రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోనసీమలో కొత్త వైరస్ .. జంతువులను కబళిస్తున్న లంపీ స్కిన్.. చికెన్, మటన్ ముట్టని స్థానికులు

|
Google Oneindia TeluguNews

Recommended Video

Hersis Virus : New Virus In Andhra Pradesh !

ఒకపక్క ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తుంటే కోనసీమను మాత్రం కొత్త రకం వైరస్ భయపెడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమలో కొత్త వైరస్ వ్యాధి జంతువుల ఉసురు తీస్తుంది . హెర్సిస్ అనే వైరస్ జంతువులకు బాగా ప్రబలుతున్న పరిస్థితి కోనసీమ వాసులను ఆందోళనకు గురి చేస్తుంది. ఈ హెర్సిస్ వైరస్ వల్ల లంపి స్కిన్ వ్యాధి బారిన పడుతున్న మూగ జీవాలు పెద్ద ఎత్తున మృత్యువాత పడుతున్నాయని ప్రజలు బాధపడుతున్నారు.

హెర్సీస్ వైరస్ వల్ల లంపి స్కిన్ వ్యాధితో చనిపోతున్న జంతువులు

హెర్సీస్ వైరస్ వల్ల లంపి స్కిన్ వ్యాధితో చనిపోతున్న జంతువులు


ఒక పక్క కరోనా వైరస్ పై భయాందోళనలో ఉన్న ప్రజలు ఇప్పుడు ఈ కొత్త వైరస్ తో ఏం జరుగుతుందో అన్న ఆందోళనలో ఉన్నారు . కోనసీమలో కరోనాను తలపిస్తున్న మరో వైరస్ వ్యాధి ప్రబలిందన్న వార్తలతో ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. హెర్సీస్ వైరస్ వల్ల లంపి స్కిన్ అనే వ్యాధితో జంతువులు, పక్షులు పెద్ద సంఖ్యలో మరణిస్తున్నాయని చెబుతున్నారు.

 వైరస్ వల్ల పశువులకు, కోళ్లకు శరీరంపై భయంకర కణతులు , పుండ్లు ,.. వైద్యం లేదన్న డాక్టర్లు

వైరస్ వల్ల పశువులకు, కోళ్లకు శరీరంపై భయంకర కణతులు , పుండ్లు ,.. వైద్యం లేదన్న డాక్టర్లు


ఇక ఈ వైరస్ వల్ల పశువులకు, కోళ్లకు శరీరంపై భయంకర కణతులు , పుండ్లు , రంధ్రాలు వచ్చి తీవ్ర రక్త స్రావంతో విలవిల్లాడుతున్నాయని స్థానికులు అంటున్నారు. పశు వైద్య శాదికారులు ఏదో ఒకటి చేసి ఈ వైరస్ ప్రబలకుండా చూడాలని వారు కోరుతున్నారు. కోనసీమ ప్రజల్లో పెద్ద ఎత్తున భయాందోళన వ్యక్తం అవుతున్న నేపధ్యంలో అప్రమత్తమైన పశు సంవర్ధక శాఖ చర్యలకుపక్రమించింది. అయితే ఈ వైరస్‌కు ఎలాంటి వైద్యం లేదని పశు వైద్య ఆధికారులు అంటున్నారు. దాంతో ప్రజల్లో భయాందోళన మరింత పెరిగిపోతోంది.

ఇప్పటికే 20 ఆవులు మృతి .. చికెన్, మటన్ తినాలంటే భయపడుతున్న కోనసీమ వాసులు

పెద్ద సంఖ్యలో పశువుల మరణంతో తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు స్థానికులు. ఇప్పటికే వెయ్యికి పైగా ఆవులకు ఈ వైరస్ సోకినట్టు తెలుస్తోంది. అందులో ఇరవై ఆవులు ఇప్పటికే మృతి చెందినట్టు సమాచారం.అయితే ఉత్తరాది నుంచి కోనసీమకు ఈ వైరస్ వ్యాపించినట్టు వెటర్నరీ డాక్టర్లు చెబుతున్నారు.ఇక కోళ్ళకు కూడా ఈ వ్యాధి సోకుతున్న నేపధ్యంలో గుట్టలు గుట్టలుగా కోళ్ళు మృత్యువాత పడుతున్నాయి. ఇక దీంతో కోడి మాంసం తినాలంటే జనాలు భయపడుతున్నారు. కోడి మాంసం తింటే ఆ వ్యాధి తమకు కూడా వస్తుందేమో అని భయాందోళనకు గురవుతున్నారు. దీంతో చికెన్ మాత్రమే కాదు మటన్ తినాలన్నా భయపడుతున్నారు.

English summary
New virus in konaseema in Andhra Pradesh causes animal death. The hersis virus, a predominant condition for animals, worries Konaseema. People are worried that this hersis virus causes a large number of animals and birds infected with Lumpy Skin Disease.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X