రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలుగు టెకీ శివ చలపతిరాజు మృతదేహం తరలించేందుకు చందాలు, ఆయనది గోదావరి జిల్లే..

|
Google Oneindia TeluguNews

అమెరికాలో అర్ధాంతరంగా తనువు చాలించిన శివచలపతిరాజును మృతదేహం స్వదేశం తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమెరికాలో పీడిమాంట్ ఏరియా తెలుగు అసోసియేషన్, గో ఫండ్ మీ సంస్థలు విరాళాలు సేకరిస్తున్నాయి. ఇందుకోసం సోషల్ మీడియాలో ఒక పేజీని కూడా క్రియేట్ చేశాయి. శివ మృతదేహం ఇండియాకు తరలించేందుకు భారీగా ఖర్చవుతుందని.. అంతమొత్తంలో అతని కుటుంబం సేకరించలేదని సంస్థలు తెలిపాయి. అందుకోసమే తాము ఈ బాధ్యత తీసుకున్నామని వెల్లడించాయి.

ప్రాణం తీసిన గ్రీన్‌కార్డు: అమెరికాలో తెలుగు యువకుడి బలవన్మరణం, భార్య గర్భవతి..ప్రాణం తీసిన గ్రీన్‌కార్డు: అమెరికాలో తెలుగు యువకుడి బలవన్మరణం, భార్య గర్భవతి..

ఏం జరిగిందంటే..

ఏం జరిగిందంటే..

శివ చలపతిరాజు తన కుటుంబంతో నార్త్ కరోలినాలో ఉంటున్నారు. ఒరాకిల్ కంపెనీలో సాప్ట్‌వేర్ ప్రొగ్రామింగ్ డెవలపర్‌గా పనిచేస్తున్నారు. అతని భార్య సౌజన్య గర్భవతి. అయితే అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్‌కార్డు దరఖాస్తు చేశారు. దానిని అక్కడి అధికారులు బ్లాక్‌లాగ్‌లో పెట్టారు. దీంతో శివ మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అతని బలవన్మరణానికి సరైన కారణం తెలియరాలేదు.

 పుట్టెడు దు:ఖంతో..

పుట్టెడు దు:ఖంతో..

తమ గ్రీన్‌కార్డు బ్లాక్‌లాగ్‌లో ఉండగా.. మరోవైపు భర్త శివ మృతి సౌజన్యను తీవ్రంగా కలచివేసింది. మమూలు మనిషి కూడా కాని సౌజన్య.. పుట్టెడు దు:ఖంతో ఇండియా బయల్దేరారు. తన భర్త మృతికి గ్రీన్‌కార్డు బ్లాక్‌లాగ్ కారణమని ఆమె చెప్తున్నారు. ఒక్క శివనే కాదు చాలామంది గ్రీన్‌కార్డులను బ్లాక్‌లాగ్‌లో అమెరికా ఎంబసీ అధికారులు పెట్టారు.

ఇదీ నేపథ్యం..

ఇదీ నేపథ్యం..

శివ చలపతిరాజు స్వస్థలం ఉభయ గోదావరి జిల్లాలని తెలుస్తోంది. ఆయన ఫేస్‌బుక్‌లో పెట్టిన సమాచారం ఆధారంగా గోదావరి జిల్లాలకు చెందినవారని సమాచారం. శివ రాజమహేంద్రవరంలో చదివారు. తర్వాత హైదరాబాద్‌లో ఉన్నత విద్య అభ్యసించి అమెరికా వెళ్లారు. సాఫ్ట్‌వేర్ ప్రొగ్రామర్‌గా స్థిరపడ్డారు. కొన్నాళ్ల క్రితమే సౌజన్యతో వివాహం జరిగింది. కొద్దిరోజుల్లో తండ్రి కాబోతున్న తరుణంలో ఆత్మహత్య చేసుకోవడం ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది.

విప్రోలో కూడా..

విప్రోలో కూడా..

ఒరాకిల్ సంస్థ కన్న ముందు శివచలపతిరాజు పలు కంపెనీల్లో జాబ్ చేశారు. మిచిగాన్‌లో విప్రో సంస్థలో పనిచేశారు. అంతకుముందు ఇల్లినాయిస్‌లో బ్రిటిష్ పెట్రోలియం కంపెనీలో కూడా విధులు నిర్తర్తించారు. బ్రిటిష్ పెట్రోలియం కంపెనీలో కెరీర్ ప్రారంభించారు. తర్వాత విప్రో, ఒరాకిల్‌కు మారారు. ఆయా కంపెనీల్లో హోదా, శాలరీ వచ్చిన.. గ్రీన్‌కార్డ్ మాత్రం రాకపోవడంతో శివను కలచివేసింది. అందుకోసమే ఆత్మహత్య చేసుకున్నారనే ప్రచారం జరుగుతుంది.

English summary
telugu techie shiva chalapati raju native is godavari dist. he study at rajamahendravaram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X