రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీకి కొత్త వైరస్ భయం .. ఆ ఆంగ్లో ఇండియన్ వల్ల రాజమండ్రిలో కొత్త కరోనా స్ట్రెయిన్ కలకలం

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. 2020 సంవత్సరం మొత్తం ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ మహమ్మారికి వ్యాక్సిన్ దొరికిందని సంతోషపడేలోపే కొత్త రకం కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది . ముఖ్యంగా యూకే నుంచి ఇండియాకు వచ్చిన చాలామందిలో ఈ కొత్త రకం కరోనా వైరస్ వెలుగు చూడడంతో ప్రస్తుతం ఇండియాలో కూడా కొత్త రకం కరోనా వైరస్ పై తీవ్ర ఆందోళన నెలకొంది.

యూకే నుండి వచ్చిన రాజమండ్రికి చెందిన ఆంగ్లో ఇండియన్

యూకే నుండి వచ్చిన రాజమండ్రికి చెందిన ఆంగ్లో ఇండియన్

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కొత్తరకం కరోనావైరస్ కలకలం రేగింది. రాజమహేంద్రవరంలో ప్రజలు ఇప్పుడు కొత్త కరోనా వైరస్ టెన్షన్ లో ఉన్నారు. రాజమండ్రి రూరల్ మండలం హుకుంపేట సమీపంలోని రామకృష్ణ నగర్ కు చెందిన ఒక ఆంగ్లో-ఇండియన్ ఇటీవల యూకే నుండి ఇండియాకు వచ్చారు. ఆమెకు కరోనా పాజిటివ్ గా తేలడంతో ఇప్పుడు అందరిలో కొత్త రకం కరోనా వైరస్ పై ఆందోళన నెలకొంది.ఆమె ఢిల్లీలో హోం క్వారంటైన్ ఉండకుండా తప్పించుకుని రావటంతో ఇప్పుడు ఆమె కోసం అన్వేషణ మొదలైంది .

ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుండి తప్పించుకున్న మహిళకు కరోనా పాజిటివ్

ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుండి తప్పించుకున్న మహిళకు కరోనా పాజిటివ్

ఈనెల 22వ తేదీన యూకే నుంచి విమానంలో ఢిల్లీకి వచ్చిన ఆమెను, ఆమె కుమారుడు ఢిల్లీ వెళ్లి రిసీవ్ చేసుకున్నారు. ఆమె యుకెలో కరోనా పరీక్షలు చేయించుకున్నప్పటికీ ఫలితాలు రాకముందే భారత్ బయలుదేరి వచ్చారు.

ఇండియాకు వచ్చిన తర్వాత కూడా ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు వచ్చే వరకు ఆమె క్వారంటైన్ లో ఉండాల్సి ఉండగా అక్కడి నుంచి పరారైన సదరు మహిళ రాజమహేంద్రవరం రావడానికి ఢిల్లీ నిజాముద్దీన్ ట్రైన్ ఎక్కి నట్లుగా గుర్తించారు. ఇక ఈ విషయాన్ని ధ్రువీకరించుకున్న అధికారులు ఏపీ ప్రభుత్వానికి సమాచారం అందించారు.

నిజాముద్దీన్ ట్రెయిన్ ద్వారా రాజమండ్రికి .. ఆమె కోసం అధికారుల అన్వేషణ

నిజాముద్దీన్ ట్రెయిన్ ద్వారా రాజమండ్రికి .. ఆమె కోసం అధికారుల అన్వేషణ

రాజమహేంద్రవరం పోలీస్ స్టేషన్ కు ఈ సమాచారాన్ని అందించి సదరు మహిళ ను క్వారంటైన్ కి తరలించ వలసిందిగా పేర్కొన్నారు. కొత్త కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన వైద్యాధికారులు ఏపీ ప్రభుత్వానికి సమాచారం అందించినట్లుగా తెలుస్తుంది. ఆమె పాస్ పోర్ట్ ఆధారంగా అడ్రస్ ను గుర్తించిన పోలీసులు వెంటనే అప్రమత్తం చేయడంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆమెను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. ఆమె ఆచూకీ తెలిసిన తరువాత రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కరోనా ఐసోలేషన్ వార్డులో ఆమెకు చికిత్స అందించాలని వైద్య వర్గాలు భావిస్తున్నాయి.

 సూపర్ స్ప్రెడర్ కొత్త కరోనా స్ట్రెయిన్ కావటంతో అందరిలో ఆందోళన

సూపర్ స్ప్రెడర్ కొత్త కరోనా స్ట్రెయిన్ కావటంతో అందరిలో ఆందోళన

దీంతో ఇప్పుడు రాజమండ్రిలో కరోనా కొత్త స్ట్రెయిన్ కలకలం రేగింది. ఆ మహిళ ఎక్కడ ఎవరికీ ఈ కొత్త కరోనా వైరస్ వ్యాపింపజేస్తుందో అన్న ఆందోళన ప్రతి ఒక్కరిలో వ్యక్తమౌతుంది. పాత కరోనా వైరస్ కంటే 70 శాతం వేగంగా కొత్త కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది అన్న సమాచారంతో ప్రజలు విపరీతంగా భయపడుతున్నారు. సూపర్ స్ప్రెడర్ ఇప్పుడు ఏపీలో వ్యాప్తి చెండుతుందా అన్న ఆందోళనలో ఏపీ వాసులున్నట్టు సమాచారం .

English summary
Now a new type of coronavirus is panicing Andhra Pradesh people. Rajahmundry people are now in a new corona virus tension. An Anglo-Indian from Ramakrishna Nagar near Hukumpet in Rajahmundry Rural Zone recently came to India from the UK. She tested corona positive and now everyone is worried about a new type of corona virus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X