రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ కు షాకిచ్చి జనసేనను వీడనున్న మరోనేత .. తిరిగి సొంతగూటికి చేరే ఛాన్స్

|
Google Oneindia TeluguNews

ఏపీ ఎన్నికల్లో జనసేన ప్రభావం చూపిస్తుంది అని అందరూ భావించిన పార్టీ ఎలాంటి ప్రభావం చూపించకపోవటంతో ఇప్పుడు దాని ప్రభావం పార్టీపై పడుతుంది. ఓటమిపై సమీక్షలు చేసినా అందరూ ధైర్యంగా ముందుకు వెళ్లాలని దిశా నిర్దేశం చేసినా సరే జనసేన పార్టీ నుండి ఒక్కొక్కరు పార్టీ వీడి వెళ్తున్నారు. జనసేన ఏపీలో శాసనసభ ఎన్నికల్లో ఒక్క స్థానానికే పరిమితం కావటం ఏకంగా పవన్ ఓటమి చెందటం ఇంకా అభిమానులు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు . ఇక ఈ సమయంలో మొన్న రావెల కిషోర్ బాబు పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరితే తాజాగా మరో నేత పవన్ కు షాక్ ఇచ్చి పార్టీ వీడి వెళ్లనున్నారు .

కేసులకు లొంగిపోయిన దద్దమ్మలు .. బాబు లేని సమయంలో ఇలా .. ఆ ఎంపీలపై టీడీపీ నేతల ఫైర్ కేసులకు లొంగిపోయిన దద్దమ్మలు .. బాబు లేని సమయంలో ఇలా .. ఆ ఎంపీలపై టీడీపీ నేతల ఫైర్

పార్టీకి షాక్ ఇచ్చి జంప్ అవుతున్న జనసేన నేతలు

పార్టీకి షాక్ ఇచ్చి జంప్ అవుతున్న జనసేన నేతలు

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ .. రాజకీయాల్లో ఒక సరికొత్త మార్పులు తీసుకు రావాలని తాపత్రయపడ్డారు కానీ అది సాధ్య పడలేదు. మార్పు కోరుకున్న పవన్ పార్టీ ఏపీ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయింది. దీంతో పార్టీలో ఎన్నికలకు ముందు చేరిన నేతలు పార్టీ కి గుడ్ బై చెప్తున్నారు. ఇక ఈ నేపధ్యంలోనే ఎన్నికల్లో ఘోరంగా దెబ్బ తిన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేతలు పార్టీకి రాజీనామా చేసి పక్క పార్టీల్లోకి జంప్ అవ్వటం గట్టి దెబ్బగా మారింది .

పవన్ కు షాక్ ఇవ్వనున్న ఆకుల సత్యన్నారాయణ .. బీజేపీలోకి జంప్ అయ్యే యోచన

పవన్ కు షాక్ ఇవ్వనున్న ఆకుల సత్యన్నారాయణ .. బీజేపీలోకి జంప్ అయ్యే యోచన

ఓటమిపై నేతలు అధైర్యపడవద్దని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పార్టీ నేతలకు సూచించినా ఫలితం లేకుండా పోతుంది .తాజాగా ఆ పార్టీ సీనియర్‌ నేత ఆకుల సత్యనారాయణ జనసేను వీడనున్నారు. తిరిగి ఆయన తన సొంతగూటికి చేరుకోనున్నారు. ఎన్నికల ముందు పార్టీ ఫిరాయించిన ఆకుల సత్యన్నారాయణ ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి లోకసభ స్థానం నుంచి జనసేన తరఫున బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. ఇక దీంతో ఆయన సొంత గూటికే వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. జనసేనకు రాజీనామా చేసి బీజేపీలో చేరేందుకు ఆకుల సత్యన్నారాయణ సిద్ధం అవుతున్నారు .

పార్టీని బలోపేతం చెయ్యాలని పవన్ ఆలోచన .. పార్టీని వీడి వెళ్తున్న నేతలతో ఇబ్బంది

పార్టీని బలోపేతం చెయ్యాలని పవన్ ఆలోచన .. పార్టీని వీడి వెళ్తున్న నేతలతో ఇబ్బంది

ఒకపక్క పార్టీని క్షేత్ర స్థాయి నుండి బలోపేతం చెయ్యాలని, పునర్నిర్మించాలని భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ . పార్టీని బూత్ స్థాయి కమిటీలు వేసి, గ్రామ కమిటీలు వేసి పటిష్టం చెయ్యాలని నిర్ణయించారు . అలాగే జిల్లా స్థాయి సమీక్షలు జరిపిన ఆయన పార్టీని కొత్త పంధాలో మరింత బలంగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ . కానీ అనూహ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ నుండి ముఖ్య నాయకులు పార్టీకి గుడ్ బై చెప్పటం పవన్ కు , అలాగే జనసైనికులకు ఇబ్బందికరంగా మారింది .

English summary
Janasena chief Pawan Kalyan advised party leaders not to disappoint about the defeat. senior party leader of Janasena , Akula Satyanarayana will be leaving the party ,and He will return to bjp . In the recent elections, the party lost the Rajamandri Lok Sabha seat on behalf of Jana Sena. With this, he decided to go on and Satyanarayana is preparing to resign from the Janasena and join the BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X