రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గోదావరి ఉగ్రరూపం .. సీఎం జగన్ ఆరా ..ముంపులో విలీన గ్రామాలు, ప్రమాదంలో ఉభయ గోదావరి జిల్లాలు

|
Google Oneindia TeluguNews

గోదావరి వరదల తాకిడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొనసాగుతుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాలుస్తుంది. దీంతో గోదావరీ పరీవాహక ప్రాంతాల్లో వరద ముంచెత్తుతుంది .అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేసి పరిస్థితి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.

Recommended Video

Telangana Floods: Warangal, Karimnagar and Khammam districts were Affected

భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం ... వాతావరణ శాఖ హెచ్చరికలతో భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం ... వాతావరణ శాఖ హెచ్చరికలతో

 గోదావరి వరద సాగుతుందిలా .. ఏపీకి పెను ప్రమాదం

గోదావరి వరద సాగుతుందిలా .. ఏపీకి పెను ప్రమాదం


ఎగువన ఉన్న మహారాష్ట్ర నుండి, సరిహద్దున ఉన్న చత్తీస్గడ్ తో పాటుగా గోదావరి నదిలోకి వాగుల నుండి వరద నీరు వచ్చి చేరుతోంది. కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు నుండి 9 లక్షల 70 నీరు , ఇంద్రావతి నది తాలిపేరు ప్రాజెక్టు నుండి 1,58,472 క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది. తెలంగాణా రాష్ట్రంలోనూ వర్షాలు దంచికోడుతున్న నేపధ్యంలో గోదావరి ఉధృతి ప్రమాదకరంగా మారింది. ఇక కిన్నెరసాని నది నుండి 45 క్యూసెక్కుల నీరు గోదావరిలో కలుస్తుంది. ఈ వరద అంతా దిగువకు విడుదల చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా వరద ప్రమాదం పొంచి ఉంది.

జలదిగ్బంధంలో విలీన మండలాలు .. ధవళేశ్వరం గేట్ల ఎత్తివేత

జలదిగ్బంధంలో విలీన మండలాలు .. ధవళేశ్వరం గేట్ల ఎత్తివేత

గోదావరి నది పరివాహక ప్రాంతాలైన ఉభయగోదావరి జిల్లాలకు వరద పోటెత్తుతోంది.. విలీన మండలాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి దేవీపట్నం మండలం లో లోకి వరద నీరు చేరుకోవడంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు . గోదావరి వరదతో పాటుగా ఏజెన్సీలో ఉన్న శబరి నది ఉధృతంగా ప్రవహించడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ నుండి భారీగా వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

175 గేట్లను ఎత్తివేసి 17 లక్షల 44 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నీటి మట్టం మరింత పెరిగితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది.

గోదావరి ఉధృతిపై సీఎం జగన్ ఆరా .. అధికారులకు ఆదేశాలు

గోదావరి ఉధృతిపై సీఎం జగన్ ఆరా .. అధికారులకు ఆదేశాలు

పెరుగుతున్న గోదావరి నది ఉధృతి పై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లకు ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వసతులు కల్పించాలని సూచించారు. బాధితుల ర‌క్ష‌ణ చ‌ర్య‌లు, స‌హాయ పున‌రావాస కార్య‌క్ర‌మాల కోసం ఎన్టీఆర్ఎఫ్‌, స‌హా సంబంధిత సిబ్బందిని సిద్ధం చేసుకోవాల‌ని సీఎం జగన్ పేర్కొన్నారు .

పశ్చిమ గోదావరి జిల్లాలో చేరుతున్న వరదనీరు.. పోలవరం ముంపు గ్రామాల్లో ఆందోళన

పశ్చిమ గోదావరి జిల్లాలో చేరుతున్న వరదనీరు.. పోలవరం ముంపు గ్రామాల్లో ఆందోళన

రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లును ఆదేశించారు సీఎం. పశ్చిమ గోదావరి జిల్లా ప్రస్తుతం జలదిగ్బంధంలో చిక్కుకుంది. జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాలలో పలు గ్రామాల్లో కి గోదావరి వరద నీరు వచ్చి చేరుతుంది . తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్న గోదావరి పరివాహక ప్రాంతాలు వరద ముంపుకు గురవుతున్నాయి.

పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు వద్ద భారీగా వరద నీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది .దీంతో పోలవరం పరిసర ముంపు గ్రామాలలో ఆందోళన వ్యక్తం అవుతోంది.

English summary
The Godavari districts, which are the catchment areas of the Godavari River, are being inundated. The merging zones are completely submerged. Locals are panicking as the Sabari River in the agency overflows along with the Godavari floods. Heavy flood water is being released into the sea from the Dhawaleswaram Barrage.CM Jagan reviewing the folw of godavari river on regular basis .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X