రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బోటు ప్రమాద ఘటనపై సుప్రీంకోర్టులో హర్షకుమార్ పిటీషన్.. విచారణ చేస్తున్న ధర్మాసనం

|
Google Oneindia TeluguNews

కచ్చులూరు వద్ద గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంపై మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బోటు లో ఉన్నది 73 మంది కాదు 93 మంది ప్రయాణికులు ఉన్నారని , కావాలని అధికారులు మృతదేహాలను బయటకు తీయకుండా తాత్సారం చేస్తున్నారని ఆరోపించిన విషయం తెలిసిందే. అంతేకాదు ఇందులో అధికారుల పాత్ర, మంత్రి పాత్ర కూడా ఉందని హర్ష కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు బోటును వెలికితీయాలని, బోటును వెలికితీస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని పలుమార్లు పేర్కొన్న మాజీ ఎంపీ హర్షకుమార్ బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా ఆందోళన సైతం చేశారు. ఇక తాజాగా బోటు ప్రమాద ఘటనపై విచారణ చెయ్యాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

గోదావరిలో నాలుగు మృతదేహాలు: కచ్చలూరు ప్రమాద బాధితులవేనా?గోదావరిలో నాలుగు మృతదేహాలు: కచ్చలూరు ప్రమాద బాధితులవేనా?

ఇక ఆ పిటిషన్లో బోటు ప్రమాదంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని పేర్కొన్నారు. ఇంత వరకు ఆచూకీ లేకుండా పోయిన మృత దేహాలను వెంటనే వెలికి తీసేలా ఆదేశాలను ఇవ్వాలని హర్ష కుమార్ సుప్రీం ధర్మాసనాన్ని కోరారు. బోటు ప్రమాద ఘటనపై విచారణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగేలా సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక హర్షకుమార్ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. బోటు ప్రమాద ఘటనపై సుప్రీం ధర్మాసనం విచారణ జరుపుతోంది.

Harshakumar petition in Supreme Court on boat accident

ఇక హర్షకుమార్ విషయానికి వస్తే బోటు ప్రమాద ఘటన విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన రాజమండ్రి లోని న్యాయస్థానం ముందు ఉన్న ఆక్రమణల తొలగింపు వ్యవహారంలో కోర్టు సిబ్బంది తో మహిళలతో దురుసుగా ప్రవర్తించిన కారణంతో ఆయనపై కేసు నమోదైంది. ప్రస్తుతం గతంలో ఉన్న ఆయన కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఇక ఇదే సమయంలో ఆయన బోటు ప్రమాద ఘటనపై సుప్రీం ను ఆశ్రయించడం గమనార్హం.

English summary
Harsha Kumar has filed a petition in the Supreme Court seeking an inquiry into the boat accident. He appealed to the Supreme Court to order the central government to step in to investigate the boat accident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X