రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బోటును బయటకు తియ్యాలని ఆందోళన .. మద్దతుగా హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద జరిగిన బోటుప్రమాద ఘటనలో ఇంకా 16 మంది మృతదేహాలు జలసమాధి లోనే ఉన్నాయి. బోటును బయటికి తీస్తారు అని భావించిన అధికారులు వాటిని వెలికి తీసేందుకు వచ్చిన నిపుణులు మా వల్ల కాదని చేతులెత్తేయడంతో కొద్దిరోజుల ఆగాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో బోటు వెలికితీత పనులు నిలిచిపోయాయి. అయితే బోటును వెలికితీయాలని, తమ వారి మృతదేహాలను తమకు అప్పగించాలని ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలను బయటకు తీయడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్న తీరుపై వారు మండిపడుతున్నారు. వారికి మద్దతుగా నిలిచారు మాజీ మంత్రి హర్ష కుమార్ .

26, 27 తేదీల్లో యధావిధిగా బ్యాంకులు ... సమ్మె వాయిదాకు కారణం ఇదే26, 27 తేదీల్లో యధావిధిగా బ్యాంకులు ... సమ్మె వాయిదాకు కారణం ఇదే

 రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వద్ద మృతుల బంధువుల ఆందోళన

రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వద్ద మృతుల బంధువుల ఆందోళన

రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బోటు ప్రమాదబాధితుల బంధువులు ఆందోళనకు దిగారు. ఆచూకీ లభించని తమవారి కోసం ఆవేదనతో ఎదురుచూస్తున్న వారంతా ప్రభుత్వం బోటును బయటకు తీసే ప్రయత్నాన్ని విరమించడం కరెక్ట్ కాదన్నారు. తమ వారి మృతదేహాలు తమకు అప్పగించాలని , అది ప్రభుత్వ బాధ్యత అని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక అంతే కాదు గోదావరిలో మృతదేహాలను వెలికితీసి అప్పగించకుండా నే డెత్ సర్టిఫికెట్లు జారీ చేస్తామని అధికారులు చెప్పడం దారుణమైన చర్య అని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి.

ప్రమాద ఘటనను హై కోర్టు సుమోటోగా తీసుకోవాలన్న మాజీ మంత్రి హర్షకుమార్

ప్రమాద ఘటనను హై కోర్టు సుమోటోగా తీసుకోవాలన్న మాజీ మంత్రి హర్షకుమార్

బాధిత కుటుంబాల మనోభావాలను దెబ్బతీసేలాగా అధికారులు ప్రవర్తిస్తున్నారని మండి పడుతున్న వారు నిరసనకు దిగగా వారికి మద్దతుగా నిలిచారు మాజీ మంత్రి హర్ష కుమార్. బాధితుల పక్షాన నిరసన దీక్షలో పాల్గొన్న ఆయన బోటును తక్షణం బయటకు తీయాలని, అప్పుడు అసలు విషయాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు.ఈ ప్రమాద ఘటనను హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టాలని కోరిన మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ మునిగిపోయిన బోటును వెలికితీయాలని ప్రభుత్వానికి కోర్టు తక్షణం ఆదేశాలు జారీ చేయాలన్నారు.

 బోటు ప్రమాదంపై మంత్రి కిషన్ రెడ్డి తీరుపై విమర్శలు

బోటు ప్రమాదంపై మంత్రి కిషన్ రెడ్డి తీరుపై విమర్శలు


ఇక బోటు ప్రమాద ఘటనపై రాజకీయ పార్టీల తీరును ఆయన ఎండగట్టారు. మునిగిన బోటును తీయలేమని కలెక్టర్‌ చెబుతున్న మాటలనే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా చెప్పడం దురదృష్టకరమని హర్షకుమార్ వ్యాఖ్యలు చేశారు. తాజాగా రాజమండ్రి దాకా వచ్చి ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పక్కనే ప్రభుత్వాస్పత్రిలో ఉన్న బాధిత కుటుంబాలను పరామర్శించకుండా వెళ్లిపోవడం విచారకరమన్నారు.ఇది బిజెపి నేతల తీరు అని ఆయన మండిపడ్డారు.

జగన్ సర్కార్ ని, టీడీపీ , జనసేన అధినేతలను తూర్పారబట్టిన మాజీ మంత్రి హర్ష కుమార్

జగన్ సర్కార్ ని, టీడీపీ , జనసేన అధినేతలను తూర్పారబట్టిన మాజీ మంత్రి హర్ష కుమార్

ఇక బోటు ప్రమాద ఘటన పై సోషల్ మీడియా వేదికగా చేస్తున్న వ్యాఖ్యలు మినహాయించి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడకు రాలేదన్నారు ఘటనా స్థలానికి వెళ్ళింది లేదని ఆయన ఆరోపించారు. ఏపీ సీఎం జగన్‌ ఏదో విహార యాత్రగా వచ్చి సమీక్ష చేసి వెళ్లిపోవడం మినహా బాధితులకు న్యాయం చేసిందేమీ లేదన్నారు. బోటు బయటకు తీసే ఉద్దేశం అధికారులకు లేదని, ఈ ఘటనకు కారణమైన ఉన్నతాధికారిని కాపాడటానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఆరోపణ చేశారు మాజీ మంత్రి హర్షకుమార్.ఇప్పటికైనా బోటును వెలికితీస్తే అసలు నిజాలు బయటకు వస్తాయని హర్షకుమార్ అంటున్నారు.

English summary
Former Amalapuram MP Harsha Kumar has made sensational comments on Godavari Boat mishap . He supported the victims protest at rajamundry hospital and demanded that the High Court need to take this mishap as sumoto and be summoned to investigate the accident and bring back the sunken boat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X