమాజంలో జీవిస్తోన్న హర్షకుమార్ ఇలా అనాగరిక భాషను ప్రయోగించి తన స్థాయిని దిగజార్చుకున్నారని ధ్వజమెత్తారు. హర్షకుమార్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి బహిరంగంగా క్షమాపణలు చెప్పి, బాధ్యత గల మనిషిగా ఆయన తనను తాను నిరూపించుకుంటారని తాను ఆశిస్తున్నట్లు విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.

English summary
Ex MP GV Harshakumar made shocking and controversy comments on Chief Secretary of Government of Andhra Pradesh in the row of relieving of Non Hindu employees in Endowment department. GV Harshakumar alleged that Chief Secretary LV Subrahmanyam was unbeliever of Constitution of India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X